Hindenburg Research: త్వరలో ఇండియాలో పెద్ద సంచలనం జరగబోతుంది..హిండెన్‌బర్గ్ పోస్ట్

Hindenburg Research: త్వరలో ఇండియాలో పెద్ద సంచలనం జరగబోతుంది..హిండెన్‌బర్గ్ పోస్ట్

Hindenburg Research Tweet On India: గత ఏడాది అదానీ గ్రూప్ ని టార్గెట్ చేసిన హిండెన్ బర్గ్ తాజాగా మరో సంచలనానికి తెరలేపింది త్వరలోనే ఇండియాలో ఒక పెద్ద సంచలనం జరుగుతుందని వెల్లడించింది. దీంతో మరోసారి స్టాక్ వర్గాల్లో ఆందోళన మొదలైంది. హిండెన్ బర్గ్ టార్గెట్ ఎవరు అనే సందేహం అందరిలో నెలకొంది.

Hindenburg Research Tweet On India: గత ఏడాది అదానీ గ్రూప్ ని టార్గెట్ చేసిన హిండెన్ బర్గ్ తాజాగా మరో సంచలనానికి తెరలేపింది త్వరలోనే ఇండియాలో ఒక పెద్ద సంచలనం జరుగుతుందని వెల్లడించింది. దీంతో మరోసారి స్టాక్ వర్గాల్లో ఆందోళన మొదలైంది. హిండెన్ బర్గ్ టార్గెట్ ఎవరు అనే సందేహం అందరిలో నెలకొంది.

అదానీ గ్రూప్ ని టార్గెట్ చేసిన దాదాపు ఏడాదిన్నర తర్వాత అమెరికన్ షార్ట్ సెల్లర్ కంపెనీ హిండెన్ బర్గ్ రీసెర్చ్ మరోసారి సంచలన నివేదికతో తెరపైకి వచ్చింది. మరో సంచలన రిపోర్ట్ తో బాంబు పేల్చేందుకు సిద్ధమైంది. అదానీ గ్రూప్ స్టాక్ మ్యానిప్యులేషన్ చేసిందని.. ఆర్థిక తప్పులకు పాల్పడిందని 2023 జనవరి 24న ఆరోపించింది. దీనికి సంబంధించి ఒక నివేదికను కూడా విడుదల చేసింది. ఈ నివేదిక కారణంగా అదానీ గ్రూప్ స్టాక్స్ మార్కెట్ విలువ 86 బిలియన్ డాలర్లు మేర పతనమయ్యాయి. ఇది జరిగి ఏడాదిన్నర పైనే అయ్యింది. అయితే తాజాగా మరో సంచలన పోస్టుతో తెరపైకి వచ్చింది. భారత్ లో ఏదో పెద్ద విషయమే జరుగుతుంది అంటూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. దీంతో ఒక్కసారిగా ఏం జరగబోతోంది? అన్న క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఈ పోస్టుతో ఒక్కసారిగా హిండెన్ బర్గ్ రీసెర్చ్ మరోసారి పబ్లిక్ అటెన్షన్ ని తనవైపు తిప్పుకుంది. అయితే ఈ పోస్టుతో ఇండియన్ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల్లో ఆందోళన మొదలైంది. మళ్ళీ ఏం బాంబు పేలుస్తుందో అన్న టెన్షన్ నెలకొంది. నివేదిక రాకముందే పలువురిలో ఆందోళన నెలకొంది.  

అయితే వచ్చే సెప్టెంబర్ నెల మధ్యలో అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఒక బిలియన్ డాలర్ల షేర్స్ ని విక్రయించే ఆలోచనలో ఉన్నట్లు రాయిటర్స్ మీడియా వెల్లడించింది. ఇది అదానీ గ్రూప్ మరలా ఈక్విటీ మార్కెట్ లో అడుగు పెట్టడాన్ని సూచిస్తుంది. హిండెన్ బర్గ్ దాడి తర్వాత అదానీ కంపెనీ 2.5 బిలియన్ డాలర్ల విక్రయాన్ని రద్దు చేయవలసి వచ్చింది. అయితే ఇప్పుడు అదానీ కంపెనీ సెప్టెంబర్ నెల మధ్యలో షేర్స్ విక్రయానికి సిద్ధమైంది కాబట్టి ఈసారి హిండెన్ బర్గ్ టార్గెట్ అదానీ అయ్యే అవకాశాలు కనబడడం లేదు. ఈసారి హిండెన్ బర్గ్ వేరే కంపెనీని లేదా సంస్థను టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే హిండెన్ బర్గ్ పెట్టిన ఈ పోస్టు వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు. హిండెన్ బర్గ్ కావాలని భారత స్టాక్ మార్కెట్ ని క్రాష్ చేయాలని చూస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

హిండెన్ బర్గ్ మరోసారి భారత స్టాక్ మార్కెట్ ని, ఆర్థిక వ్యవస్థను తగ్గించే ప్రయత్నం చేస్తూండనై.. జనవరి 2023లో దాని నివేదిక నుంచి మన మార్కెట్ కోలుకోవడమే కాక సెన్సెక్స్ 20 వేల బేస్ పాయింట్ల ర్యాలీని నమోదు చేసిందని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. హిండెన్ బర్గ్ పోస్టుకి భయపడాల్సిన అవసరం లేదని కామెంట్ చేశారు. హిండెన్ బర్గ్ బిజినెస్ స్ట్రాటజీని అమలు చేస్తుందని.. ముందు ఒక కంపెనీ స్టాక్స్ ని అమ్మడం.. ఆ తర్వాత ఆ కంపెనీ మీద ఒక ఫేక్ రిపోర్టుని పబ్లిష్ చేయడం.. స్టాక్స్ కుప్పకూలిన తర్వాత లాభాలు బుక్ చేసుకోవడం చేస్తుందని.. ఇదే స్ట్రాటజీని వేరే కంపెనీ మీద అప్లై చేస్తుందని మరొక నెటిజన్ కామెంట్ చేశారు. హిండెన్ బర్గ్ క్రెడిబిలిటీని అదానీ గట్టిగానే నాశనం చేశారని కామెంట్ చేశారు. ఏది ఏమైనా గానీ హిండెన్ బర్గ్ ఈసారి పెద్ద ప్లానింగ్ తోనే సంచలనానికి తెరలేపింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Show comments