eBikeGo Muvi 125 5G: సూపర్ ఫీచర్స్ తో సరికొత్త EV.. సింగిల్ ఛార్జ్ తో 100KM రేంజ్

సూపర్ ఫీచర్స్ తో సరికొత్త EV.. సింగిల్ ఛార్జ్ తో 100KM రేంజ్

eBikeGo Muvi 125 5G: కొత్త ఎలక్ట్రిక్ బైక్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే సరికొత్త ఈవీ మార్కెట్ లోకి లాంఛ్ అయ్యింది. సింగిల్ ఛార్జ్ తో 100 కి.మీల వరకు ప్రయాణించొచ్చు.

eBikeGo Muvi 125 5G: కొత్త ఎలక్ట్రిక్ బైక్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే సరికొత్త ఈవీ మార్కెట్ లోకి లాంఛ్ అయ్యింది. సింగిల్ ఛార్జ్ తో 100 కి.మీల వరకు ప్రయాణించొచ్చు.

ఎలక్ట్రిక్ వెహికిల్స్ కు డిమాండ్ పెరుగుతున్నది. మార్కెట్ లోకి సరికొత్త ఫీచర్స్ తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదలవుతున్నాయి. బడ్జెట్ ధరల్లోనే ఈవీలు వస్తుండడంతో వాహనదారులు ఈవీల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఫీచర్లు కూడా ఆకట్టుకుంటుండడంతో ఈవీ బైక్ లు, స్కూటర్లు, కార్లు సేల్స్ లో దూసుకెళ్తున్నాయి. తక్కువ ఖర్చుతోనే ప్రయాణించే వీలుండడం, డబ్బు ఆదా అవుతుండడంతో ఎలక్ట్రిక్ వెహికిల్స్ కు ఆదరణ పెరిగింది. ఈ క్రమంలో ఈవీ ప్రియులకు మరో గుడ్ న్యూస్. మార్కెట్ లోకి మరో కొత్త ఈవీ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఈవీ తయారీ కంపెనీ ఈబైక్ గో మువీ 125 5జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసింది.

ఈవీ స్కూటర్లు, ఆఫీసులకు వెళ్లే వారికి, నగర ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారాయి. పొల్యూషన్ రహితంగా ఉండడం అదే సమయంలో ఖర్చు కూడా తక్కువ అవుతుండడంతో ఈవీలను కొనేందుకు ఇంట్రెస్టు చూపిస్తున్నారు. తాజాగా మార్కెట్ లోకి వచ్చిన ఈబైక్ గో మువీ 125 5జీ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ ఛార్జ్ తో 100 కి.మీల వరకు ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది. దీనిలో 5కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ అందించారు. ఇది మూడు గంటల సమయంలోనే సున్నా నుంచి 80 శాతం బ్యాటరీ చార్జ్ అవుతుంది. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో అద్భుతమైన ఫీచర్లను అందించారు.

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లో స్మార్ట్ ఎల్ఈడీ డిజిటల్ డిస్ ప్లే డ్యాష్ బోర్డు ఉంటుంది. మొబైల్ యాప్ తో కనెక్ట్ చేసిన అనేక ఫీచర్లు ఉంటాయి. ఇటీవల విడుదలవుతున్న ఈవీలలో కాల్ నోటిఫికేషన్స్, మెసేజ్, నావిగేషన్, ఇలా లేటెస్ట్ ఫీచర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్ లోకి విడుదలవుతున్నాయి. ఈవీతో ప్రయాణం ఈజీగా ఉండడంతో వాహనదారులు ఎలక్రిక్ వెహికిల్స్ కొనుగోలుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఓలా, ఏథర్ వంటి కంపెనీలు ఈవీ సేల్స్ లో దూసుకెళ్తున్నాయి. మరి మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్ ను కొనాలనుకుంటే కొత్తగా విడుదలైన ఈబైక్ గో మువీ 125 5జీని ఓసారి ట్రై చేయండి.

Show comments