6 లక్షల్లోపే అదిరే కారు.. పవర్ ఫుల్ ఇంజిన్- ట్రాఫిక్ సమస్య కూడా ఉండదు..

Maruti Suzuki Best Budget Car: బడ్జెట్ కారు అనగానే అందరికీ మారుతీ సుజుకీ కంపెనీనే గుర్తొస్తుంది. అలాంటి కంపెనీ నుంచి ఒక క్యూట్ కారు బడ్జెట్ రేంజ్ లోనే ఉంది. పైగా మార్చి ఎండింగ్ వరకు రూ.62 వేల వరకు అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

Maruti Suzuki Best Budget Car: బడ్జెట్ కారు అనగానే అందరికీ మారుతీ సుజుకీ కంపెనీనే గుర్తొస్తుంది. అలాంటి కంపెనీ నుంచి ఒక క్యూట్ కారు బడ్జెట్ రేంజ్ లోనే ఉంది. పైగా మార్చి ఎండింగ్ వరకు రూ.62 వేల వరకు అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

కారు కొనాలి అనేది ప్రతి ఒక్కరి డ్రీమ్ అయ్యే ఉంటుంది. కానీ, కారు కొనడం అంటే అంత సులువు కాదు. ముఖ్యంగా కుటుంబ అవసరాలను బట్టి కారు తీసుకోవాల్సి ఉంటుంది. కొంత మందికి పెద్ద పెద్ద కార్లు అవసరం కావచ్చు. కానీ, ఒక్కో ఫ్యామిలీకి చిన్న కారు అయితే సరిపోతుంది. అలాంటి వారికి ఇప్పుడు చెప్పుకోబోయే కారు పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. పైగా అది బడ్జెట్ లోనే ఉంటుంది కూడా. లుక్స్ మాత్రం అదిరిపోతాయి. ఎంతో స్టైలిష్ గా ఉంటుంది. అలాగే ఇది మంచి పవర్ ఫుల్ ఇంజిన్ తో వస్తోంది. మరి.. ఆ కారు ఏది? దాని వివరాలు ఏంటో చూద్దాం.

ఇప్పుడు చెప్పుకుంటోంది మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన ఇగ్నిస్ గురించి. ఇది చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది. ఒక స్మాల్ ఫ్యామిలీకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఈ కారు ధర విషయానికి వస్తే.. రూ.5.84 లక్షల నుంచి ఎక్స్ షోరూమ్ ధర ప్రారంభమై రూ.8.11 లక్షల వరకు వెళ్తుంది. ఆన్ రౌడ్ ప్రైస్ దీనికి ఇకాస్త అదనంగా ఉంటుంది. ఇది మొత్తం 4 వేరియంట్లలో అందుబాటులో ఉంది. సిగ్మా, డెల్టా, జెటా, ఆల్ఫా అనే 4 వేరియంట్లలో లభిస్తోంది. ఇంజియన్ విషయానికి వస్తే.. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తోంది. ఇది 1197సీసీని కలిగి ఉంటుంది. స్మాల్ కార్ అయినా ఇంజిన్ మాత్రం పవర్ ఫుల్ గా ఉంటుంది.

 

ఈ ఇంజిన్ 113 ఎన్ఎం టార్క్, 81.8 బీహెచ్ పీ పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్యూయల్ మాత్రం కేవలం పెట్రోల్ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ట్రాన్సిషన్స్ మాత్రం ఆటోమేటిక్- మాన్యువల్ రెండు ట్రాన్సిషన్స్ లో అందుబాటులో ఉంది. మైలేజ్ పరంగా కూడా ఈ కారు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇది మాన్యూవల్ అయినా.. ఆటోమేటిక్ అయినా లీటరుకు 20.89 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుందని కంపెనీ క్లయిమ్ చేస్తోంది. ఈ ఇగ్నిస్ కారు ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ తో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఉన్నాయి. ఎల్ఈడీ ప్రొజెక్ టెడ్ హెడ్ లైట్స్ విత్ డీఆర్ఎల్స్, ఆటోమేటిక్ క్లయిమెట్ కంట్రోల్ కూడా ఉంటుంది.

ఇగ్నిస్ కారులో సేఫ్టీ పరంగా కూడా మంచి ఫీచర్సే ఉన్నాయి. డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఏబీఎస్ విత్ ఈబీడీ సహా రేర్ కార్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. ఈ కారులో కలర్స్ విషయానికి వస్తే.. 7 సింగిల్ టోన్, 3 డ్యూయల్ టోన్ కలర్స్ లో ఈ కారు అందుబాటులో ఉంది. డ్యూయల్ టోన్స్ లో లూసెంట్ ఆరెంజ్ విత్ బ్లాక్ రూఫ్, నెక్సా బ్లూ విత్ సిల్వర్ రూఫ్, నెక్సా బ్లూ విత్ బ్లాక్ రూఫ్ టాప్ డ్యూయల్ టోన్స్ లో అందుబాటులో ఉంది. ఇగ్నిస్ పై మార్చి ఎండింగ్ వరకు రూ.62 వేల వరకు అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ కారు ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ లో టాటా టియాగో, మారుతీ వ్యాగనార్, సెలేరియో కార్లతో పోటీ పడుతుంది. లుక్స్, పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం అద్భుతంగా ఉంటుంది. అయితే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకున్న తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. ఇది కేవలం అవగాహనం కోసం మాత్రమే. మరి.. ఈ మారుతీ సుజుకీ ఇగ్నిస్ కారుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలయజేయండి.

Show comments