బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికి ఇదే బంగారం లాంటి ఛాన్స్! వద్దన్నా లాభం పక్కా!

Invest in Gold: మన దేశంలో బంగారం చాలా సెంటిమెంట్ తో కూడుకున్నది. ఒకప్పుడు బంగారాన్ని ఆభరణాలుగానే చూశారు.. కానీ ఇప్పుడు పెట్టుబడి సాధనంగా మారిపోయింది. దేశంలో బంగారంపై ఇన్వెస్ట్ చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది.

Invest in Gold: మన దేశంలో బంగారం చాలా సెంటిమెంట్ తో కూడుకున్నది. ఒకప్పుడు బంగారాన్ని ఆభరణాలుగానే చూశారు.. కానీ ఇప్పుడు పెట్టుబడి సాధనంగా మారిపోయింది. దేశంలో బంగారంపై ఇన్వెస్ట్ చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది.

బంగారం అంటే ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టపడతారు. ముఖ్యంగా భారత దేశంలో బంగారం అంటే ఎంతో విలువ ఇస్తారు. మహిళలు ఎక్కువగా పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు బంగారం కొనుగోలు చేయడం చూస్తూనే ఉంటాం. ఇటీవల బంగారం ధరలు ఏ స్థాయిలో పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇప్పుడు మధ్య తరగతికి చెందిన వారు బంగారం ఆభరణాలుగానే కాకుండా మంచి ఇన్వెస్ట్ మెంట్ గా చూస్తున్నారు. ఆపద సమయంలో బంగారం ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అందుకే డబ్బు పొదుపు చేసి బంగారం కోనుగోలు చేస్తున్నారు. గతంలో బంగారం పెట్టుబడికి మంచి మార్గమే అయినా పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న పరిణామాలు బంగారం, వెండి పై ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో తరుచూ పసిడి ధరలు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. పసిడి ధరలు తగ్గినపుడు కొనుగోలు చేస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అసలు బంగారంపై పెట్టుబడి పెడితే ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

దేశంలో బంగారం ధరలు క్రమంగా పెరిగిపోతూ వస్తున్నాయి. పెళ్లిళ్లు, శుభ కార్యాలకు ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తున్నారు. దీంతో పసిడికి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. బంగారం మన వద్ద ఉంటే భవిష్యత్తుకు మంచి భోరోసా ఉన్నట్టే అంటున్నారు నిపుణులు. బంగారంపై పెట్టుబడి పెడితే ద్రవ్యోల్భణ ఉపద్రవం నుంచి కాపాడుతుందని అంటున్నారు. కేవలం ఆభరణాలు గానే కాకుండా కష్టకాలంలో ఉపయోగపడుతుంది. ఇతర రంగాలతో పోలిస్తే ఇటీవల బంగారం పై పెట్టుబడి పెట్టడానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. ముఖ్యంగా మధ్య తరగతికి చెందిన వారు ఏ కష్టమైనా పడి బంగారం కొనుగోలు చేసి దాచుకుంటున్నారు. తమ పెట్టుబడులు డైవర్సీఫై చేయాలనుకునే వారికి బంగారం పై పెట్టుబడి పెట్టడం బెస్ట్ ఛాయిస్ అంటున్నారు. ఇటీవల గోల్డ్ పై ఇన్వెస్ట్ చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. పసిడి పై ఇన్వెస్ట్ మెంట్ పెట్టే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా మార్కెట్ లో ఏదైనా రేటు పెరిగితే దాని డిమాండ్ తగ్గుతూ వస్తుంది. కానీ ఒక్క బంగారం విషయంలో మాత్రం దీనికి పూర్తి విరుద్దుం. బంగారం రేటు ఎంత పెరిగినా డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. ఇటీవల దేశ వ్యాప్తంగా పసిడి ధరలు గరిష్టస్థాయికి పెరిగిపోయాయి. అప్పుడప్పుడు 1000 నుంచి 500 వరకు తగ్గుతుంది. కొన్నిసార్లు స్థిరంగా ఉంటుంది. అది కూడా రెండు రోజుల మురిపమే.. మళ్లీ పసిడి ధరలు తారాస్థాయికి పెరిగిపోతూనే ఉన్నాయి. అయితే బంగారం పై ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు మార్కెట్ లో పసిడి ధరలు ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ.. ఎప్పుడు తగ్గుతాయో అప్పుడు కొనుగోలు చేసి పెట్టుకుంటే మంచిదని అంటున్నారు నిపుణులు. నేటి సమాజంలో బంగారు ఆభరణాలు అలంకరణ మాత్రమే కాదు.. పెట్టుబడి సాధనంగా మారిపోయింది.  బంగారం ధర తగ్గుతుందీ అన్న అపోహలు ఏవీ పెట్టుకోవద్దని.. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది ఐదు వేలకు పైగా పెరిగిపోయింది. నాలుగు నెలల క్రితం బంగారం కొనుగోలు చేసిన వారు ఇప్పటి ధరలతో పోల్చుకుంటే మంచి లాభల బాటలోనే ఉన్నారు.  రాబోయే మూడు నాలుగు నెలల్లో పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే మార్కెట్ లో ధరలు తగ్గుముఖం పట్టినపుడు పసిడి, వెండి కొనుగోలు చేస్తే భవిష్యత్ లో పదిరెట్ల లాభం ఉండే అవకాశం ఉందని అంటున్నారు ఆర్థిక నిపుణులు. మరీ ఇంకెందుకు ఆలస్యం మీ వద్ద డబ్బు ఉంటే.. బంగారం పై ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్ లో మంచి లాభాల బాట పట్టవొచ్చు.

 

Show comments