iDreamPost
android-app
ios-app

మామను తండ్రిగా భావించి తలకొరివి పెట్టిన కోడలు

జీవనోపాధి కోసం చాలా మంది ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వెళుతుంటారు. వృద్దులైన తల్లిదండ్రులను సొంత ఊరిలో ఉంచి.. దూరంగా వెళుతుంటారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే... పరుగెత్తలేని పరిస్థితి. ఇక వారికేదైనా జరిగితే..?

జీవనోపాధి కోసం చాలా మంది ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వెళుతుంటారు. వృద్దులైన తల్లిదండ్రులను సొంత ఊరిలో ఉంచి.. దూరంగా వెళుతుంటారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే... పరుగెత్తలేని పరిస్థితి. ఇక వారికేదైనా జరిగితే..?

మామను తండ్రిగా భావించి తలకొరివి పెట్టిన కోడలు

విద్యా, ఉద్యోగం కోసం చాలా మంది విదేశాలకు పయనం అవుతున్నారు. బతుకుదెరువు కోసం మరికొంత మంది పొట్ట చేత బట్టుకుని, భార్యా బిడ్డల్ని, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని వదిలేసి.. తప్పనిసరి పరిస్థితుల్లో అబ్రాడ్ వెళుతున్నారు. అక్కడ వెళ్లి అష్టకష్టాలు పడుతున్నారు. తిరిగి వచ్చేద్దామంటూ చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు. ఇందులో దారుణం ఏంటంటే.. ఆప్తులు చివరకు ఇంట్లో కుటుంబ సభ్యులు చనిపోయినా కడసారి చూపుకు నోచుకోలేని పరిస్థితి. చివరకు కన్నతల్లిదండ్రులు చనిపోయినా.. కర్మకాండలు తమ చేతులతో జరపలేని దుస్థితి. ఇదిగో ఈ ఘటనే అందుకు ఉదాహరణ. బ్రతుకు దెరువు కోసం కొడుకు విదేశాల బాట పట్టగా.. తండ్రి అనారోగ్య సమస్యలతో  మరణించాడు. అతడు రాలేని పరిస్థితి. దీంతో కోడలే.. కొడుకుగా మారి తలకొరువు పెట్టింది.

ఈ హృదయ విదారకమైన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలో చోటుచేసుకుంది. బి.దొడ్డవరం గ్రామంలో నివసిస్తోంది బాపూజీ కుటుంబం. ఆయన కొడుకు, కోడలు దుర్గా భవానీతో కలిసి ఉంటున్నాడు. కాగా, ఇటీవల బాపూజీ కొడుకు జీవనోపాధి నిమిత్తం మస్కట్ వెళ్లాడు. అంతలో బాపూజీ బ్రెయిన్ డెడ్ కారణంగా మరణించాడు. ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్లడంతో తిరిగి రాలేని పరిస్థితి. అలాగే తండ్రి మరణం వేధించింది. అతడ్ని కడసారి చూసుకోలేకపోయానని, తన చేతులతో అంతిమ సంస్కారాలు చేయలేకపోయానని ఆవేదన చెందాడు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఈ విషయాన్నే భార్య దుర్గాభవానీకి చెప్పి కంటతడి పెట్టుకున్నాడు.

దీంతో భర్త బాధను సగం పంచుకుంది ఆ ఇల్లాలు. మామనే తండ్రిగా భావించింది. బాపూజీ కొడుకు దూరంగా ఉన్నందున.. మామగారి అంతిమ సంస్కారాలకు కొడుకుగా మారింది. అంతిమ సంస్కారాలకు అన్ని ఏర్పాట్లు చేసింది. మామను తండ్రిగా భావించి.. స్వయంగా పాడెమోసి తలకొరివి పెట్టి దగ్గరుండి అంతిమ సంస్కారం చేసింది. ఇవన్నీ కూడా భర్త అనుమతి తీసుకుని చేసింది. అతడు చేయలేకపోయిన కార్యక్రమాన్ని తన చేతులతో దగ్గరుండి చేసింది. మామకు అంతిమ సంస్కారాలు చేసిన తీరుపై ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్టులు ప్రశంసలు కురిపిస్తున్నారు.