భారీగా పతనమైన బంగారం.. ధరలు ఎలా ఉన్నాయంటే?

బంగారం అంటే ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. పొద్దు పొద్దున్నే బంగారం ధర తగ్గింది అనే వార్త కంటే చాలా మందికి ఇంకో గుడ్ న్యూస్ ఉండదేమో. అలాంటి వారికోసమే ఈ వార్త. మరోసారి అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు పతనమయ్యాయి. అంతర్జాతీయంగా కొన్ని ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు పతనమవుతూ ఉన్నాయి. మొన్న అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1945 డాలర్లు ఉండగా.. నిన్న ఆ ధర రూ.1937 డాలర్లకు పడిపోయింది.

ఈ ఎఫెక్ట్ తో దేశీయంగా కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. నిన్నటి మార్కెట్ చూసుకుంటే హైదరాబాద్ లో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.55,100గా ఉంది. 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.60,110గా ఉంది. ఇవాళ మార్కెట్ ధరలు చూస్తే 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.54,950గా ఉంది. 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.59,950కి చేరింది. కొనుగోలుదారులకు మరో గుడ్ న్యూస్ కూడా ఉంది. అదేంటంటే.. బంగారం దారిలోనే వెండి ధరలు కూడా పతనమయ్యాయి.

ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఔన్స్ వెండి ధర మొన్న 24.38 డాలర్లుగా ఉండగా నిన్న ఆ ధర 23.76 డాలర్లకు పడిపోయింది. ఆ ప్రభావం దేశీయంగా కూడా కనిపిస్తోంది. నిన్న హైదరాబాద్ మార్కెట్ లో రూ.80,300గా ఉన్న కిలో వెండి ధర.. ఇవాళ రూ.78,500కు చేరింది. ఒక్కరోజులో దాదాపు రూ.1800 ధర తగ్గింది. రెండ్రోజుల్లో చూస్తే వెండి ధర ఏకంగా రూ.2,500 తగ్గింది. వెండి ధరలు ఇంకా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ లో వెండి, బంగారం ధరలపై ప్రతికూలత నెలకొంది.

Show comments