ఈ యాప్స్‌లో కిరాణ సరుకులను కొంటే.. భారీ క్యాష్‌బ్యాక్ గ్యారంటీ

Grocery Apps: నేటి కాలంలో గుండుసూది మొదలు.. గోల్డ్‌ వరకు ప్రతి దాన్ని ఆన్‌లైన్‌లో కొంటున్నాము. ఈ క్రమంలో కిరాణ సరుకులును కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. వాటి కోసం ఎన్నో యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇంతక అవి ఏ యాప్‌లు అంటే..

Grocery Apps: నేటి కాలంలో గుండుసూది మొదలు.. గోల్డ్‌ వరకు ప్రతి దాన్ని ఆన్‌లైన్‌లో కొంటున్నాము. ఈ క్రమంలో కిరాణ సరుకులును కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. వాటి కోసం ఎన్నో యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇంతక అవి ఏ యాప్‌లు అంటే..

మన దేశంలో డిజిటల్‌ అమ్మకాలు, కొనుగోళ్లు విరివిగా పెరిగాయి. కరివేపాకు నుంచి కంప్యూటర్ల దాకా ఆన్‌లైన్‌లో దొరకని వస్తువులు లేదు. నిత్యవసరాలు, బట్టలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, కిచెన్‌ సామాగ్రి వంటివన్ని ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి. ఇక ఈ రంగంలో కొన్ని ఈ కామర్స్‌ సంస్థలు దూసుకుపోతున్నాయి. మరీ ముఖ్యంగా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌.. వంటి కంపెనీల మధ్య గట్టి పోటీ నెలకొని ఉంది. ఇక ఈ మధ్య కాలంలో ఫుడ్‌ డెలివరీ సంస్థలు.. సరుకుల రవాణా కూడా ప్రారంభించాయి. ఈ యాప్స్ సాయంతో మీరు ఇంట్లో బియ్యం, పప్పు, నూనె, ఉప్పు వంటి వాటిని ఎక్కడి నుండైనా ఆర్డర్ చేయొచ్చు.

ఇక కొన్ని యాప్‌లు అయితే కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే మనం ఆర్డర్‌ చేసిన సరుకులను ఇంటికి తీసుకువచ్చి అందజేస్తున్నాయి. ఇక ఈ యాప్‌ల వల్ల.. ఇల్లు కదలకుండా మన పనులు పూర్తి అవ్వడం మాత్రమే కాక.. ఈ ఆర్డర్‌లపై కొన్ని ఈకామర్స్‌ సంస్థలు భారీ క్యాష్‌ బ్యాక్‌ కూడా అందిస్తున్నాయి. ఇక మీ ఇంటికి చౌకగా కిరాణ సామాగ్రిని అందించే యాప్స్ ఏవి.. ఎందులో ఎక్కువ ఆఫర్లు, క్యాష్‌ బ్యాక్‌ ఇస్తున్నాయి. వంటి వివరాలు మీ కోసం..

అమెజాన్..

ఇక ఈ ఆన్‌లైన్‌ ఇకామర్స్‌ యాప్‌ గురించి తెలియని వారు మన దేశంలో లేరు అంటే అతిశయోక్తి కాదు. దీనిలో ఎలక్ట్రానిక్స్ మొదలు దుస్తుల, కిచెన్‌ సామాగ్రి ఇలా ఏవైనా ఆర్డర్‌ చేసుకోవచ్చు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఈ కంపెనీ అమెజాన్ గ్రాసరీ అనే మరో యాప్‌ను తీసుకొచ్చింది. ఇందులో మీరు చాలా తక్కువ ధరకు రోజువారీ సరుకులను, కిరాణ సామాగ్రిని ఆర్డర్ చేయొచ్చు. ఇందులో క్యాష్ ఆన్ డెలివరీతో పాటు యూపీఐ, క్రెడిట్ కార్డు ద్వారా కూడా చెల్లింపులు చేయొచ్చు. అలాగే తొలిసారిగా కొనుగోలు చేసిన వారికి 100-200 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ లభించనుంది.

ఫ్లిప్‌కార్ట్..

ఇక మరో ప్రముఖ ఇకామర్స్‌ యాప్‌ ఫ్లిప్‌కార్ట్‌. దీనిలో కూడా మారు నిత్యవసరాలు కొనుగోలు చేయవచ్చు. దీనిలో బియ్యం, వంటనూనె, డిటర్జెంట్ ఐటమ్స్‌తో పాటు వ్యక్తిగత సంరక్షణకు సంబంధించిన సబ్బులు, షాంపూల వరకు ప్రతిదీ ఆర్డర్ చేయొచ్చు. ఇందులోనూ ఆన్‌లైన్, క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యాలు ఉన్నాయి. డెబిట్-క్రెడిట్ కార్డులు, యూపీఐ యాప్స్ కూడా క్యాష్‌బ్యాక్ అందిస్తాయి.

టాటా బిగ్ బాస్కెట్..

చౌకగా కిరాణా సామ్రాగిని ఆర్డర్‌ చేసుకోవాలంటే.. బిగ్‌ బాస్కెట్‌ బెటర్‌. టాటా గ్రూప్ యాజమాన్యం దీనిని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక ఈ యాప్ ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లో సరుకులు మన ఇంటికి డెలివరీ చేస్తుందని ఆ కంపెనీ పేర్కొంది. అంటే, ఏదైనా వస్తువులను ఆర్డర్ చేసిన తర్వాత, కేవలం పది నిమిషాల్లో మీ ఇంటి దగ్గరకు వచ్చేస్తుంది. ఇందులోనూ మొదటగా ఆర్డర్ చేసిన వారికి క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ లభించనున్నాయి.

జోమాటో బ్లికంట్‌..

ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ప్లాట్‌ఫారమ్ కూడా కిరాణా సామాగ్రి డెలివరీ కోసం ఒక ప్రత్యక యాప్‌ను తీసుకువచ్చింది. అదే బ్లింకిట్. మీకు కూరగాయలు, మసాలా దినుసులు త్వరగా కావాలనుకుంటే ఈ యాప్ లో ట్రై చేయొచ్చు. బియ్యం, పప్పు, నూనె, ఉప్పు, సబ్బు, షాంపూ వరకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్ లో బుక్ చేసిన 10 నిమిషాల్లోనే మన ఇంటికి సరుకులు తీసుకువచ్చి ఇస్తారు. ఇందులోనూ క్యాష్ ఆన్ డెలివరీ, యూపీఐ పేమెంట్లను చేయొచ్చు.

ఇతర యాప్‌లు..

పైన పేర్కొన్న యాప్స్ మాత్రమే కాకుండా, కిరాణా సరుకుల డెలీవరి కోసం కొన్ని ఇతర యాప్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. స్విగ్గీ ఇన్ స్టామార్ట్, జియో మార్ట్, జెప్టో, పొట్లం వంటి యాప్స్ వంటివి అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ కూడా వివిధ ఆఫర్లు, క్యాష్ బ్యాక్స్ ఉన్నాయి. వీటిలో రోజువారీ అవసరమైన ఉత్పత్తులను చాలా తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్ నుంచి ఆర్డర్ చేయొచ్చు. ఈసారి ఈ యాప్స్‌లో కిరాణా సామాగ్రిని ఆర్డర్‌ చేసి.. అధిక లాభాలు పొందండి.

Show comments