ఆగస్ట్‌ 1 నుంచి HDFC క్రెడిట్‌ కార్డ్‌ కొత్త రూల్స్‌.. ఇకపై ఛార్జీల మోత

HDFC Bank Revises Credit Card Rules From Aug 1 2024: క్రెడిట్‌ కార్డ్స్‌కు సంబంధించి.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త రూల్స్‌ అమల్లోకి తీసుకురానుంది. వీటిని పాటించకపోతే.. ఇక ఛార్జీల మోత మోగనుంది. ఆ వివరాలు..

HDFC Bank Revises Credit Card Rules From Aug 1 2024: క్రెడిట్‌ కార్డ్స్‌కు సంబంధించి.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త రూల్స్‌ అమల్లోకి తీసుకురానుంది. వీటిని పాటించకపోతే.. ఇక ఛార్జీల మోత మోగనుంది. ఆ వివరాలు..

ప్రైవేటు బ్యాంకింగ్‌ రంగంలో అతి పెద్ద బ్యాంకుగా గుర్తింపు తెచ్చుకుంది హెచ్‌డీఎఫ్‌సీ. దేశవ్యాప్తంగా వేల బ్రాంచులతో.. కోట్లాది మంది కస్టమర్లతో బ్యాంకింగ్‌ సేవలు అందిస్తూ.. ప్రైవేటు రంగంలో రెండో అతి పెద్ద బ్యాంకుగా నిలిచింది. తన వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తన క్రెడిట్‌ కార్డు హోల్డర్లకు.. కీలక ప్రకటన జారీ చేసింది. కొత్త నియమ, నిబంధనల్ని అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయాలు.. త్వరలోనే అనగా 2024, ఆగస్టు 1 వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని చెప్పుకొచ్చింది. దాంతో ఛార్జీల మోత మోగనుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులకు సంబంధించి కీలక మార్పులు చేసింది. ఇకపై ఇతర యాప్స్‌ సాయంతో అద్దెలు చెల్లిస్తే.. అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది అని తెలిపింది. అనగా పేటీఎం, క్రెడ్‌, మొబిక్విక్‌, చెక్‌ ఇలా ఇతర థర్డ్‌ పార్టీ పేమెంట్‌ అప్లికేషన్స్‌ ఉపయోగించి.. రెంటల్‌ ట్రాన్సాక్షన్స్‌ చేసినట్లయితే.. ఆ లావాదేవి నగదు మొత్తంలో ఇకపై ఒక శాతం రుసుము చెల్లించాల్సి వస్తుంది. అంతేకాక యుటిలిటీ ట్రాన్సాక్షన్లపైనా కూడా కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. అనగా రూ.50 వేల లోపు చేసే లావాదేవీలపై ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయరు. ఒకవేళ ట్రాన్సాక్షన్‌ 50 వేల రూపాయల పైనే ఉంటే.. ఒక శాతం ట్రాన్సాక్షన్‌ ఫీజు పడుతుంది. అలానే ఒక లావాదేవిపై గరిష్టంగా రూ.3 వేల వరకు  ట్రాన్సాక్షన్‌ ఫీజు ఉంటుంది. అయితే ఇన్సూరెన్స్‌ ట్రాన్సాక్షన్స్‌కు మాత్రం ఈ ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రకటించింది.

అలానే ఫ్యూయెల్‌ ట్రాన్సాక్షన్లపైన ఈ ఛార్జీలు అమల్లోకి రాబోతున్నాయి. ఈ విలువ 15 వేల రూపాయలు దాటితే మాత్రం అప్పుడు మొత్తం ట్రాన్సాక్షన్‌ నగదుపై ఒక శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా గరిష్టంగా 3 వేల మేర చెల్లించాలి. అలానే థర్డ్‌ పార్టీ యాప్స్‌ ఉపయోగించి చేసే ఎడ్యుకేషనల్‌ ట్రాన్సాక్షన్లపైనా ఒక శాతం ఫీజు వసూలు చేస్తామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రకటించింది. అయితే దీంట్లో ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ పేమెంట్లకు మినహాయింపు కల్పించింది.

అంతేకాక నేరుగా కాలేజీ లేదా స్కూల్‌ వెబ్‌సైట్స్‌, సంబంధిత పీఓఎస్‌ మెషీన్ల ద్వారా చేసే ట్రాన్సాక్షన్లకూ ఇందులో మినహాయింపు ఉంది. అలానే అంతర్జాతీయ క్రాస్‌ కరెన్సీ ట్రాన్సాక్షన్లపై 3.5 శాతం మార్క్‌అప్‌ ఫీజు చెల్లించాలి. అవుట్‌స్టాండింగ్‌ అమౌంట్‌ ప్రతి పాదికన లేట్‌ పేమెంట్‌ ఫీజు స్ట్రక్చర్‌ మార్చింది. ఇది 100-300 రూపాయల వరకు ఉంటుంది. వీటితో పాటు ఇంకా ఇతర ఛార్జీలు కూడా ఉన్నాయి. ఈ పూర్తి వివరాల కోసం బ్యాంక్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Show comments