EPFO: PF ఖాతాదారులకు ఊరట.. UAN నంబర్‌ లేకున్నా క్షణాల్లో బ్యాలెన్స్‌

పీఎఫ్‌ ఖాతాలో ఎంత నగదు జమ అయ్యింది.. ప్రతి నెల ఈ మొత్తం అకౌంట్‌లో పడుతుందా లేదా అని తెలుసుకోవాలంటే.. అందుకు వేర్వేరు పద్దుతులున్నాయి. ఆ వివరాలు..

పీఎఫ్‌ ఖాతాలో ఎంత నగదు జమ అయ్యింది.. ప్రతి నెల ఈ మొత్తం అకౌంట్‌లో పడుతుందా లేదా అని తెలుసుకోవాలంటే.. అందుకు వేర్వేరు పద్దుతులున్నాయి. ఆ వివరాలు..

నేటి కాలంలో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ఖాతా తప్పనిసరిగా ఉంటుంది. దీన్నే ప్రావిడెంట్‌ ఫండ్‌.. పీఎఫ్ ఖాతా అంటారు. పని చేసే కంపెనీలు ఉద్యోగుల వేతనం నుంచి 12 శాతం పీఎఫ్ ఖాతాలో జమ చేస్తాయి. అలాగే కంపెనీ సైతం అంతే మొత్తంలో జమ చేస్తుంటుంది. అయితే కొన్ని ప్రైవేటు కంపెనీల్లో.. రెండు భాగాలు.. ఉద్యోగి జీతం నుంచే కట్‌ చేస్తారు. పీఎఫ్‌ ఖాతాలో జమ అయ్యే నగదు మీద కేంద్ర ప్రభుత్వం వడ్డీ ఇస్తుంటుంది. ప్రతి ఏడాది వడ్డీ రేటును సవరిస్తుంది.

ఇటీవలే కేంద్రం పీఎఫ్ అకౌంట్ వడ్డీ రేటును 8.15 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతి ఉద్యోగి.. నెలనెలా.. పీఎఫ్ అకౌంట్లో నగదు జమ అవుతుందా.. ఎంత అవుతుంది.. ప్రస్తుతం ఎంత బ్యాలెన్స్‌ ఉంది అనే వివరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఈ వివరాలన్ని పొందాలంటే.. కచ్చితంగా యూఏఎన్‌ నంబర్‌ తెలిసి ఉండాలి. అయితే ఇకపై మీరు యూఏఎన్ నంబర్‌తో సంబంధం లేకుండానే పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

ఒక్క మిస్ట్‌కాల్‌తో పీఎఫ్‌ బ్యాలెన్స్‌..

ఇక మీదట మీరు యూఏఎన్‌ నంబర్‌తో పని లేకుండానే.. పీఎఫ్‌ బ్యాలెన్స్‌ను చెక్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు ఓ నంబర్‌కు ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు మీ పీఎఫ్ అకౌంట్ వివరాలు మీ మొబైల్ నంబర్‌కే వస్తాయి. ఇందుకోసం మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 9966044425 అనే ఈపీఎఫ్ఓ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని క్షణాల్లో మీ పీఎఫ్ అకౌంట్ వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో మీ మొబైల్ ఫోన్‌కు చేరతాయి. ఇందులో చివరి సారిగా మీ పీఎఫ్ అకౌంట్లో జమ అయిన నగదు సహ.. ప్రస్తుతం మీ పీఎఫ్‌ ఖాతాలో ఎంత మొత్తం ఉంది వివరాలు వెల్లడవుతాయి. అయితే ఇందుకోసం మీ యూఏఎన్ నంబర్ యాక్టివ్‌లో ఉండాలి. అకౌంట్ హోల్డర్ ఫోన్ నంబర్, యూఏఎన్‌తో రిజిస్టర్ అయి ఉండాలి. ఆధార్, పాన్ కార్డు లేదా బ్యాంక్ ఖాతా‌తో యూఏఎన్ సీడింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఉమాంగ్ యాప్ ద్వారా..

అలానే ఉమాంగ్ యాప్ ద్వారా ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలో ఎంత మొత్తం ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. సాధారణంగా యూనిఫైడ్ పోర్టల్ ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు. అయితే ఇలా బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవాలంటే.. దీనికి మీ వద్ద యూఏఎన్ నంబర్, పాస్‌వర్డ్ ఉండాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన త్రవాత పాస్ బుక్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

ఎస్‌ఎంఎస్‌ ద్వారా..

అలానే మీ మొబైల్‌ ఫోన్‌లోనే నేరుగా పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ నుంచి ‘ఈపీఎఫ్‌ఓహెచ్‌ఓ యూఏఎన్‌’ నంబర్‌ అని టైప్‌ చేసి.. 7738299899 నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపించాలి. అప్పుడు నేరుగా మీ మొబైల్‌కే పీఎఫ్‌ ఖాతాలో ఎంత మొత్తం ఉంది వంటి వివరాలు ఎస్‌ఎంఎస్‌ రూపంలో వస్తాయి.

Show comments