తులం బంగారం 2 లక్షలు దాటుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Will Gold Price Hits 2 Lakhs?: తులం బంగారం 2 లక్షలు దాటనుందా? బులియన్ పండితుల అంచనా ప్రకారం ఇది నిజమయ్యేలా కనిపిస్తుంది. అదే జరిగితే కనుక ఇప్పుడు భారీగా బంగారం కొనుగోలు చేసిన వారికి భారీ లాభాలను పొందే అవకాశం ఉంటుంది.

Will Gold Price Hits 2 Lakhs?: తులం బంగారం 2 లక్షలు దాటనుందా? బులియన్ పండితుల అంచనా ప్రకారం ఇది నిజమయ్యేలా కనిపిస్తుంది. అదే జరిగితే కనుక ఇప్పుడు భారీగా బంగారం కొనుగోలు చేసిన వారికి భారీ లాభాలను పొందే అవకాశం ఉంటుంది.

శుక్రవారం నాడు భారీగా పతనమైన బంగారం ధర మళ్ళీ పుంజుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం బంగారం సానుకూలంగా సాగుతుంది. అయితే ఫ్యూచర్ లో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 71,670 రూపాయల వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 65,700 వద్ద కొనసాగుతుంది. అయితే రాబోయే రోజుల్లో తులం బంగారం రూ. 2 లక్షలు దాటిపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం కేంద్రంలో మోదీ ప్రభుత్వమని చెబుతున్నారు. గతంతో పోల్చుకుంటే మెజారిటీ లేకపోయినా గానీ మిత్రపక్షాలతో బీజేపీ అధికారాన్ని ఏర్పాటు చేసింది.

దీంతో మోదీ సర్కార్ గతంలో మాదిరి దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటుందా లేదా అన్న అనుమానాలు మార్కెట్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈక్విటీ మార్కెట్ల సంగతి అటుంచితే.. బులియన్ మార్కెట్ మాత్రం మోదీ హయాంలో విపరీతంగా పెరిగిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 2014లో మోదీ అధికారం చేపట్టే సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 28 వేలుగా ఉండగా.. ఇప్పుడు 75 వేల దగ్గరకు వచ్చింది. అంటే దాదాపు మూడు రెట్లు గోల్డ్ రేట్లు పెరిగాయి. 2019 నుంచి బులియన్ రన్ వేగంగా పుంజుకుంది. 2019లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 35 వేల దగ్గర ఉంటే.. 2024 నాటికి 75 వేలకు చేరుకుంది. ఈ ఐదేళ్ళలో బంగారం ధరలు దాదాపు రెండు రెట్లు పెరిగాయి. గ్లోబల్ గా పసిడి ధరలు పెరగడానికి అనేక అంశాలు దోహదపడ్డాయి.

చాలా మంది ఇన్వెస్టర్లు కరోనా సమయంలో బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావించి ఎక్కువ పెట్టుబడులు పెట్టారు. ఈక్విటీ మార్కెట్లలో ఉన్న డబ్బుని పెద్ద ఎత్తున గోల్డ్ మార్కెట్ వైపు తరలించారు. దీనికి తోడు చైనా కూడా పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తుంది. ఇవన్నీ పసిడి ధరలు పెరగడానికి కారణమయ్యాయి. వీటి కారణంగా బంగారంపై డిమాండ్ పెరిగి రేట్లు అమాంతం పెరిగిపోయాయి. 2024 జూన్ నాటికి 74 వేల వద్ద పసిడి ధర ట్రేడ్ అవుతోంది. ఇది ఇలానే కొనసాగితే.. 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలు దాటే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గత ఐదేళ్ళలో పసిడి ధర రెట్టింపు అయ్యింది కాబట్టి ప్రస్తుతం ఉన్న 75 వేల పసిడి ధర ఐదేళ్ళలో రెట్టింపు అయ్యి లక్ష 50 వేలకు చేరుకునే అవకాశాలు కనబడుతున్నాయని బులియన్ పండితులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ గోల్డ్ రేట్లు మరింత పుంజుకుంటే తులం 2 లక్షలు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. అదే జరిగితే కనుక పసిడి ప్రియులకు భారీ లాభాలు పొందవచ్చు.

Show comments