Hero Xtreme 160R: తక్కువ ధరకే వచ్చేసిన ఎక్స్‌ట్రీమ్‌ 160R.. ఫీచర్లు సూపర్!

Hero Xtreme 160R: హీరో తన ఎక్స్‌ట్రీమ్‌ 160R ని లాంచ్ చేసింది. ఇది అదిరిపోయే స్పోర్ట్స్ బైక్ లాగా ఉంటుంది.

Hero Xtreme 160R: హీరో తన ఎక్స్‌ట్రీమ్‌ 160R ని లాంచ్ చేసింది. ఇది అదిరిపోయే స్పోర్ట్స్ బైక్ లాగా ఉంటుంది.

హీరో మోటోకార్ప్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి అనేక రకాల మోడల్స్ ని వినియోగదారులకు అందిస్తూ దేశంలో ప్రజాదరణ పొందింది. అలాగే తన వినియోగదారులకు మంచి సర్వీసెస్ ని అందిస్తుంది. ఎప్పటికప్పుడు కూడా మార్కెట్లో సరికొత్త అప్‌గ్రేడ్స్‌తో కూడిన బైక్‌లను హీరో మోటోకార్ప్ ప్రవేశపెడుతుంది. హీరో కంపెనీ బైక్స్ చూడటానికి సూపర్ స్టైలిష్ లుక్ ని కలిగి ఉంటాయి. లుక్ కి తగ్గట్లే అదిరిపోయే ఫీచర్లని కూడా కంపెనీ అందిస్తుంది. అందులోనూ హీరో ఎక్స్‌ట్రీమ్‌ బైక్స్‌కి ఉండే ఆదరణ అంతా ఇంత కాదు. ఇవి సూపర్ స్టైలిష్ లుక్ తో యూత్ ని చాలా బాగా ఆకట్టుకున్నాయి.

తాజాగా హీరో కంపెనీ తన ఎక్స్‌ట్రీమ్‌ 160R (Hero Xtreme 160R) ని లాంచ్ చేసింది. ఇది చూడటానికి అదిరిపోయే స్పోర్ట్స్ బైక్ లాగా ఉంటుంది. ఇక ఈ బైక్ ఇంజిన్ సిస్టమ్‌ విషయానికి వస్తే.. ఇందులో 2 వాల్వ్‌లు ఉంటాయి. ఈ బైక్ 160R 163.2 సీసీ, సింగిల్ సిలిండర్, 2 వాల్వ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 8,500 rpm వద్ద 15 bhp పవర్ 6,500 rpm వద్ద 14 nm మాక్సిమం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. డైమండ్ ఫ్రేమ్‌లో డిజైన్ చేసిన ఈ బైక్‌ 12 లీటర్ల ఫ్యూయల్‌ ట్యాంక్‌ కెపాసిటీతో వస్తుంది. ఇది టెయిల్ లైట్, సింగిల్ పీస్ సీట్‌తో కొత్త డిజైన్‌ని కలిగి ఉంటుంది. ఈ బైక్ కేవలం 4.7 సెకన్లలోనే 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

రైడర్ సౌకర్యానికి అనుగుణంగా సీటింగ్ పొజిషన్‌ ని బాగా డిజైన్ చేశారు. దీని వెనుక సీటు పొడవు తక్కువగా ఉంటుంది. ఇది సింగిల్-ఛానల్ ఏబీఎస్‌తో వస్తుంది. ఈ బైక్ వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ ఉండటంతో సింగిల్-ఛానల్ ఏబీఎస్‌ని మాత్రమే ఫిక్స్ చేశారు. ఆకట్టుకునే సిగ్నేచర్ ఎల్ఈడి టైల్ ల్యాంపుని ఫిక్స్ చేశారు. ఇక ఈ ఎక్స్‌ట్రీమ్ లోని సస్పెన్షన్ విషయానికి వస్తే.. ఇది ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్‌, వెనుక భాగంలో మోనోషాక్‌తో వస్తుంది. ఈ బైక్ 145 కిలోల బరువు ఉంటుంది. ఇక ఈ కొత్త హీరో ఎక్స్ ట్రీమ్ 160R ధర విషయానికి వస్తే ఇది రూ .1.11 లక్షలు ఉంటుంది. సూపర్ స్టైలిష్ లుక్, పవర్ ఫుల్ ఇంజిన్‌ కావాలని కోరుకునే వారికి ఈ బైక్ బెస్ట్‌ ఆప్షన్‌ అని చెప్పవచ్చు. ఇక ఈ బైక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments