Tirupathi Rao
దీపావళి పండుగ రానే వస్తోంది. ఈ పండగకు అందరూ సొంతూరుకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఏదైనా కారణం చేత ప్రయాణం వాయిదా పడితే టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ పడతాయి. కానీ ఇలా చేస్తే మీకు ట్రైన్ టికెట్స్ పై ఫుల్ అమౌంట్ రిఫండ్ అవుతుంది.
దీపావళి పండుగ రానే వస్తోంది. ఈ పండగకు అందరూ సొంతూరుకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఏదైనా కారణం చేత ప్రయాణం వాయిదా పడితే టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ పడతాయి. కానీ ఇలా చేస్తే మీకు ట్రైన్ టికెట్స్ పై ఫుల్ అమౌంట్ రిఫండ్ అవుతుంది.
Tirupathi Rao
ఇప్పుడు అందరూ పట్టణాలు, నగరాలు అంటూ సొంత ఊరిని వదిలేసి ఎక్కడెక్కడో జీవిస్తున్నారు. అలాంటి వారు పండుగ అనగానే సొంతూరికి బయటల్దేరుతారు. పండగ ఏదైనా కూడా సొంతూరిలో, సొంత వారితో సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు. పండుగ అనగానే చాలా రోజుల ముందే బస్సు, ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుంటారు. అయితే సమయానికి ఊరు వెళ్లలేక వాటిని క్యాన్సిల్ చేయాలి అంటే ఛార్జెస్ పోను తిరిగి దక్కేది చాలా తక్కువనే చెప్పాలి. కానీ, ఈ దీపావళికి మాత్రం మీ ట్రైన్ టికెట్ ఫుల్ అమౌంట్ మీకు దక్కే ఛాన్స్ ఉంది.
ఇటీవల దసరా ఘనంగా జరుపుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు దీపావళిని సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అయిపోయారు. అయితే పండగ ఏదైనా కూడా కొందరైతే చాలా రోజుల ముందే టికెట్ బుక్ చేసుకుటారు. అలా బుక్ చేసుకున్న తర్వాత కచ్చితంగా ఊరు వెళ్తారా? అంటే అందరికి కాకపోయినా కూడా కొందరికి సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు ఆ టికెట్ ని క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. అలా క్యాన్సిల్ చేస్తే రైల్వేస్ లెక్కల ప్రకారం చాలానే ఛార్జెస్ పడతాయి. కట్టిన మొత్తంలో మీకు భారీ కోత పడే అవకాశం ఉంటుంది. కానీ, ఇప్పుడు ఈ దీపావళికి ప్రముఖ పేమెంట్స్ సంస్థ Paytm అదిరిపోయే ఆఫర్ ఇస్తోంది. అదేంటంటే.. తమ ప్లాట్ ఫామ్ ని ఉపయోగించి ఈ దీపావళికి టికెట్స్ బుక్ చేసుకున్న వారికి మంచి డీల్ తీసుకొచ్చింది.
ప్రయాణానికి 6 గంటల ముందు మీరు టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా కూడా.. మీకు టికెట్ ధర మొత్తాన్ని వెంటనే ఖాతాలో జమ చేస్తామంటూ చెప్పుకొచ్చింది. నిజానికి ఇది చాలా మంచి డీల్ అనే చెప్పాలి. ఎలాంటి క్యాన్సిలేషన్ ఛార్జెస్ లేకుండా మొత్తం టికెట్ ప్రైస్ మీకు అందిస్తామంటున్నారు. అంతేకాకుండా.. తమ ప్లాట్ ఫామ్ ద్వారా ఈ దీపావళికి బస్సు టికెట్స్ బుక్ చేసుకునే వారికి కూడా గుడ్ న్యూస్ చెప్పారు. బస్సు టికెట్లు బుక్ చేసుకునే వారికి రూ.500 వరకు తగ్గింపు అందిస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. అంటే ఈ దీపావళికి పేటీఎం ద్వారా మీరు బస్సు టికెట్ బుక్ చేసుకున్నా, ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నా కూడా లాభపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరి.. పేటీఎం తీసుకొచ్చిన ఈ ఆఫర్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.