Good News To Bank Customers: ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన HDFC బ్యాంక్.. ఇక పండగే!

ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన HDFC బ్యాంక్.. ఇక పండగే!

Good News To Bank Customers: దేశీయ దిగ్గజ బ్యాంకు అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఈ కారణంగా గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ ప్రయోజనం పొందనున్నారు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ లాభం పొందనున్నారు. ఎస్బీఐ బ్యాంకు బాటలోనే హెచ్డీఎఫ్సీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది.

Good News To Bank Customers: దేశీయ దిగ్గజ బ్యాంకు అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఈ కారణంగా గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ ప్రయోజనం పొందనున్నారు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ లాభం పొందనున్నారు. ఎస్బీఐ బ్యాంకు బాటలోనే హెచ్డీఎఫ్సీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా దేశీయ దిగ్గజ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా ఎస్బీఐ బాటలోనే తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కష్టమర్లకు భారీ ప్రయోజనం చేకూరనుంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రకటించింది. దీంతో గతంలో కన్నా ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక రాబడి రానుంది. 2 కోట్ల రూపాయల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై హెచ్డీఎఫ్సీ వడ్డీ రేట్లను పెంచింది. ఈ వడ్డీ రేట్ల పెంపు జూన్ 10 నుంచే అమలులోకి వచ్చింది. ఇవాళ్టి నుంచి ఎఫ్డీలపై కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ కస్టమర్లకు బ్యాంక్ ఇస్తున్న వడ్డీ రేట్లను గమనిస్తే.. 3 శాతం నుంచి 7.25 శాతం వరకూ వడ్డీ ఇస్తుంది. 7 రోజుల నుంచి పదేళ్ల మధ్య టెన్యూర్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే కనుక 3 నుంచి 7.25 శాతం వడ్డీ అనేది వర్తిస్తుంది. అదే 18 నెలల నుంచి 21 నెలల టెన్యూర్ పై ఎఫ్డీ చేస్తే కనుక వడ్డీ రేటు అధికంగా ఉంటుంది. 7 రోజుల నుంచి 29 రోజుల మధ్యలో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 3 శాతం వడ్డీ ఇస్తుంది. అదే 30 రోజుల నుంచి 45 రోజుల మధ్య ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే కనుక 3.5 శాతం వడ్డీ అనేది వర్తిస్తుంది. 46 రోజుల నుంచి 6 నెలల పీరియడ్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే కనుక 4.5 శాతం వడ్డీ ఇస్తుంది. అదే ఆరు నెలల నుంచి 9 నెలల వ్యవధిలో ఎఫ్డీ చేసినట్లయితే 5.75 శాతం వడ్డీ వస్తుంది. 9 నెలల నుంచి ఏడాది మధ్య ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే కనుక 6 శాతం వడ్డీ పొందవచ్చు.

ఏడాది నుంచి 15 నెలల పీరియడ్ లో ఎఫ్డీ చేస్తే కనుక 6.6 శాతం, 15 నెలల నుంచి 18 నెలల మధ్య ఎఫ్డీ చేస్తే కనుక 7.1 శాతం వడ్డీ అనేది వర్తిస్తుంది. 18 నెలల నుంచి 21 నెలల టెన్యూర్ పై 7.25 శాతం వడ్డీ అనేది లభిస్తుంది. 21 నెలల నుంచి మూడేళ్ళ లోపు టెన్యూర్ లో డిపాజిట్ చేస్తే కనుక 7 శాతం వడ్డీ వస్తుంది. 2 సంవత్సరాల 11 నెలల నుంచి మూడేళ్ళ లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై 7.15 శాతానికి వడ్డీ రేటు పెంచింది. 3 సంవత్సరాల ఒక రోజు నుంచి 4 సంవత్సరాల 7 నెలల ఫిక్స్డ్ డిపాజిట్లపై 7.20 శాతానికి వడ్డీ పెంచింది. 4 సంవత్సరాల 7 నెలల ఒక రోజు నుంచి ఐదేళ్ల లోపు ఎఫ్డీలపై 7.20 శాతం వడ్డీ లభిస్తుంది. 5 సంవత్సరాల ఒక రోజు నుంచి పదేళ్ల టెన్యూర్ ఫిక్స్డ్ డిపాజిట్లపై 7 శాతం వడ్డీ వస్తుంది.

ఇక సాధారణ కస్టమర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్స్ కి అధిక వడ్డీ రేటు ఇస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ చేసే టెన్యూర్ ఆధారంగా 3.5 శాతం నుంచి 7.75 శాతం వరకూ వడ్డీ ఇస్తుంది. 18 నెలల నుంచి 21 నెలల లోపు టెన్యూర్ పై 7.75 శాతం వడ్డీ అనేది ఇస్తుంది. రికరింగ్ డిపాజిట్లపై కూడా బ్యాంకు పలు సవరణలు చేసింది. 27 నెలలు, 36 నెలల ఆర్డీలపై సాధారణ సిటిజన్స్ కి 7.15 శాతం వడ్డీ ఇస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్ కి ఐతే 7.65 శాతం వడ్డీ ఆఫర్ చేస్తుంది. 39, 48, 60 నెలల రికరింగ్ డిపాజిట్లపై సాధారణ సిటిజన్స్ కి 7.20 శాతం వడ్డీ ఇస్తుండగా.. సీనియర్ సిటిజన్స్ కి అత్యధికంగా 7.70 శాతం వడ్డీ ఇస్తుంది.

Show comments