Good News To Bank Customers: గుడ్ న్యూస్.. ఆ బ్యాంకు నిర్ణయంతో ఖాతాదారులకు భారీ లాభాలు!

గుడ్ న్యూస్.. ఆ బ్యాంకు నిర్ణయంతో ఖాతాదారులకు భారీ లాభాలు!

Good News To Bank Customers: బ్యాంకులు తీసుకునే నిర్ణయాలతో ఖాతాదారులకు అప్పుడప్పుడు భారీగా ప్రయోజనం చేకూరుతుంది. కొన్ని నిర్ణయాలు కస్టమర్లకు భారం కలిగించినప్పటికీ.. చాలా వరకూ ప్రజలకు మేలు చేసేవిగా ఉంటాయి. తాజాగా ఆ బ్యాంకు నిర్ణయంతో ఖాతాదారులకు భారీ ప్రయోజనం చేకూరనుంది. 

Good News To Bank Customers: బ్యాంకులు తీసుకునే నిర్ణయాలతో ఖాతాదారులకు అప్పుడప్పుడు భారీగా ప్రయోజనం చేకూరుతుంది. కొన్ని నిర్ణయాలు కస్టమర్లకు భారం కలిగించినప్పటికీ.. చాలా వరకూ ప్రజలకు మేలు చేసేవిగా ఉంటాయి. తాజాగా ఆ బ్యాంకు నిర్ణయంతో ఖాతాదారులకు భారీ ప్రయోజనం చేకూరనుంది. 

ఫిక్స్డ్ డిపాజిట్లకు మంచి డిమాండ్ ఉంది. పెట్టుబడికి సురక్షితమైన మార్గం కావడం, వడ్డీ రేటు స్థిరంగా ఉండడం, దానికి తగ్గట్టే ఖచ్చితమైన రాబడి వస్తుందన్న హామీ ఇస్తుండడంతో చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెడుతున్నారు. ఆయా బ్యాంకులు తమ నిబంధనలకు అనుగుణంగా వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంటాయి. అప్పుడప్పుడూ ఎఫ్డీలపై వడ్డీ రేట్లలో మార్పులు తీసుకొస్తుంటాయి. తాజాగా ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన ఇండస్ ఇండ్ బ్యాంక్ తమ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2 కోట్ల రూపాయల కంటే తక్కువ మొత్తం డిపాజిట్లపై 8.25 శాతం వరకూ వడ్డీ రేటు అందిస్తున్నట్లు ఇండస్ ఇండ్ బ్యాంక్ ప్రకటించింది. ఈ వడ్డీ రేట్లు ఈ నెల 27 నుంచే అమలులోకి వచ్చాయి. 

వడ్డీ రేట్లు ఇలా:

7 రోజుల నుంచి 30 రోజుల పాటు ఫిక్డ్స్ డిపాజిట్ చేస్తే 3.50 శాతం వడ్డీ లభిస్తుంది. 31 రోజుల నుంచి 45 రోజుల పాటు ఫిక్స్డ్ డిపాజిట్లపై 3.75 శాతం వడ్డీ లభిస్తుంది. 46 రోజుల నుంచి 120 రోజుల కాలవ్యవధిలో డిపాజిట్ చేస్తే 4.75 శాతం వడ్డీ వస్తుంది. 121 నుంచి 180 రోజుల డిపాజిట్స్ పై 5 శాతం వడ్డీ రేటు ఇస్తారు. 181 రోజుల నుంచి 210 రోజుల మధ్య ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.85 శాతం వడ్డీ వస్తుండగా.. 211 రోజుల నుంచి 269 రోజుల మధ్య ఎఫ్డీలపై 6.10 శాతం వడ్డీ లభిస్తుంది. 270 రోజుల నుంచి 354 రోజుల కాలవ్యవధితో చేసే ఫిక్డ్స్ డిపాజిట్లపై 6.34 శాతం వడ్డీ లభిస్తుంది. 355 నుంచి 364 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.50 శాతం వడ్డీ రేటు అనేది వస్తుంది. 12 నెలల నుంచి 15 నెలల మధ్య 7.75 శాతం వడ్డీ వస్తుంది. 24 నెలల నుంచి 61 నెలల మధ్య ఫిక్డ్స్ డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీ రేటు ఇస్తుంది.

61 నెలల కన్నా ఎక్కువ రోజులు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవారికి 7 శాతం వడ్డీ లభిస్తుంది. ఐదేళ్ల ట్యాక్స్ సేవర్ స్కీంలో 7.25 శాతం వడ్డీ రేటు ఇస్తుంది బ్యాంకు. అయితే సాధారణ పౌరుల కంటే ఎక్కువ వడ్డీ రేటు సీనియర్ సిటిజన్స్ చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇస్తుంది. కనీసం 0.50 శాతం ఎక్కువ వడ్డీ వస్తుంది. రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తంలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసే సీనియర్ సిటిజన్స్ కి పైన చెప్పిన వడ్డీ రేటు కంటే ఎక్కువ వడ్డీ లభిస్తుంది. 7 రోజుల నుంచి పదేళ్ల కాలవ్యవధితో చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్స్ కి 4 శాతం నుంచి 8.25 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. 7 రోజుల నుంచి 14 రోజుల వరకూ చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై 4 శాతం వడ్డీ రేటు ఉండగా.. 12 నెలల నుంచి 16 నెలల కాలవ్యవధితో చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై 8.25 శాతం ఉంటుంది.  

అత్యధికంగా 8.25 శాతం వడ్డీ రేటు రాబట్టే మెచ్యూరిటీ పీరియడ్స్:

  • ఏడాది నుంచి 15 నెలల కంటే తక్కువ వ్యవధి 
  • 15 నెలల నుంచి 16 నెలల వ్యవధి 
  • 16 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ వ్యవధి
  • 18 నెలలు లేదా రెండేళ్ల వరకూ 
  • 30 నెలల నుంచి 31 నెలల కంటే తక్కువ వ్యవధి
Show comments