డబ్బుల్లేవని బాధపడకండి.. 2 నిమిషాల్లో ఈజీగా 60 వేల లోన్ పొందండిలా..

ఎంత జీతం పడినా గానీ జీతం ఖర్చయిపోయిన తర్వాత ఏదో ఒకరోజు డబ్బు అవసరం అనేది పడుతుంది. ఆ సమయానికి వేరే పర్పస్ ఉండడమో.. ఏదైనా వస్తువు కొనుక్కోవాలి అని అనుకోవడమో చేస్తుంటారు. ఆ సమయంలో ఎక్కువ మొత్తంలో డబ్బు కావాలంటే ఎవరు ఇస్తారు చెప్పండి. అందుకే 2 నిమిషాల్లో ఈజీ స్టెప్స్ తో 60 వేలు లోన్ పొందవచ్చు. సిబిల్ సరిగా లేకపోయినా కూడా పొందవచ్చు. అదెలాగో చూడండి.

ఎంత జీతం పడినా గానీ జీతం ఖర్చయిపోయిన తర్వాత ఏదో ఒకరోజు డబ్బు అవసరం అనేది పడుతుంది. ఆ సమయానికి వేరే పర్పస్ ఉండడమో.. ఏదైనా వస్తువు కొనుక్కోవాలి అని అనుకోవడమో చేస్తుంటారు. ఆ సమయంలో ఎక్కువ మొత్తంలో డబ్బు కావాలంటే ఎవరు ఇస్తారు చెప్పండి. అందుకే 2 నిమిషాల్లో ఈజీ స్టెప్స్ తో 60 వేలు లోన్ పొందవచ్చు. సిబిల్ సరిగా లేకపోయినా కూడా పొందవచ్చు. అదెలాగో చూడండి.

ఎంత జీతం పడినా 31న పడింది.. ఒకటో తారీఖుకే ఖర్చయిపోతుంది. ఏ ఏ శాఖలకు వెళ్లాలో ఆ జీతానికి తెలుసు. అందుకే సేలరీ పడగానే ఆయా శాఖల ఖాతాల్లో డబ్బు జమ అయిపోతుంది. జీతం అంతా అయిపోయాక నెల మధ్యలో ఎప్పుడో ఒకసారి ఏదో అవసరం పడుతుంది. ఆ అవసరం చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు.. ఎవరినైనా అప్పు అడగాలంటే కూడా సిగ్గు వేస్తుంది. అందులోనూ నగరాల్లో అద్దెకు ఉండే వాళ్ళకి ఇబ్బందే. ఎందుకంటే పెద్దగా ఎవరూ తెలియదు. అడిగినా ఏమనుకుంటారో అన్న భయం. వెయ్యి, రెండు వేలు అంటే అడ్జస్ట్ చేస్తారు గానీ మరీ 50, 60 వేలు అంటే ఎక్కడ సర్దగలరు చెప్పండి. ఇలాంటి వారి కోసమే ఈ 60 వేల లోన్. ఈజీగా ఫోన్ లోనే 2 నిమిషాల్లో 60 వేలు పొందవచ్చు.

60 వేలు పొందాలంటే ఏమేమీ ఉండాలి?:

అమెజాన్ పే లేటర్ నుంచి ఇన్ స్టాంట్ క్రెడిట్ కావాలంటే కనుక అమెజాన్ అకౌంట్ కలిగి ఉండాలి. మొబైల్ నంబర్ వెరిఫికేషన్ అయి ఉండాలి. పాన్ కార్డు ఉండాలి. అలానే బ్యాంక్ అకౌంట్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ లేదా ఆధార్ కార్డు వంటి డాక్యుమెంట్స్ లో ఏదైనా ఒకటి అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. ఈ డబ్బులు తీసుకోవాలంటే 21 లేదా అంతకంటే ఎక్కువ వయసు వారు అయి ఉండాలి. అలానే సిబిల్ స్కోర్ ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి. కొంచెం తక్కువ ఉంటే మాత్రం 25 వేల వరకూ లోన్ వస్తుంది.   

60 వేల కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?:

  • అమెజాన్ వెబ్ సైట్ లేదా అమెజాన్ మొబైల్ యాప్ లోకి వెళ్ళాలి. 
  • అందులో అమెజాన్ పే లేటర్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. 
  • దాని మీద క్లిక్ చేస్తే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. 
  • పాన్ కార్డు వివరాలు నమోదు చేసి, పుట్టిన తేదీ ఎంపిక చేసుకోవాలి. 
  • ఆ తర్వాత కొన్ని స్టెప్స్ ఫాలో అయితే మీకు అర్హతలు ఉంటే అమెజాన్ పే లేటర్ వాలెట్ లో 60 వేల అమౌంట్ పడుతుంది. 

అమెజాన్ పే లేటర్ అంటే ఏంటి?:

అమెజాన్ పే లేటర్ అంటే ఒక వస్తువుని అప్పు తీసుకున్న డబ్బుతో కొనుగోలు చేసి.. ఆ అప్పుని తర్వాత చెల్లిస్తాం. అయితే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. తీసుకున్న డబ్బుని ఒక నెల లోపు చెల్లిస్తే ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన పని లేదు. నెల లేదా అంతకంటే ఎక్కువ రోజులు మన దగ్గర ఉంచుకుంటే మాత్రం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి 2 శాతం వడ్డీ ఉంటుంది. 

అమెజాన్ పే లేటర్ నుంచి డబ్బులు బయటకు రావు కానీ:

అమెజాన్ పే లేటర్ నుంచి డబ్బులు బయటకు రావు. ఆ డబ్బుతో కేవలం ఏదైనా వస్తువుని కొనుగోలు చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా ఆ వస్తువు కావాలంటే వారికి ఆ వస్తువు కొనిపెట్టి మీరు డబ్బు తీసుకోవచ్చు. అయితే ఒక నెలలో చెల్లిస్తే వడ్డీ ఉండదు. నెల నెలా వాయిదాల రూపంలో కొంత డబ్బు కట్టుకుంటూ వెళ్ళచ్చు. 

ఎంత అమౌంట్ తీసుకుంటే వడ్డీ ఉండదు:

ఉదాహరణకు 25 వేలు లోన్ తీసుకున్నట్లైతే 5 వేల వరకూ మీకు ఎలాంటి వడ్డీ ఉండదు. అయితే ఈ 5 వేల రూపాయలను ఒక నెలలోనే చెల్లించాల్సి ఉంటుంది. అలానే 60 వేల క్రెడిట్ పొందితే కనుక 10 వేల వరకూ ఎలాంటి వడ్డీ లేకుండా ఒక నెలలోగా చెల్లించే ఆప్షన్ ఉంది. 

అమెజాన్ పే లేటర్ డబ్బుతో వీటిని కొనే వీలు లేదు:

బంగారం, అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్స్, ఈమెయిల్ గిఫ్ట్ కార్డ్స్, ఫిజికల్ గిఫ్ట్ కార్డ్స్, అమెజాన్ పే వాలెట్ టాప్ అప్, అమెజాన్ గ్లోబల్ స్టోర్ లేదా ఇతర దేశాలకు చెందిన ఉత్పత్తులు, బులియన్ (బంగారం, వెండి) కొనేందుకు, క్రెడిట్ కార్డు పేమెంట్ చెల్లించేందుకు ఇది వర్తించదు. కేవలం అమెజాన్ ఇండియా వెబ్ సైట్ లేదా అమెజాన్ ఇండియా యాప్ లో వస్తువులను కొనేందుకు మాత్రమే ఈ లోన్ వర్తిస్తుంది. అయితే ఈ లోన్ కి అప్లయిక్ చేయడానికి రెండే రెండు నిమిషాల సమయం పడుతుంది. రెండు నిమిషాల్లోనే మీకు 60 వేల క్రెడిట్ అనేది వస్తుంది. హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు.

Show comments