P Venkatesh
మీరు ఈ మధ్య ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి విడుదలైంది. సింగిల్ ఛార్జ్ తో 136 కీ.మీల దూరం ప్రయాణించగలదు.
మీరు ఈ మధ్య ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి విడుదలైంది. సింగిల్ ఛార్జ్ తో 136 కీ.మీల దూరం ప్రయాణించగలదు.
P Venkatesh
ఎలక్ట్రిక్ వాహనాలకు వాహనదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీలు సరికొత్త మోడళ్లను రూపొందిస్తూ మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. స్టన్నింగ్ లుక్స్, అధునాతన టెక్నాలజీ ఉపయోగించి కళ్లు చెదిరే ఫీచర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్లను, బైక్ లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. పెట్రోల్ ధరల నుంచి విముక్తి పొందేందుకు ఖర్చులు తగ్గించుకునేందుకు ఎలక్ట్రిక్ వెహికిల్స్ కొనేందుకు ఇంట్రస్టు చూపిస్తున్నారు. ఈ క్రమంలో మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి విడుదలయ్యింది. ప్రముఖ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేసింది.
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలన్నీ ఈవీలను రూపొందించే పనిలో పడ్డాయి. ఇప్పటికే ఓలా, ఏథర్, రివోల్ట్, బజాజ్, టీవీఎస్ వంటి కంపెనీలు ఎలక్ట్రిక్ టూవీలర్స్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేశాయి. ఇప్పుడు గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసింది. ఈ స్కూటర్ ధర రూ. 1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్). సింగిల్ ఛార్జ్ తో 136 కి.మీల దూరం ప్రయాణించొచ్చు. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం ఎస్‌టీ, ఈఎక్స్ అనే రెండు వేరియంట్లలో వస్తుంది. టాప్-ఎండ్ ఎస్‌టీ వేరియంట్ ధర రూ. 1.20 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరలుగా కంపెనీ పేర్కొంది.
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఆంపియర్ నెక్సస్ కోసం వినియోగదారులు ముందుగానే రూ. 9,999కి బుకింగ్ చేసుకోవచ్చు. ఆంపియర్ నెక్సస్ 7-అంగుళాల టచ్‌స్క్రీన్ టీఎఫ్‌టీ డిస్‌ప్లేతో వస్తుంది. అంతేకాదు.. గంటకు 93 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని కలిగి ఉంది. 3కేడబ్య్లూహెచ్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీని అమర్చారు. 3 గంటల 22 నిమిషాల్లో ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. ఆంపియర్ సరికొత్త ఇ-స్కూటర్ 5 రైడింగ్ మోడ్‌లతో వస్తుంది. ఐపీ67 రేటింగ్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో అమర్చబడి ఉంది. నెక్సస్ ఈవీ స్కూటర్ మొత్తం జాన్స్కర్ ఆక్వా, ఇండియన్ రెడ్, లూనార్ వైట్ స్టీల్ గ్రే అనే 5 కలర్ ఆప్షన్‌లలో పొందవచ్చు. మే నెలలోనే ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు ప్రారంభం కానున్నాయి.