EPFO Releases FY 2023-24 Interest: PF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అకౌంట్లలోకి డబ్బులు.. చెక్ చేసుకోండి..

PF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అకౌంట్లలోకి డబ్బులు.. చెక్ చేసుకోండి..

EPFO Releases FY 2023 24 Interest: పీఎఫ్‌ ఖాతాదారులకు ఈపీఎఫ్‌ఓ భారీ శుభవార్త చెప్పింది. అకౌంట్‌దారుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేసింది. మీరు కూడా చెక్‌ చేసుకొండి.

EPFO Releases FY 2023 24 Interest: పీఎఫ్‌ ఖాతాదారులకు ఈపీఎఫ్‌ఓ భారీ శుభవార్త చెప్పింది. అకౌంట్‌దారుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేసింది. మీరు కూడా చెక్‌ చేసుకొండి.

ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు ప్రకటించింది. దీనిలో భాగంగా.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను దాని అవుట్‌గోయింగ్ సభ్యులకు వడ్డీ చెల్లింపులను విడుదల చేయడం ప్రారంభించింది. అంతేకాక ఈ కాలానికి వడ్డీ రేటు సంవత్సరానికి 8.25 శాతంగా నిర్ణయించింది ఈపీఎఫ్‌ఓ. ఇప్పటివరకు, ఈపీఎఫ్ఓ ​​23.04 లక్షల క్లెయిమ్‌లను పరిష్కరించింది. సభ్యులకు రూ. 9,260 కోట్లను చెల్లించింది. ఇందులో తాజా వడ్డీ రేటు సంవత్సరానికి 8.25 శాతంగా ఉంది. ఈ సమాచారాన్ని పెన్షన్ ఫండ్ బాడీ  తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో  పోస్ట్‌ చేసింది.

ఈపీఎఫ్ఓ ఫిబ్రవరి 2024, 10న 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వడ్డీ రేటును 8.25 శాతంగా నిర్ణయించింది. అంతకుముందు సంవత్సరం (2022-23) వడ్డీ రేటు 8.15 శాతం కాగా, దానికి ముందు ఆర్థిక సంవత్సరం అనగా. 2021-22కి ఈ వడ్డీ రేటు 8.10 శాతంగా ఉంది. ఈ వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) నిర్ణయిస్తుంది. ప్రస్తుత అవుట్‌గోయింగ్ సభ్యులకు వారి చివరి ప్రావిడెంట్ ఫండ్ సెటిల్‌మెంట్‌లలో భాగంగా 23,04,516 క్లెయిమ్‌లకు గానూ మొత్తం రూ. 9,260,40,35,488 మేర సవరించిన రేట్ల కింద వడ్డీని చెల్లిస్తోంది ఈపీఎఫ్‌ఓ. ఈమేరకు ఖాతాదారులు అకౌంట్లలో ఈ నగదు జమ చేస్తుంది.

ఫిబ్రవరి 10, 2024న జరిగిన సమావేశంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ) 2023-24 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ రేటును సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనను కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు పంపింది. అది ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపింది. 2024, మే 6న ఆర్థిక మంత్రిత్వ శాఖ 8.25 శాతం రేటును ఆమోదించింది. తాజా రేటును 2024, మే 24నాటి లేఖ ద్వారా కార్మిక మంత్రిత్వ శాఖ అధికారికంగా తెలియజేసింది. ఇది క్లెయిమ్‌ల పరిష్కారం, ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలలో వడ్డీని జమ చేయడం కోసం ఫీల్డ్ ఆఫీసులకు కూడా తెలియజేసింది. ఆ తర్వాత ఈపీఎఫ్‌ఓ దీన్ని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ఇక ఇప్పుడు పెంచిన వడ్డీ రేట్లకు అనుకూలంగా క్లెయిమ్‌లు పరిష్కారం చేశారు.

ఈపీఎఫ్ బ్యాలెన్స్ తనిఖీ ఇలా..

ఈపీఎఫ్ఓ నిర్వహించే ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాలను ఉద్యోగులు నాలుగు పద్ధతులను ఉపయోగించి వారి ఖాతా బ్యాలెన్స్‌ను తనిఖీ చేయవచ్చు. అవి ఉమాంగ్ యాప్, ఈపీఎఫ్ఓ వెబ్ సైట్, ఎస్ఎంఎస్, మిస్డ్ కాల్ ద్వారా తెలుసుకోవచ్చు.

Show comments