iDreamPost

వీడియో: ప్రయోగించిన కాసేపటికి కుప్పకూలిన రాకెట్..!

Chinese Space Rocket Crashes: తరచూ ఏదో ఒక ప్రాంతంలో విమానాలు, హెలికాప్టర్లు ప్రమాదానికి గురవుతుంటాయి. అలానే రాకెట్లు కూడా ప్రయోగం చేసే సందర్భంలో వివిధ కారణాలతో కుప్పకూలిపోతుంటాయి. అలాంటి ఘటనే తాజాగా ఒకటి చోటుచేసుకుంది.

Chinese Space Rocket Crashes: తరచూ ఏదో ఒక ప్రాంతంలో విమానాలు, హెలికాప్టర్లు ప్రమాదానికి గురవుతుంటాయి. అలానే రాకెట్లు కూడా ప్రయోగం చేసే సందర్భంలో వివిధ కారణాలతో కుప్పకూలిపోతుంటాయి. అలాంటి ఘటనే తాజాగా ఒకటి చోటుచేసుకుంది.

వీడియో: ప్రయోగించిన కాసేపటికి కుప్పకూలిన రాకెట్..!

సాంకేతిక సమస్య కారణంగా తరచూ విమానాలు, హెలికాప్టర్లు ప్రమాదాలకు గురవుతుంటాయి. ఈ ఘటనల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటారు. ఇటీవల కాలంలో హెలికాఫ్టర్లు సాంకేతిక లోపంతో ప్రమాదానికి గురైన సంఘటనలు చాలా జరిగాయి. ఇలా కేవలం విమానాలు, హెలికాప్టర్లే కాకుండా రాకెట్లు కూడా ప్రమాదానికి గురవుతుంటాయి. ప్రయోగం చేసే సందర్భంలో అవి వివిధ కారణాలతో కుప్పకూలిపోతుంటాయి. దీంతో ప్రాణ నష్టం సంభవించకపోయినా.. భారీగా ఆర్థిక నష్టం జరుగుతుంది. తాజాగా ఓ రాకెట్..ప్రయోగించిన కాసేపటికే గాల్లో రెండుగా ముక్కలై..పేలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఆవివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

చైనాలో ఈ రాకెట్ కుప్పకూలిన ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు ఏరోస్పేస్ కంపెనీ స్పేస్ ఎక్స్ ప్రయోగించిన రాకెట్ కుప్పకూలిపోయింది. సదరు కంపెనీనే స్వయంగా తయారు చేసి.. ఈ రాకెట్ ను ప్రయోగించింది. అయితే దానిలోని కంప్యూటర్ పని చేయకపోవడంతో రాకెట్ విఫలమైందని  అక్కడి శాస్త్రవేత్తలు తెలిపారు. రాకెట్ ను ప్రయోగిచింన కొన్ని సెకన్లలోనే  ఫెయిల్యూర్ అయింది. నిప్పులు చిమ్ముకుంటూ రాకెట్ గాల్లోకి ఎగిరిన కొన్ని క్షణాల్లో పేలిపోయింది. అంతేకాక రెండు ముక్కలుగా విడిపోయి.. సమీపంలోని అడవుల్లో పడింది. ఆదివారం చైనీస్ టియాన్లాంగ్- 3 రాకెట్ కేంద్రం చైనాలోని హెనాన్ ప్రావిన్స్ లో ప్రయోగం చేపట్టింది.

ఇక ఈ రాకెట్ అంతరిక్షంలోకి వెళ్లక ముందే లాంచ్ ప్యాడ్ నుంచి టేకాఫ్ అయిన కొంత సమయంలోనే బ్లాస్ట్ అయ్యింది. ప్రయోగించిన ప్రదేశంలో నుంచి 1.5 కిలో మీటర్ల దూరంలో ఉన్న అడవిలోని కొండపై కూలిపోయింది. రాకెట్ బాడీ.. టెస్ట్ బెంచ్ మధ్య అనుసంధానం నిర్మాణ ఫెయిలైందని అక్కడి శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ రెండిటి మధ్య కనెక్షన్  మిస్ కావడంతోనే రాకెట్ గాల్లోకి ఎగిరిన 30 సెకండ్లలో బ్లాస్ట్ అయ్యిందని ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ స్పేస్ ఎక్స్ స్పేస్ సైంటిస్టులు చెప్పారు. అయితే ఈ పేలుడు ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, కంపెనీ స్పష్టం చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక రాకెట్ పేలుడు దృశ్యాలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ వీడియోను మీరు వీక్షించి..మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి