PF డబ్బులు మీ బ్యాంకు ఖాతాల్లో పడట్లేదా? ఇలా చేయండి.. వెంటనే మీ ప్రాబ్లమ్ సాల్వ్

చాలా మందికి పీఎఫ్ డబ్బుల కోసం క్లెయిమ్ చేసుకున్నప్పుడు ఆ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంటుంది. అయితే ఇలా రిజెక్ట్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ కారణాలు తెలుసుకుని తప్పులు చేయకుండా ఉంటే ఈజీగా పీఎఫ్ డబ్బులను మీ బ్యాంక్ అకౌంట్ లోకి పడేలా చేసుకోవచ్చు.

చాలా మందికి పీఎఫ్ డబ్బుల కోసం క్లెయిమ్ చేసుకున్నప్పుడు ఆ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంటుంది. అయితే ఇలా రిజెక్ట్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ కారణాలు తెలుసుకుని తప్పులు చేయకుండా ఉంటే ఈజీగా పీఎఫ్ డబ్బులను మీ బ్యాంక్ అకౌంట్ లోకి పడేలా చేసుకోవచ్చు.

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అనేది ఉద్యోగులకు ఆర్థిక భరోసాని కల్పించే ఫండ్ స్కీం. ఉద్యోగి జీతం నుంచి కొంత, ఉద్యోగం చేసే కంపెనీ వాళ్ళు ఇచ్చే అమౌంట్ కొంత.. పీఎఫ్ ఖాతాలో ప్రతి నెలా జమ అవుతుంటాయి. ఈ అమౌంట్ కి ప్రభుత్వం కొంత అమౌంట్ కలిపి ఉద్యోగి ఖాతాలో జమ చేస్తుంది. 20, 30 ఏళ్ల తర్వాత చూసుకుంటే ఆ డబ్బు లక్షల్లో ఉంటుంది. పదవీ విరమణ సమయంలో ఈ డబ్బు బాగా ఉపయోగపడుతుంది. ఒకేసారి మొత్తం డబ్బు తీసుకోవచ్చు. లేదా పెన్షన్ రూపంలో నెలకు ఇంత అని కొంత మొత్తం తీసుకోవచ్చు. మధ్యలో ఎప్పుడైనా పిల్లల చదువులకు, ఇతర అవసరాలకు అవసరమైతే తీసుకోవచ్చు. అత్యవసర సమయాల్లో కావాలన్నా కూడా ఈ డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే చాలా మంది ఈ పీఎఫ్ డబ్బుని విత్ డ్రా చేసే సమయంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. పీఎఫ్ క్లెయిమ్ చేసినప్పుడు రిజెక్ట్ అవుతుంటాయి. దీని వల్ల బ్యాంకు ఖాతాలో పీఎఫ్ డబ్బులు పడవు. ఇలా జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి.    

పీఎఫ్ డబ్బులు అకౌంట్లో పడకపోవడానికి కారణాలు:

  • ఈపీఎఫ్ రికార్డుల్లో మీ పేరు తప్పుగా ఉంటే డబ్బులు పడవు. ఆధార్ కార్డులో ఉన్న పేరు, మీ పీఎఫ్ అకౌంట్ పేరుతో మ్యాచ్ అవ్వకపోతే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. అయితే మీరు క్లెయిమ్ ఫారంతో పాటు.. పేరుని సరిచేయాలని ఒక జాయింట్ డిక్లరేషన్ ని ఇవ్వాలి.
  • ఆధార్ కార్డు, ఈపీఎఫ్ఓ రికార్డుల్లో మీ పుట్టిన తేదీ మ్యాచ్ అవ్వాలి. తప్పుగా ఉంటే వెంటనే సరి చేసుకోవాలి. 
  • ఈపీఎఫ్ఓ అకౌంట్ లో సంస్థలో ఎప్పుడు చేరారో ఆ తేదీ, ఎప్పుడు రిజైన్ చేశారో ఆ తేదీ.. కరెక్ట్ గా సబ్మిట్ చేయాలి. ఏమైనా తప్పులు ఉంటే మీరు పని చేసిన కంపెనీకి వెళ్లి మార్పులు చేయించుకోవాలి. 
  • పీఎఫ్ డబ్బులు రావాలంటే ఈపీఎఫ్ఓ కేవైసీ పూర్తి చేయాలి. అసంపూర్ణంగా ఉంటే పీఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. అందుకే కేవైసీ అయ్యాకనే క్లెయిమ్ చేసుకోవడం మంచిది.
  • వ్యక్తిగత బ్యాంకు ఖాతా లేదా జీవిత భాగస్వామితో తీసుకున్న జాయింట్ అకౌంట్ సమర్పిస్తేనే ఈపీఎఫ్ఓ నుంచి క్లెయిమ్ చేసిన డబ్బులు ఖాతాలో పడతాయి.
  • జీవిత భాగస్వామి కాకుండా.. వేరొకరితో జాయింట్ అకౌంట్ జత చేసిన సమయంలో క్లెయిమ్ తిరస్కరణకు గురవుతుంది.  
  • బ్యాంకు పేరు, శాఖ పేరు, ఐఎఫ్ఎస్సీ కోడ్, బ్యాంక్ ఖాతా నంబర్ ఇలా అన్ని వివరాలు కరెక్ట్ గా ఉండాలి. మీరు ఏ బ్యాంకు ఖాతా అయితే కలిగి ఉన్నారో ఆ బ్యాంకు.. వేరే బ్యాంకులో విలీనం అయినప్పుడు ఐఎఫ్ఎస్సీ కోడ్ తో పాటు ఇంకేమైనా మారితే వాటిని ఈపీఎఫ్ఓ రికార్డుల్లో అప్డేట్ చేయాలి. 
  • ఆధార్ తో యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) లింక్ కాకపోతే కూడా మీ పీఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది.  
  • పీఎఫ్ విత్ డ్రా ఫారం సరిగా సబ్మిట్ చేయకపోయినా కూడా డబ్బులు ఖాతాల్లో పడవు.
Show comments