ఎయిర్ఇండియాకు భారీ జరిమానా! కారణం ఏంటంటే!

Air India: దేశీయ దిగ్గజ ఎయిర్‌ లైన్స్ ఎయిరిండియాకు భారీ షాక్ తగిలింది.

Air India: దేశీయ దిగ్గజ ఎయిర్‌ లైన్స్ ఎయిరిండియాకు భారీ షాక్ తగిలింది.

దేశీయ దిగ్గజ ఎయిర్‌ లైన్స్ ఎయిరిండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఝలక్ ఇచ్చింది. ఎయిర్ ఇండియాకు భారీ జరిమానా విధించింది. రూ.98 లక్షల భారీ జరిమానా విధించినట్లు డీజీసీఏ ఓ ప్రకటనలో తెలిపింది. అర్హత లేని సిబ్బందితో విమానాలు నడుపుతున్నందుకు గాను ఈ జరిమానా విధించినట్లు తెలిపింది. ఎయిర్ ఇండియా డైరెక్టర్ ఆపరేషన్స్,  డైరెక్టర్ శిక్షణపై రూ. 6 లక్షలు, రూ. 3 లక్షల జరిమానా విధించింది. అలానే మొత్తంగా రూ.98 లక్షల జరిమానాను డీజీసీఏ ఎయిర్ ఇండియాకు విధించింది.

Show comments