Pradhan Mantri Awas Yojana : సొంతింటి కళ నెరవేర్చుకోండి?.. కొత్తగా ఇళ్లు కట్టుకునే వారికి రూ.4లక్షలు

సొంతింటి కళ నెరవేర్చుకోండి?.. కొత్తగా ఇళ్లు కట్టుకునే వారికి రూ.4లక్షలు

Pradhan Mantri Awas Yojana : మీరు సొంతిల్లు లేదని బాధపడుతున్నారా? సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం 4 లక్షలు అందిస్తోంది.

Pradhan Mantri Awas Yojana : మీరు సొంతిల్లు లేదని బాధపడుతున్నారా? సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం 4 లక్షలు అందిస్తోంది.

సొంతిళ్లు ఉండాలని ప్రతి ఒక్కరు కోరకుంటారు. ఇప్పటికీ దేశంలో ఇళ్లు లేని వారు ఎంతో మంది ఉన్నారు. అద్దె ఇళ్లల్లో ఉంటూ జీవితాలను గడుపుతున్నారు. సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు పైసా పైసా కూడ బెట్టుకుని ఇళ్లు కట్టుకోవాలని ఆలోచిస్తున్నారు. కానీ నేడు ప్రతి వస్తువు ధరలు పెరగడం, చాలీ చాలని జీతాలు, పిల్లల స్కూల్ ఫీజులతో సంపాదించిందంతా ఖర్చై పోతున్నది. సొంతింటి కల కలగానే మిగిలిపోతున్నది. ఈ క్రమంలో ఇలాంటి పేదలకు సాయం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి. మరి మీరు కూడా కొత్త ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రభుత్వం నాలుగు లక్షలు అందిస్తోంది.

ఈ రోజుల్లో కొత్తగా ఇల్లు కట్టుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. చేతిలో కొంత డబ్బు ఉన్నా కూడా లోన్ తీసుకోకుండా పూర్తవదు. మళ్లీ అప్పులు చేయాల్సి వస్తుంది. పేదవారికి ఇది తలకు మించిన భారం అవుతుంది. కాబట్టి ఇలాంటి వారికి అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా కేంద్రం 2.5 లక్షలు అందిస్తుంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా 1.5 లక్షలు లబ్ధిదారులకు అందించాలని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టం చేసింది. అంటే కొత్తగా ఇల్లు నిర్మించుకునే వారు రూ. 4 లక్షలు పొందొచ్చన్నమాట.

ఈ డబ్బుతో మీ సొంతింటి కలను నెరవేర్చుకోవచ్చు. 2024-25 సంవత్సరంలో అమలు కానున్న ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పట్టణ) 2.0 పథకం మార్గదర్శకాలను కేంద్రం సవరించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి తమ వాటా నిధుల్ని కేటాయించాల్సిందేనని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పట్టణాల్లో పీఎంఏవై 2.0 కింద 2024-25లో దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇళ్లు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. పేద, మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నది. కోట్లాదిమంది ప్రజలకు లబ్ధి చేకూరనున్నది.

Show comments