Jitendra EV: వాహనదారులకు గుడ్ న్యూస్! జితేంద్ర నుంచి భారీ ఆఫర్లు!

Jitendra EV: జితేంద్ర EV నాసిక్ కి చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ. ఈ కంపెనీ కస్టమర్లకు అందుబాటు ధరలో బైక్స్ ని అందిస్తుంది.

Jitendra EV: జితేంద్ర EV నాసిక్ కి చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ. ఈ కంపెనీ కస్టమర్లకు అందుబాటు ధరలో బైక్స్ ని అందిస్తుంది.

ప్రస్తతం పండుగల సీజన్ కావడంతో పలు ఆటోమొబైల్ కంపెనీలు వాహనదారులకు ఆఫర్లు ఇస్తున్నాయి. ముఖ్యంగా టూ వీలర్ కొనుగోలు చెయ్యాలని భావించే వారికి భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా కంపెనీలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇక అందులో భాగంగా తాజాగా దేశంలోని ఫేమస్ ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ జితేంద్ర ఈవీ ఆఫర్లను ప్రకటించింది. ఈ కంపెనీ ఆగస్టు బొనాంజా పేరుతో కొత్త ఆఫర్‌ని ప్రకటించింది. దాని గురించి పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కంపెనీ జితేంద్ర ఈవీ క్యాష్‌బ్యాక్‌తో కస్టమర్లకు ఈ భారీ ఆఫర్లను అందిస్తోంది. ఈ నెలాఖరు దాకా ఇదే ఆఫర్‌ ఉంటుంది. ఈ ఆఫర్‌తో తన సేల్స్‌ పెంచుకోవాలని జితేంద్ర భావిస్తుంది. ఇక ఆఫర్ల విషయానికి వస్తే ఈవీ JMT 1000 HS కొనుగోలు చేస్తే రూ.10,000, JMT 1000 3K కొనుగోలు చేస్తే రూ.20,000 ఇన్‌స్టంట్‌ క్యాష్‌బ్యాక్‌ వస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే ఈ రెండు మోడళ్లపై కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్‌ని కూడా అందిస్తోంది. ఆగస్టు 10 నుంచి 26 దాకా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అంటే ఇంకా వారం దాకా ఈ ఆఫర్ ఉంటుంది.

జితేంద్ర తన లాయల్టీ కస్టమర్లపై కోసం స్పెషల్ డిస్కౌంట్ ని కూడా ఆఫర్ చేస్తుంది. ఈ మోడళ్లను కొనే కస్టమర్ల కోసం రూ .5,000 ఎక్స్ట్రా లాయల్టీ బోనస్‌ని ఇస్తుంది.తన కంపెనీకి చెందిన లో-స్పీడ్ లేదా హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్స్ ని ఇప్పటికే కొనుగోలు చేసిన వినియోగదారులు ఈ బోనస్‌ని క్లెయిమ్‌ చేసుకోవచ్చని తెలిపింది. అయితే ఈ ఆఫర్‌ కావాలంటే కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాలని కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్‌ పొందాలంటే మీ పాత బండ్లుకి సంబంధించిన పాత డాక్యుమెంట్లను కచ్చితంగా ఇవ్వాలి. ఈవీ హైస్పీడ్ మోడల్ అయితే RC బుక్, లో-స్పీడ్ మోడల్ అయితే సేల్స్ ఇన్వాయిస్ ఇవ్వాలి.. ఇలా లాయల్టీ బోనస్ ని రెగ్యూలర్‌ కస్టమర్లను ఆకట్టుకోవడానికి కంపెనీ ఇస్తుంది.

కొత్తగా ఈ కంపెనీ యొక్క ఈవి బైక్స్ కొనుగోలు చేసే వారు క్యాష్‌బ్యాక్ ఆఫర్, ఫ్రీ ఇన్స్‌రెన్సూ ప్రయోజనాలను కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ కంపెనీ ఇటీవలే JMT మోడల్‌ని అప్‌గ్రేడ్ చేసింది. JMT 1000 HS స్కూటర్‌ ధర రూ. 92 వేల నుంచే నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఆఫర్ కింద దీనిని రూ.83 వేల లోపే కొనుగోలు చేయవచ్చు. దీనిలో కస్టమైజేషన్‌ బ్యాటరీ ఆప్షన్స్‌, అప్డేటెడ్ ఫీచర్లు ఉంటాయి. హై రేంజ్‌ డ్యూయల్ బ్యాటరీ సెటప్, సింగిల్ బ్యాటరీ ప్యాక్ లలో బైక్స్ లభిస్తాయి.సింగిల్ బ్యాటరీలు గల JMT 1000 HS ఫుల్‌ ఛార్జ్‌పై 83 కిలోమీటర్ల రేంజ్‌ని ఇస్తుంది. ఇక హై రేంజ్ JMT1000 3K ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 136 కిలోమీటర్లు రేంజ్ వస్తుంది.

 

Show comments