P Venkatesh
Today Gold price: గోల్డ్ కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం. బంగారం ధరలు భారీ స్థాయిలో దిగొస్తున్నాయి. దీంతో గోల్డ్ షాపుల్లో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. మరి మీరు కూడా ఇప్పుడు పసిడిని కొనుగోలు చేస్తే లాభాలు అందుకోవడం పక్కా అంటున్నారు నిపుణులు.
Today Gold price: గోల్డ్ కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం. బంగారం ధరలు భారీ స్థాయిలో దిగొస్తున్నాయి. దీంతో గోల్డ్ షాపుల్లో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. మరి మీరు కూడా ఇప్పుడు పసిడిని కొనుగోలు చేస్తే లాభాలు అందుకోవడం పక్కా అంటున్నారు నిపుణులు.
P Venkatesh
మనదేశంలో బంగారానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు. పండుగలు, ఫంక్షన్లు, వేడుకలకు పసిడిని కొనుగోలు చేస్తుంటారు. అంతేకాదు బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు కూడా ఇంట్రెస్టు చూపిస్తుంటారు. ఎందుకంటే భవిష్యత్తులో బంగారం ధరలు పెరుగుతాయన్న ఊహాగానాల నేపథ్యంలో బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతుంటారు. అయితే గత కొన్ని రోజుల వరకు పరుగులు పెట్టిన పసిడి ధరలు ఒక్కసారిగా నేల చూపులు చూస్తోంది. దీనికి గల కారణం జులై 23న కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
ఈ బడ్జెట్ లో బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. కస్టమ్స్ సుంకాన్ని 15 నుంచి 6 శాతానికి తగ్గించారు. దీంతో దిగుమతి భారం తగ్గింది. ఫలితంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దాదాపుగా తులం బంగారంపై 5 వేల వరకు తగ్గింది. ఇక బడ్జెట్ కు ముందు పెరిగిన ధరలతో గోల్డ్ కొనేందుకు వెనకడుగు వేసిన వారు ధరలు తగ్గడంతో కొనేందుకు ఇంట్రెస్టు చూపిస్తున్నారు. బడ్జెట్ అనంతరం దేశ వ్యాప్తంగా బంగారం షాపులు కస్టమర్లతో కిక్కిరిసిపోతున్నాయి. గోల్డ్ షాపులకు వినియోగదారుల తాకిడి పెరిగిపోయింది. బంగారం కొనుగోళ్లతో గోల్డ్ షాపులు కళకళలాడుతున్నాయి.
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ బంగారం ధరలపై భారీగా ఎఫెక్ట్ చూపించింది. గోల్డ్ ధరలు పడిపోతున్నాయి. దీంతో పసిడి ప్రియులు బంగారం కోనేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు ఆశాఢ మాసం కావడంతో శుభకార్యాలు ఏమీ లేవు. మరికొన్ని రోజుల్లో శ్రావణ మాసం ప్రారంభం కాబోతోంది. దీంతో పండుగలు, శుభకార్యాలు, పెళ్లిళ్లు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో గోల్డ్ ను ముందే కొనేందుకు షాపులకు పరుగులు తీస్తున్నారు కస్టమర్లు. మార్కెట్ నిపుణులు సైతం బంగారం కొనేందుకు ఇదే సరైన సమయం అని సూచిస్తున్నారు.
బంగారం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనేందుకు, గోల్డ్ పై పెట్టుబడులు పెట్టేందుకు ఇదే రైట్ టైమ్ అంటున్నారు నిపుణులు. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 1000 తగ్గింది. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో రూ. 63,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై 1,090 తగ్గింది. దీంతో రూ. 68,730 వద్ద అమ్ముడవుతోంది. అయితే బంగారంపై కస్టమ్స్ సుంకం భారీగా తగ్గించిన నేపథ్యంలో గోల్డ్ ధరలు మరింత దిగొచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ సమయంలో బంగారం కొనుగోలు చేసినా లేదా పెట్టుబడిపెట్టినా లాభాలు అందుకోవడం ఖాయం అంటున్నారు మార్కెట్ నిపుణులు.