స్విగ్గీ, జొమాటోలకు పోటీగా స్విష్ ఫుడ్ డెలివరీ యాప్! బెంగుళూరులో తొలిసారి!

ఆకలి వేస్తుంది, చేసుకునే ఓపిక లేదు తీరిక అంతకన్నా లేదు. చకా చకా ఫోన్ తీసి వెంటనే స్విగ్గీ, జోమాటో యాప్స్ ఓపెన్ చేసి ఫుడ్ ఆర్డర్ పెడుతుంటారు. అది తెచ్చేలోగా కొన్ని సార్లు ఆకలి కూడా చచ్చిపోతుంది. ఇలాంటి వారి కోసమే సరికొత్త యాప్ రాబోతుంది.

ఆకలి వేస్తుంది, చేసుకునే ఓపిక లేదు తీరిక అంతకన్నా లేదు. చకా చకా ఫోన్ తీసి వెంటనే స్విగ్గీ, జోమాటో యాప్స్ ఓపెన్ చేసి ఫుడ్ ఆర్డర్ పెడుతుంటారు. అది తెచ్చేలోగా కొన్ని సార్లు ఆకలి కూడా చచ్చిపోతుంది. ఇలాంటి వారి కోసమే సరికొత్త యాప్ రాబోతుంది.

ఆఫీసుకు క్యారేజ్ తెచ్చుకోలేదు.. బాగా ఆకలి వేస్తుంది.. అంటే ఫస్ట్ గుర్తుకు వచ్చే ఆప్షన్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం. ఇంట్లో భార్య/అమ్మ నచ్చిన కూర వండలేదా అయితే స్విగ్గీ, జొమాటో యాప్స్ తెరిచి.. చకా చకా మనకు కావాల్సిన ఫుడ్ ఐటెమ్ సెలక్ట్ చేసుకుంటారు. ప్రాంతమైదైనా సరే ఇష్టమైన ఆహారాన్ని తెప్పించుకుని భుజిస్తుంటారు. ఇప్పటి వరకు దేశంలో ఫుడ్ డెలివరీ సర్వీసును అందించాయి స్విగ్గీ, జొమాటా, ఉబర్ లాంటి సంస్థలు. నిమిషాల్లో ఫుడ్ డెలివరీని చేస్తూ కస్టమర్లను తమ వైపు తిప్పుకున్నాయి. అయితే వినియోగదారులు ఎక్కువైన కొద్దీ.. నిమిషాలు కాస్త గంటలుగా మారాయి. దీంతో వేరే ఆప్షన్స్ లేక ఆకలితోనే కస్టమర్లు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఒక్కోసారి ఆకలి చచ్చిపోతుంది కూడా. ఇప్పుడు ఈ కష్టాలకు చెక్ పెడుతోంది మరో ఫుడ్ డెలివరీ యాప్.

పదంటే పదే నిమిషాల్లో వేడి వేడిగా ఫుడ్ డెలివరీ అయితే ఎంత బాగుంటుందో కదూ..అయితే ఈ శుభవార్త మీకోసమే. స్విగ్గీ, జోమాటో వంటి యాప్‌లకు ధీటుగా మరో ఫుడ్ డెలివరీ యాప్ రాబోతుంది. కర్ణాటక బెంగళూరులో స్టార్టప్ స్టార్ట్ అయ్యింది. అదే స్విష్ యాప్. దీన్ని ఉజ్వల్ సుఖేజా ఏర్పాటు చేశాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉజ్వల్ తన సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టాడు. తన ఫ్రెండ్స్‌తో కలిసి ఈ యాప్ ప్రారంభించాడు. సారోన్, అకింత్ షాతో కలిసి ఈ యాప్ ప్రారంభించాడు. స్విష్ యాప్ స్టార్ట్ అయ్యిందని, 10 నిమిసాల్లో ఫుడ్ డెలివరీ అవుతుందని చెప్పాడు. కొంత మంది ఔత్సాహిలు ఫుడ్ డెలివరీ యాప్ ఎలా ప్రారంభించారని అడుగుతున్నారు? అంటూ ఆ స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేయడం వెనుక కహానీ వెల్లడించాడు.

తాము ముగ్గురం వేర్వేరు కంపెనీల్లో వర్క్ చేశామని, ఉద్యోగాలు బాగానే ఉన్నప్పటికీ, ఏదో కోల్పోయినట్లు భావించామని తెలిపాడు. అప్పుడు ఏదో ఒకటి చేయాలని భావించి స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసినట్లు వెల్లడించాడు.ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు.. డెలివరీ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి గమనించామని, మాలాంటి యువకులు ఎంతో మంది ఈ సమస్యను చూశారని, అందుకే ఈ ఫుడ్ డెలివరీ యాప్ ప్రారంభించినట్లు చెప్పాడు. ప్రస్తుతం ఈ సేవలు బెంగళూరులో అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలు వినియోగించుకుంటున్న కొంత మంది పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. తర్వలో తెలుగు రాష్ట్రాలకు ఈ యాప్ సేవలు విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొంత మంది నెటిజన్లు 10 నిమిషాల్లో ఎలా డెలివరీ చేయడం ఎలా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొంత మంది ఫన్నీ రెస్పాన్స్ ఇస్తున్నారు. మొత్తానికి స్విగ్గీ, జోమాటా లాంటి కంపెనీలను తట్టుకుని నిలబడుతుందో లేదో చూడాలి.

Show comments