Green Master EV Jeep: ఆటో వింగ్స్ గ్రీన్ మాస్టర్ ఈవీ జీప్.. రెండున్నర లక్షలకే బెస్ట్ వింటేజ్ వెహికల్

Green Master EV Jeep: ఆటో వింగ్స్ గ్రీన్ మాస్టర్ ఈవీ జీప్.. రెండున్నర లక్షలకే బెస్ట్ వింటేజ్ వెహికల్

EV Jeep At Rs. 2.60 Lakh: ఇప్పటి వరకూ ఎలక్ట్రిక్ స్కూటర్స్, ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ కార్లు రావడం చూశారు. అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ జీపులు కూడా వస్తున్నాయి. కస్టమర్స్ అభిరుచికి తగ్గట్టు కొత్త మోడల్స్ నే కాకుండా వింటేజ్ లుక్ తో కూడా వెహికల్స్ ని తయారు చేస్తున్నాయి. అయితే తక్కువ ధరకే ఇవి అందుబాటులో ఉండడం విశేషం.

జీపులు ఒకప్పుడు ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇందులో ఓపెన్ టాప్ జీపులు కూడా ఉన్నాయి. టాప్ కలిగిన జీపులని ఎక్కువగా పోలీసులు వాడేవారు. ఓపెన్ టాప్ జీపులని ప్రైవేటు వ్యక్తులు వాడేవారు. ఓపెన్ టాప్ జీపులో వెళ్తుంటే రాయల్ గా ఫీలయ్యేవారు. అయితే ఇప్పుడు ఈ లుక్ తో జీపులు రావడం లేదు. ఇప్పుడంతా సరికొత్త మోడల్స్ వస్తున్నాయి. అయితే మీరు కనుక ఈ వింటేజ్ జీపు లవర్స్ అయితే కనుక మీకో గుడ్ న్యూస్. ఆటో వింగ్స్ అనే కంపెనీ వింటేజ్ జీపులని తయారు చేస్తుంది. అది కూడా ఎలక్ట్రిక్ వెర్షన్ ని తయారు చేస్తుంది. గ్రీన్ మాస్టర్ ఈవీ జీప్ పేరుతో వింటేజ్ జీపులని తయారు చేస్తుంది. ఇదొక ఎలక్ట్రిక్ ఎస్యూవీ. దీన్ని హర్యానాలోని గ్రీన్ మాస్టర్ అనే కంపెనీ తయారు చేసింది.

ఇది సింగిల్ ఫ్రేమ్ టాటా టిస్కాన్ ఛాసిస్ ని కలిగి ఉంది. దీన్ని సింగిల్ మాడ్యూల్ లో ఎఫ్ఎఫ్పీ ఫైబర్ షెల్ బాడీతో తయారు చేశారు. ఇది రెండేళ్ల బ్యాటరీ వారంటీతో వస్తుంది. 3.5 కిలో వాట్ లిథియం అయాన్ బ్యాటరీతో, 1500 వాట్ ఎలక్ట్రిక్ మోటార్ తో వస్తుంది. 2 హెచ్పీ పవర్, 9 ఎన్ఎం టార్క్ తో వస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 40 కి.మీ.గా ఉంది. సింగిల్ ఛార్జ్ తో 100 కి.మీ. రేంజ్ ని ఇస్తుంది. దీని కెర్బ్ వెయిట్ 350 కిలోలు. 4 గంటల్లో 100 శాతం ఛార్జింగ్ ఎక్కుతుందని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. దీని ఒక్కో వీల్ 15 అంగుళాల స్టీల్ మెటీరియల్ తో వస్తుంది. ఇంటీరియర్ లో సీట్లను నియోప్రేన్ లెదర్ తో తయారు చేశారు. 4 సీటర్ కెపాసిటీతో వస్తుంది. ముందు ఇద్దరు, వెనుక ఇద్దరు కూర్చునేలా దీన్ని డిజైన్ చేశారు.

జీపు ముందు భాగంలో ట్రంక్ ని ఇచ్చారు. ఇందులో బూట్ స్పేస్ ఎక్కువ ఇచ్చారు. ఇది రెండు మోడల్స్ లో వస్తుంది. ఒకటి టాప్ తో, మరొకటి ఓపెన్ టాప్ తో వస్తుంది. ఇది మిలిటరీ గ్రీన్, పసుపు, నీలం, తెలుపు, నలుపు, మెరూన్, గ్రే కలర్స్ లో అందుబాటులో ఉంది. దీని ధర విషయానికొస్తే.. ఢిల్లీ ఆన్ రోడ్ ధర రూ. 2.60 లక్షల నుంచి రూ. 2.90 లక్షలుగా ఉంది. పలువురి కస్టమర్స్ కి కూడా ఈ జీపుని డెలివరీ చేశారు. ఈ జీపు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్ లో గ్రీన్ మాస్టర్ డాట్ ఇన్ ప్రొఫైల్ కి వెళ్ళచ్చు. అందులో వారి కాంటాక్ట్ వివరాలు ఇచ్చారు. జీపు వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Show comments