తక్కువ ధరకే మంచి ఫోన్ కావాలా? Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ లో భారీ ఆఫర్లు!

Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఫోన్ లపై ఆఫర్లు మాములుగా లేవనే చెప్పాలి. ఈ సేల్ సెప్టెంబర్ 27న అందుబాటులో రాబోతుంది.

Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఫోన్ లపై ఆఫర్లు మాములుగా లేవనే చెప్పాలి. ఈ సేల్ సెప్టెంబర్ 27న అందుబాటులో రాబోతుంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 లో స్మార్ట్ ఫోన్ లపై ఆఫర్లు మాములుగా లేవనే చెప్పాలి. ఈ సేల్ సెప్టెంబర్ 27న వినియోగదారులందరికీ అందుబాటులో రాబోతుంది. అయితే ఫ్లిప్ కార్ట్ ప్లస్ కస్టమర్లకు డిస్కౌంట్ ఆఫర్లు ఒకరోజు ముందుగానే అందుబాటులోకి వచ్చాయి. రూ. 20 వేల కంటే తక్కువ ధరకు ఫోన్ కొనాలనుకునేవారికి ఇంతకన్నా మంచి ఆఫర్లు మళ్ళీ రావు. ఈ సేల్ లో అతి తక్కువ ధరకే లభించే ఫోన్ల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

నథింగ్ ఫోన్ 2a స్మార్ట్ ఫోన్ ని ఈ సేల్‌లో వినియోగదారులు అన్ని బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్చేంజి ఆఫర్లు ఇంకా ఇతర డిస్కౌంట్‌లతో కేవలం రూ. 18000 ధరతో కొనుగోలు చేయవచ్చు. నథింగ్ ఫోన్ 2a స్టైలిష్, పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ MediaTek Dimensity 7200 Pro ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఇది స్పీడ్ గా స్మూత్ గా ఉండే పెర్ఫార్మన్స్ ని అందిస్తుంది. ఇక ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ ని కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇది 50MP+50MP డ్యూయల్ కెమెరా సెటప్, 32 MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది 8 జీబి ర్యామ్, 256 ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఇక ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ తక్కువ ధరకే వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 8GB RAM వేరియంట్‌ను వినియోగదారులు అన్ని డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్‌లతో కలిపి కేవలం రూ.19000 కి కొనుగోలు చేయవచ్చు. ఇది ప్రీమియం స్మార్ట్‌ఫోన్, ఇది సూపర్ ఫీచర్లు, స్టైలిష్ డిజైన్‌తో కలిగి ఉంటుంది. ఇది 6.7-ఇంచెస్ ఫుల్ HD+ P-OLED డిస్‌ప్లేను కలిగి ఉంది.ఈ స్మార్ట్ ఫోన్ Snapdragon 7s Gen 2 ప్రాసెసర్‌తో రానుంది. ఇది చాలా పవర్ ఫుల్ గా పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇది 50MP+ 13MP కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ 32 MP కెమెరా కలిగి ఉంటుంది. ఇంకా 5000mAh బ్యాటరీ, 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో, మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ వస్తుంది.ఇది 128 జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది.

Show comments