అత్తా, కోడలు.. ఈ పేర్లు వినగానే మన మెదడులో మెదిలే ఒకే ఒక ఆలోచన వాళ్లిద్దరికి అస్సలు పడదు. ఒకరంటే ఒకరికి కోపం. ఎప్పుడూ ఏదో ఒక విషయంపై గొడవ పడుతూనే ఉంటారు. ఇది అనాదిగా వస్తున్న అత్తా, కోడళ్లపై ఉన్న అభిప్రాయాం. కానీ ఈ అత్తా,కోడలు అలా కాదు. తన కోడలిని కన్న బిడ్డలాగా అపురూపంగా చూసుకునేది. కానీ కొన్నాళ్ల క్రితం అత్త చనిపోయింది. దీంతో కోడలు ఎంతో బాధపడింది. ఇక తన అత్త ప్రేమకు గుర్తుగా ఓ వ్యాపారాన్ని ప్రారంభించింది. ఆ వ్యాపారం కూడా తన అత్త రాసిన ఓ డైరీ ద్వారా ప్రారంభించడం విశేషం. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
టీఎస్ అజయ్-సోనమ్ సురానా భార్యాభర్తలు. వీరు తమ తల్లి ప్రేమ లత పేరుమీద(సోనమ్ సురానాకు అత్త) 2020లో నవంబర్ లో ప్రేమ్ ఈటాసీ అనే సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ వినియోగదారులకు రుచికరమైన హోం మేడ్ ఆహారపదార్థాలను అందిస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థ ఇప్పటి వరకు 1500 మందికి పైగా సేవలను అందస్తోంది. సోనమ్, అజయ్ లు తమ తల్లి చేసిన రుచికరమైన వంటల గుర్తుగా ఈ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ప్రారంభించడానికి అసలు పునాది ఎక్కడ పడిందంటే? ప్రేమలత చనిపోయిన సంవత్సరం తర్వాత.. సోనమ్ తన అత్త గదిని శుభ్రం చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు అత్త రాసిన డైరీ దొరికింది. ఆ డైరీలో ఆమె ఎన్నో రకాల వంటకాల గురించి రాసింది.
అయితే సోనమ్ కు వంటలపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కానీ ఓసారి అత్త డైరీలో ఉన్న వంటకాన్ని ట్రై చేసింది. రుచిగా ఉండటంతో.. వీటిని తన బంధువులకు పంపించింది. వారు వాటిని రుచి చూసి అద్భుతంగా ఉన్నాయనడంతో.. దీన్నే వ్యాపారంగా ఎందుకు చేయకూడదు అన్న ఆలోచన ఆమెకు వచ్చింది. తన భర్త, మామ ప్రోత్సాహంతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించింది. నగరంలోని పలు ఎగ్జిబిషన్లలో స్టాల్స్ ఓపెన్ చేసి.. తన వంటకాలను ప్రదర్శించారు. ఈ వ్యాపారినికి సూపర్ రెస్పాన్స్ రావడంతో.. తన అమ్మకాలతో మెుదటి నెలలోనే రూ. 5 లక్షలు సంపాదించింది. వీరు 21 రకాల పచ్చళ్లు, పౌడర్ లు, ఇతర ఫుడ్స్ కు సంబంధించిన వస్తువులను విక్రయిస్తూ.. ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్ లోకి కూడా వ్యాపారాన్ని విస్తరించారు. మరి అత్త దిద్దిన ఈ కోడలి వ్యాపారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.