iDreamPost
android-app
ios-app

కోడలు మరో కులం అమ్మాయి అని.. 13 మంది కలిసి విషం ఇచ్చి!

  • Published Sep 05, 2024 | 1:42 PM Updated Updated Sep 05, 2024 | 1:42 PM

ఇంక ఎక్కడుంది సమాజం. ఎటు పోతుంది లోకం అనేలా కొన్ని సంఘటనలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. కోడలు తమ కులం కాదని పొట్టన పెట్టుకుంది ఓ అత్తింటి కుటుంబం.

ఇంక ఎక్కడుంది సమాజం. ఎటు పోతుంది లోకం అనేలా కొన్ని సంఘటనలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. కోడలు తమ కులం కాదని పొట్టన పెట్టుకుంది ఓ అత్తింటి కుటుంబం.

  • Published Sep 05, 2024 | 1:42 PMUpdated Sep 05, 2024 | 1:42 PM
కోడలు మరో కులం అమ్మాయి అని.. 13 మంది కలిసి విషం ఇచ్చి!

ఆకాశంలో సగం, అవనిలో సగం అంటూ చెప్పుకోవడానికే కానీ ఆచరణలో శూన్యం. ఆడపిల్ల పుట్టిందంటేనే భారమని బాధపడే రోజులు పోయినా.. చదువు, పెళ్లిళ్ల విషయంలో ఇంకా ఆమె డెసిషన్ మేకర్ కావడం లేదు. తనకు నచ్చిన వ్యక్తిని చేసుకునే హక్కు మేజర్ అయినా మహిళకు ఉన్నా.. లేదా చేసుకున్నా.. తిప్పలు తప్పడం లేదు. చివరకు వివాహం చేసుకున్నాక.. కుల వివక్షతో అత్తింటి ఆరళ్లతో నగిలిపోతుంది. సూటి పోటీ మాటలతో కించపరచడం, అదనపు కట్న వేధింపులు వంటి చితిలో కాలిపోతుంది. అప్పటి వరకు తనే ప్రాణమన్న భర్త కూడా ఆమెను హింసిస్తున్నాడు. చివరకు ఆమె అడ్డు తొలగించుకునేందుకు కూడా వెనకాడం లేదు. ఇదిగో ఇక్కడ చక్కని చుక్కలా ఉన్న ఈ అమ్మాయిని కూడా బలితీసుకుంది అత్తింటి కుటుంబం.

మరో కులానికి చెందిన అమ్మాయిని కొడుకు పెళ్లి చేసుకున్నాడన్న అక్కసుతో కోడల్ని అత్యంత కిరాతకంగా పొట్టన పెట్టుకుంది ఆమె అత్తింటి కుటుంబం. ఈ ఘటన కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో చోటుచేసుకుంది. గంగావతి తాలూకాలోని విఠలాపుర గ్రామానికి చెందిన హనుమయ్య.. మరియమ్మ అనే అమ్మాయిని ప్రేమించాడు. వీరి ఇద్దరివి వేర్వేరు కులాలు కావడంతో హనుమయ్య పేరెంట్స్ ఒప్పుకోలేదు. అయినప్పటికీ.. గత ఏడాది ఏప్రిల్‌లో ప్రియురాలి మెడలో మూడుముళ్లు చేసి తనదాన్ని చేసుకున్నాడు హనుమయ్య. అయితే తల్లిదండ్రులకు అస్సలు ఇష్టం లేకపోయినా.. కొడుకు కోసం భరించారు. పెళ్లైన నాటి నుండి ఆమెను హింసిస్తూ ఉన్నారు. తాజాగా ఆమె తండ్రికి ఫోన్ చేసి కూతురు విషం తాగిందని, ఆసుపత్రికి తీసుకెళుతున్నామంటూ చెప్పారు. తండ్రి హుటా హుటిన బయలు దేరి వెళ్లి చూడగా.. అప్పటికే విగతజీవిగా కనిపించింది.

అయితే కూతురు మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులు ఫిర్యాదు చేశాడు మరియమ్మ తండ్రి. ఆమెను నిత్యం అత్తామామలు కులం పేరుతో తిట్టేవారని, కట్నం తీసుకు రావాలంటూ డిమాండ్ చేసేవారని కంప్లయింట్‌లో పేర్కొన్నాడు. ఈ విషయం తనకు చెప్పి బాధపడిందని తెలిపాడు. ఇందులో అత్తామామలే కాదు.. కుటుంబంలో 13 మంది ప్రమేయం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశాడు. వీరందరు కలిసి తన కూతుర్ని హత్య చేశారంటూ ఆరోపించారు. ఆమెకు అత్తామామలే విషం ఇచ్చి చంపి.. ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరిస్తున్నారని, తన కూతుర్ని చంపడానికి ముందు శారీరకంగా దాడి చేశారంటూ పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, తండ్రి ఆరోపణలు ఇంకా నిర్దారణ కావాల్సిందని చెబుతున్నారు పోలీసులు. దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet