ఎన్నికల ముందు కేంద్రం కీలక నిర్ణయం.. గ్యాస్‌ సిలిండర్లపై మళ్లీ పెరగనున్న సబ్సిడీ!

ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్‌ నెలలో గ్యాస్‌ ధరలను తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి సిలిండర్‌ రేటు తగ్గించనుందనే వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు..

ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్‌ నెలలో గ్యాస్‌ ధరలను తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి సిలిండర్‌ రేటు తగ్గించనుందనే వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు..

ప్రస్తుతం కూరగాయలు మొదలు పెట్రోల్‌, డీజిల్‌ వంటి వాటి రేట్లు చుక్కలను తాకుతున్న సంగతి తెలిసిందే. ఇక గ్యాస్‌ సిలిండర్‌ ధర కూడా ప్రతి నెల ప్రారంభంలో మారుతూ ఉంటుంది. అయితే ఎన్నికల నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాఖీ సందర్భంగా ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ రేట్లను రూ. 200 చొప్పున తగ్గించింది. అలానే అదే సమయంలో ఉజ్వల యోజన సబ్సిడీని మరో రూ. 100 పెంచి మొత్తం రూ. 300 కు చేర్చిన సంగతి తెలిసిందే. దాంతో గత రెండు, మూడు నెలల గృహ వినియోగాల కోసం వాడే గ్యాస్‌ ధర స్థిరంగా ఉంటుంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది జరగున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ ధరకు సంబంధించి మరోసారి శుభవార్త చెప్పనుందని తెలుస్తోంది. ఆ వివరాలు..

వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. మరోసారి వంట గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే జరిగితే.. మరోసారి గ్యాస్‌ ధర భారీగా దిగి రానుంది అంటున్నారు. దీపావళి లోపు లేదా ఆ తర్వాత సబ్సిడీని మరింత పెంచనున్నట్లు ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే సబ్సిడీ ఎంత పెంచుతారు.. దాని వల్ల సిలిండర్‌ ధర ఎంత దిగి వస్తుంది అనే దాని గురించి మాత్రం కచ్చితమైన సమాచారం లేదు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది అంటున్నారు. ఇదే జరిగితే.. గ్యాస్‌ ధర మరింత దిగి వచ్చే అవకాశం ఉంది.

ఇక దేశంలో ప్రతి ఏటా పీఎం ఉజ్వల యోజన లబ్ధిదారులు పెరుగుతున్నారు. రానున్న రోజుల్లో మరో 50 లక్షల మందికి ఉజ్వల యోజన కింద గ్యాస్‌ సిలిండర్‌ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. లబ్ధిదారుల సంఖ్య ఎంత పెరిగినా..  గ్యాస్ ధరపై ఉపశమనం కొనసాగుతుందని, రానున్న రోజుల్లో దీనికి సంబంధించి మరిన్ని కీలక చర్యలు తీసుకునే అవకాశం ఉందని సంబంధిత శాఖ అధికారులు అంటున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఉంటుందని చెబుతున్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పీఎం ఉజ్వల పథకం కింద 9.5 కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే వీరందరికి రూ. 300 సబ్సిడీ అందుతుంది. సబ్సిడీ పెంచిన తర్వాత.. దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 903 గా ఉండగా.. ఉజ్వల లబ్ధిదారులకు మాత్రం ప్రస్తుతం రూ. 603 కే అందుతుంది. ఇదే హైదరాబాద్‌లో అయితే రెగ్యులర్ గ్యాస్‌ సిలిండర్‌ రేటు రూ. 955 గా ఉండగా.. ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులకు రూ. 655 కే వస్తుంది.

ఇప్పుడు మరోసారి సబ్సిడీ పెరిగితే గ్యాస్ సిలిండర్ ధర మరింత తగ్గనుంది. అలానే ఎన్నికల హామీల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వస్తే.. 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తామని తెలిపారు. ఎలా చూసుకున్నా రాబోయే రోజుల్లో గ్యాస్‌ ధర భారీగానే తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు నిపుణులు.

Show comments