nagidream
Green Invicta Electric Scooter Available At 51 Thousand Only: మీరు స్కూటీ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. 95 వేల స్కూటర్ పై ఏకంగా 44 వేల డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో మీరు ఈ స్కూటర్ ని 51 వేలకే సొంతం చేసుకోవచ్చు.
Green Invicta Electric Scooter Available At 51 Thousand Only: మీరు స్కూటీ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. 95 వేల స్కూటర్ పై ఏకంగా 44 వేల డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో మీరు ఈ స్కూటర్ ని 51 వేలకే సొంతం చేసుకోవచ్చు.
nagidream
ఇప్పుడు ఎవరూ కూడా టూవీలర్ కొనేందుకు వెనకాడడం లేదు. పనుల నిమిత్తం బయటకు వెళ్తుంటారు కాబట్టి బండి అనేది అత్యవసరం. ఇక కాలేజ్ కి వెళ్లే కుర్రాళ్ళకి కూడా బండ్లు కొని ఇస్తున్నారు. అయితే మీరు బండి కొనుక్కోవాలని అనుకున్నా లేదా మీ పిల్లలకు బండి కొనాలని అనుకుంటున్నా గానీ ఇదే మంచి ఛాన్స్. గ్రీన్ ఇన్విక్టా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఇప్పుడు భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 కి.మీ. రేంజ్ ఇస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 25 కి.మీ.గా ఉంటుంది. ఇంటర్, డిగ్రీ చదివే కాలేజ్ పిల్లలకు ఇది బాగుంటుంది. ముఖ్యంగా మహిళలకు బాగుంటుంది. ఈ బండికి రిజిస్ట్రేషన్, లైసెన్స్, నంబర్ ప్లేట్ అవసరం లేదు. 25 కి.మీ. వేగానికి మించి వెళ్ళదు కాబట్టి ఈ బండి నడిపేవారు సురక్షితంగా ఉండచ్చు. తల్లిదండ్రులు నిశ్చింతగా ఉండచ్చు.
కరెంట్ తో నడుస్తుంది కాబట్టి పెట్రోల్ భారం అస్సలు ఉండదు. కిలోమీటర్ కి కేవలం 20 పైసలు ఖర్చు అవుతుంది. అంటే 60 కి.మీ. ప్రయాణానికి 12 రూపాయల ఖర్చు అవుతుంది. ప్రొజెక్టర్ లెన్స్ హెడ్ లైట్, ఫ్రంట్ లెఫ్ట్, రైట్ ఇండికేటర్స్, డబుల్ రేర్ మిర్రర్స్, టెయిల్ లైట్ విత్ ఇండికేటర్, బ్యాటరీ లెవల్ ఎంతో తెలియజేసే ఎల్సీడీ డిస్ప్లే ఇచ్చారు. కంఫర్టబుల్ అండ్ కుషనింగ్ సీటు ఇచ్చారు. ట్యూబ్ లెస్ అల్లాయ్ వీల్స్ తో వస్తుంది ఒక్కో టైరు 10 అంగుళాల సైజులో ఉంటుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్, బ్యాక్ టైరుకి డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. 250 వాట్ మోటార్, 48 వోల్ట్ 11 యాంపియర్ బ్యాటరీ ఇచ్చారు. ఈ బండి బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి 4 గంటల నుంచి 6 గంటల సమయం పడుతుంది.
ఒకసారి ఛార్జ్ చేస్తే 60 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇద్దరు మనుషులు కంఫర్ట్ గా ప్రయాణించేలా.. 150 కిలోల లోడ్ కెపాసిటీతో దీన్ని రూపొందించారు. ఈ స్కూటర్ 95 శాతం వరకూ అసెంబుల్ చేయబడి ఉంటుంది. మిగతా 5 శాతం అసెంబుల్ చేసుకోవడానికి టూల్స్ ని ఇచ్చారు. ఈ స్కూటర్ ని అమెజాన్ లో ఆర్డర్ చేయాలి. స్కూటర్ డెలివరీ అయ్యాక వాట్సాప్ ద్వారా కంపెనీ కస్టమర్ కేర్ ని సంప్రదిస్తే టెక్నీషియన్ వచ్చి అసెంబుల్ చేస్తారు. ఈ బండిపై 44 వేలు కాకుండా అదనంగా మరో 1500 రూపాయల వరకూ తగ్గింపు పొందవచ్చు. మీరు ఈ బండిని ఈఎంఐలో కూడా తీసుకోవచ్చు. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుతో బండి కొనుగోలు చేస్తే వడ్డీ పడదు. ఈ స్కూటర్ అసలు ధర రూ. 95 వేలు ఉండగా ఆఫర్ లో రూ. 51 వేలకి అందుబాటులో ఉంది. ఇది నలుపు, నీలం, తెలుపు, బూడిద రంగుల్లో లభిస్తుంది. ఈ స్కూటర్ ని కొనేందుకు ఈ లింక్ (amzn.to/4d602zV) పై క్లిక్ చేయండి.