Hyderabadలో ఇల్లు లేదా ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా? ధరలు తగ్గే ఛాన్స్!

Chance Of Decrease Home Prices: ఇల్లు లేదా ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ధరలు తగ్గే అవకాశం ఉంది. అవును మీరు విన్నది నిజమే. హైదరాబాద్ లోని కొన్ని ఇళ్లకు డిమాండ్ భారీగా పడిపోయింది. దీంతో ధరలు తగ్గే ఛాన్స్ కనిపిస్తుంది.  

Chance Of Decrease Home Prices: ఇల్లు లేదా ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ధరలు తగ్గే అవకాశం ఉంది. అవును మీరు విన్నది నిజమే. హైదరాబాద్ లోని కొన్ని ఇళ్లకు డిమాండ్ భారీగా పడిపోయింది. దీంతో ధరలు తగ్గే ఛాన్స్ కనిపిస్తుంది.  

హైదరాబాద్ లో ఇల్లు లేదా ఫ్లాట్ కొనాలని చాలా మందికి ఒక కల. అయితే ధరలు పెరగడమే తప్ప తగ్గే అవకాశం కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ధరలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయం నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించిన నివేదికలను చూస్తేనే అర్థమవుతుంది. జూలై 2024లో హైదరాబాద్ లో 4,266 కోట్ల రూపాయల విలువైన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదికలో వెల్లడించింది. గత ఏడాది నుంచి ఈ ఏడాది జూలైకి 48 శాతం పెరిగిందని, ఒక్క జూలై నెలలోనే 7,124 యూనిట్లు రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే 28 శాతం పెరిగినట్లు తెలిపింది. జనవరి నుంచి ఇప్పటిదాకా 46,368 యూనిట్ల ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయని తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే 17 శాతం పెరిగిందని వెల్లడించింది.

ఇక స్టాంప్ డ్యూటీల ద్వారా రాష్ట్రానికి జనవరి నుంచి జూన్ నెల మధ్యలో రికార్డు స్థాయి ఆదాయం వచ్చినట్లు పేర్కొంది. ఏకంగా 28,578 కోట్ల రూపాయలు వచ్చాయని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. ఏడాది నుంచి ఏడాదికి 40 శాతం పెరిగింది.  50 లక్షల కంటే తక్కువ ధర కలిగిన ప్రాపర్టీలు జూలై నెలలోనే ఎక్కువగా రిజిస్టర్ అయినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గిందని తెలిపింది. గత ఏడాది జూలైలో 69 శాతం రిజిస్ట్రేషన్లు జరగ్గా ఇప్పుడు 61 శాతానికి పడిపోయింది. జూలై నెలలో ఎక్కువగా కోటి రూపాయల కంటే ఎక్కువ ధర కలిగిన ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లే అధికంగా జరిగాయి. గత ఏడాది 9 శాతం ఉంటే ఈ ఏడాది 13 శాతానికి పెరిగింది. దీన్ని బట్టి ఇల్లు కొనాలనుకునేవారు లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.

1000 నుంచి 2000 చదరపు అడుగుల మధ్య విస్తీర్ణం కలిగిన ప్రాపర్టీస్ ఎక్కువగా హైదరాబాద్ లో జూలై నెలలో రిజిస్టర్ అయ్యాయి. అయితే 1000 చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణం కలిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గాయని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. గత ఏడాది 21 శాతానికి ఉన్న రిజిస్ట్రేషన్లు ఈ ఏడాది 17 శాతానికి పడిపోయినట్లు తెలిపింది. 2000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన ఇళ్లనే ఎక్కువ మంది కొంటున్నారని తేలింది. గత ఏడాది 11 శాతం ఉంటే ఈ ఏడాది 14 శాతానికి పెరిగింది. చాలా మంది లగ్జరీ ఫ్లాట్స్ కి, లగ్జరీ ఇళ్లకే ప్రాధాన్యత ఇస్తుండడంతో తక్కువ స్పేస్ ఉన్న ఇళ్లను కొనేందుకు ఆసక్తి కనబరచడం లేదు. దీంతో చిన్న ఇళ్లు, చిన్న ఫ్లాట్స్ డిమాండ్ అనేది తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గుతున్న కారణంగా బిల్డర్స్ ధరను తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న ఇల్లు లేదా 1 బీహెచ్కే ఫ్లాట్ కొనుక్కోవాలి అని అనుకునేవారికి ఇదే మంచి అవకాశం. ధరలు పెరగడం మాటలా ఉంచితే డిమాండ్ లేని కారణంగా తగ్గించి అమ్మే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Show comments