Bajaj CNG Bike: ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ విడుదల.. 330 కి.మీ. మైలేజ్.. ధర ఎంతంటే?

ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ విడుదల.. 330 కి.మీ. మైలేజ్.. ధర ఎంతంటే?

Bajaj CNG Bike: దేశమంతా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న వరల్డ్ లోనే తొలి సీఎన్జీ బైక్ ని బజాజ్ ఆటో కంపెనీ విడుదల చేసింది. మరి దీని ధర ఎంత? ప్రత్యేకతలు ఏంటి? మైలేజ్ ఎంత ఇస్తుంది? సీఎన్జీతో ఎన్ని కి.మీ. ప్రయాణిస్తుంది? పెట్రోల్ మీద ఎంత మైలేజ్ ఇస్తుంది? వంటి పూర్తి వివరాలు మీ కోసం.

Bajaj CNG Bike: దేశమంతా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న వరల్డ్ లోనే తొలి సీఎన్జీ బైక్ ని బజాజ్ ఆటో కంపెనీ విడుదల చేసింది. మరి దీని ధర ఎంత? ప్రత్యేకతలు ఏంటి? మైలేజ్ ఎంత ఇస్తుంది? సీఎన్జీతో ఎన్ని కి.మీ. ప్రయాణిస్తుంది? పెట్రోల్ మీద ఎంత మైలేజ్ ఇస్తుంది? వంటి పూర్తి వివరాలు మీ కోసం.

ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న బజాజ్ సీఎన్జీ బైక్ ఎట్టకేలకు లాంఛ్ అయ్యింది. ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైకుని బజాజ్ ఆటో కంపెనీ ఇవాళ (జూలై 5న) విడుదల చేసింది. బజాజ్ ఫ్రీడమ్ 125 పేరుతో ఈ బైకుని భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ)తో అలానే పెట్రోల్ తో కూడా నడుస్తుంది. ఒక చిన్న బటన్ ఇచ్చారు. ఈ బటన్ ని ప్రెస్ చేయడం ద్వారా పెట్రోల్ తో నడవాలంటే పెట్రోల్ తో, సీఎన్జీతో నడపాలంటే సీఎన్జీతో నడుస్తుంది. సీఎన్జీ కార్లు దశాబ్ద కాలం నుంచి అందుబాటులో ఉన్నా గానీ ప్రపంచంలోనే సీఎన్జీ టెక్నాలజీతో వచ్చిన తొలి బైక్ ఇదే కావడం విశేషం.  

ప్రత్యేకతలు ఇవే:

ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఎన్జీ 04 డిస్క్ ఎల్ఈడీ, ఎన్జీ 04 డ్రమ్ ఎల్ఈడీ, ఎన్జీ 04 డ్రమ్ ఇలా మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఎన్జీ 04 డ్రమ్ వేరియంట్ ఎక్స్ షోరూం ధరను రూ. 95 వేలుగా నిర్ణయించింది కంపెనీ. ఎన్జీ 04 డ్రమ్ ఎల్ఈడీ వేరియంట్ ను రూ. 1,05,000గా నిర్ణయించింది. ఎన్జీ 04 డిస్క్ ఎల్ఈడీ వేరియంట్ ను రూ. 1,10,000గా నిర్ణయించింది. ఈ బైక్ 5 రంగుల్లో అందుబాటులో ఉంది. నాన్ ఎల్ఈడీ డ్రమ్ వేరియంట్ మాత్రం రెండు రంగుల్లోనే లభిస్తుంది. ఈ సీఎన్జీ బైక్ లో 12.5 లీటరర్లు లేదా 2 కేజీల సామర్థ్యం కలిగిన సీఎన్జీ ట్యాంక్ ఉంటుంది. అలానే 2 లీటర్ల కెపాసిటీ కలిగిన పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది.

2 లీటర్ల పెట్రోల్ తో లీటరుకు 65 కి.మీ. చొప్పున 130 కి.మీ., అలానే 2 కేజీల సీఎన్జీతో కిలోకి 100 కి.మీ. చొప్పున 200 కి.మీ. మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. పెట్రోల్, సీఎన్జీ కలిపి ఈ బైక్ మొత్తం 330 కి.మీ. మైలేజ్ నిస్తుందని కంపెనీ వెల్లడించింది. 125 సీసీ ఇంజిన్ తో 8000 ఆర్పీఎం వద్ద 9.5 బీహెచ్పీ పవర్ తో వస్తుంది. 6000 ఆర్పీఎం వద్ద 9.7 ఎన్ఎం టార్క్ ని అందిస్తుంది. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇది 5 స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తుంది. బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్జీ బైక్ డిజైన్ కూడా ఇతర బైకులతో పోలిస్తే భిన్నంగా ఉంది. ఎల్ఈడీ హెడ్ లైట్, డర్ట్ బైక్ ని పోలిన ఫ్యూయల్ ట్యాంక్, పొడవైన సింగిల్ సీట్ తో వస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీతో ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ ని ఇచ్చారు. 

ఇక దీని టాప్ స్పీడ్ విషయానికొస్తే సీఎన్జీతో నడిపినప్పుడు గంటకు 90.5 కి.మీ. వేగంతో వెళ్తుంది. అదే పెట్రోల్ తో అయితే గంటకు 93.4 కి.మీ. వేగంతో నడుస్తుంది. ఇందులో పెస్కో సర్టిఫైడ్ సీఎన్జీ సిలిండర్ ని ఇచ్చారు. ఇది సీటు కింద ప్రొటెక్టివ్ ట్రెల్లిస్ ఫ్రేమ్ లో ఉంటుంది. ఇది ట్యాంక్ షీల్డ్స్ తో కప్పబడి ఉంటుంది. ఇప్పటికే ఈ బైక్ కి సంబంధించి బుకింగ్స్ ని కంపెనీ ప్రారంభించింది. కంపెనీ అధికారిక వెబ్ సైట్ ద్వారా లేదా బజాజ్ షోరూంల ద్వారా ఈ బైక్ ని బుక్ చేసుకోవచ్చు.

  • ఈ బైక్ గురించి తెలుసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.
Show comments