అక్కడ లక్ష ఇన్వెస్ట్ చేసి ఓపిక పడితే చాలు..  కోటి అవుతుందట!

1 Lakh Become 1 Crore: కోటి రూపాయలు సంపాదించడం మీ లక్ష్యమా? మీ పిల్లలు ఎదిగే సమయానికి వారి చేతుల్లో కోటి రూపాయల నుంచి 10 కోట్లు పెట్టాలని అనుకుంటున్నారా? అయితే ఇదే సరైన అవకాశం. ఇక్కడ పెట్టుబడి పెడితే లక్ష కోటి రూపాయలు అవుతుందని నిపుణులు అంటున్నారు.

1 Lakh Become 1 Crore: కోటి రూపాయలు సంపాదించడం మీ లక్ష్యమా? మీ పిల్లలు ఎదిగే సమయానికి వారి చేతుల్లో కోటి రూపాయల నుంచి 10 కోట్లు పెట్టాలని అనుకుంటున్నారా? అయితే ఇదే సరైన అవకాశం. ఇక్కడ పెట్టుబడి పెడితే లక్ష కోటి రూపాయలు అవుతుందని నిపుణులు అంటున్నారు.

డబ్బు సంపాదించడం కష్టం అనుకునేవాళ్ళకి ఎప్పటికీ కష్టమే. కానీ దాన్ని పొందే మార్గం తెలిసిన వాళ్ళకి సంపాదించడం చాలా ఈజీ. ఒక రూపాయిని దాస్తే అది ఎప్పటికీ రూపాయినే అవుతుంది. అదే రూపాయిని ఎందులో అయినా ఇన్వెస్ట్ చేస్తే అది 2 రూపాయలు అవ్వచ్చు, 3 రూపాయలు అవ్వచ్చు, ఎంత అయినా అవ్వచ్చు. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మీరు లక్ష పెట్టుబడి పెట్టి ఓపిక పడితే చాలు.. ఆ లక్ష కోటి రూపాయలు అవుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.  

ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం సురక్షితం?:

2024లో సెన్సెక్స్ సూచీలో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా 2055 నాటికి కోటి రూపాయలు అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. దీని కోసం ఇండెక్స్ ఈటీఎఫ్ కొనుగోళ్లు అయితే ఉత్తమం అని అంటున్నారు. గడిచిన 49 ఏళ్లలో మార్కెట్లో ఎన్నో ఒడిదుడుకులు, ఆర్థిక సంక్షోభాలు వచ్చాయి. అయినప్పటికీ వాటన్నిటినీ తట్టుకుని సెన్సెక్స్ సగటున 16 శాతం వృద్ధిని నమోదు చేసిందని నిపుణులు చెబుతున్నారు. రిస్క్ కూడా తక్కువే అని అంటున్నారు. అయితే ఇతర ఈక్విటీల్లో విడివిడిగా ఇన్వెస్ట్ చేయడం కంటే సెన్సెక్స్ లో నేరుగా పెట్టుబడి పెట్టడం సురక్షితమని నిపుణులు చెబుతున్నారు.

కోటి రూపాయలు కావాలంటే:

31 ఏళ్ల తర్వాత కోటి రూపాయలు కావాలంటే లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేయాలని.. 10 కోట్లు కావాలంటే 10 లక్షలు ఇన్వెస్ట్ చేయాలని చెబుతున్నారు. 31 ఏళ్ల తర్వాత 100 కోట్లు కావాలంటే సెన్సెక్స్ లో నేరుగా కోటి రూపాయలు పెట్టుబడి పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే మార్కెట్ పడినా లేదా కరెక్షన్ కి గురైన ప్రతిసారీ ఇండెక్స్ లో ఈటీఎఫ్ కొనుగోళ్లు చేయడం ఉత్తమం అని చెబుతున్నారు. ఇలా నేరుగా పెట్టుబడి పెట్టడం వల్ల డీమ్యాట్ అకౌంట్ లో ఉన్న పెట్టుబడులను హామీగా చూపించి బ్యాంకు రుణాలను వేగంగా పొందవచ్చునని కూడా చెబుతున్నారు. అదే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులను తాకట్టు పెట్టి రుణాలను పొందడం ఆలస్యం అవుతుంది. కాబట్టి ఎలా చూసినా గానీ సెన్సెక్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రయోజనమే అని చెబుతున్నారు.        

గమనిక: మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం అనేది రిస్క్ ఉంటుంది. రిస్క్ తక్కువ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నప్పటికీ రిస్క్ ఫ్యాక్టర్స్ ని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి పెట్టాలి. అంతేకాదు.. మెచ్యూరిటీ పూర్తయ్యే సమయానికి మార్కెట్ అప్ అండ్ డౌన్స్ బట్టి కూడా పెట్టుబడి విలువ మారిపోతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పూర్తి అవగాహనతో దిగాలి. అవగాహన లేకుండా దిగితే నష్టపోతారు.

Show comments