Dharani
ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి భారీ శుభవార్త. త్వరలోనే ఆ రంగంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఆ వివరాలు..
ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి భారీ శుభవార్త. త్వరలోనే ఆ రంగంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఆ వివరాలు..
Dharani
నేటికి మన సమాజంలో లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ప్రతి ఏటా డిగ్రీలు పూర్తి చేసుకుని వచ్చే విద్యార్థుల సంఖ్యల లక్షల్లో ఉంటే.. ఉద్యోగాలు మాత్రం వేలల్లోనే ఉంటున్నాయి. దాంతో సమాజంలో నిరుద్యోగ సమస్య పెరుగుతుంది. దీనికి తోడు కోవిడ్ తర్వాత చాలా పరిశ్రమల్లో ఉన్న వారినే ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఈ క్రమంలో ఓ వార్త నిరుద్యోగులకు సంతోషాన్ని కలిగిస్తోంది. త్వరలోనే ఆరంగంలో భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీ ఉండబోతుంది. ఏడాదిన్నర కాలంలో ఏకంగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకు అది ఏ రంగం.. ఎవరు అర్హులంటే..
కోవిడ్ మహమ్మారి కారణంగా హాస్పిటాలిటీ పరిశ్రమ తీవ్రంగా దెబ్బ తిన్నది. ఎదురుదెబ్బను ఎదుర్కొంది. ఈ రంగంలో చాలా మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. అయితే ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలువడం, ప్రయాణాలు తిరిగి పుంజుకోవడంతో హోటల్స్ వ్యాపారంలో మళ్లీ డిమాండ్ మళ్లీ పెరిగింది. దీంతో విస్తరణ ప్రణాళికల ఫలితంగా ఈ రంగాల్లో భారీ ఎత్తున నియమకాలు చేపట్టనున్నారు.
హోటళ్ల వ్యాపారం, హాలిడే ప్రయాణాలు పెరగడంతో.. ఆతిథ్య సంస్థలు తమ కార్యకలాపాలను వేగంగా విస్తరించే పనిలో ఉన్నాయి. టీమ్స్‌లీజ్ సర్వీసెస్ అంచనాల ప్రకారం..రాబోయే 12-18 నెలల్లో హోటల్, రెస్టారెంట్, పర్యాటక రంగాల్లో సుమారు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.. ఈ ఉద్యోగ అవకాశాలలో దాదాపు సగం హోటల్ పరిశ్రమలోనే ఉంటాయని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.
త్వరలో హాస్సిటాలిటీ రంగంలో భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీ ఉండనుంది అని తెలస్తోంది. ఇక ఫ్రంట్ డెస్క్ ఏజెంట్లు, గెస్ట్ రిలేషన్స్ మేనేజర్లు, హౌస్ కీపింగ్ సిబ్బందికి విపరీతమైన డిమాండ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మెయింటెనెన్స్ టెక్నీషియన్లు, చెఫ్‌లు వంటి నిపుణులకు కూడా అధిక డిమాండ్ ఉంది. ఆతిథ్య రంగంలోని అన్ని విభాగాల్లోనూ ప్రొఫెషనల్స్‌కు భారీ ఎత్తున డిమాండ్ ఏర్పడనున్నట్లు మ్యాన్‌పవర్ ఏజెన్సీలు నివేదించాయి. సేల్స్, మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, టెక్నికల్ ఉద్యోగాలు, మానవ వనరులు వంటి విభాగాల్లో అధిక మొత్తంలో ఉద్యోగ అవకాశాలు ఉండనున్నాయి.