సామాన్యులకు భారీ షాక్.. పెరగనున్న వంట నూనె ధరలు!

  • Author Soma Sekhar Published - 05:04 PM, Tue - 25 July 23
  • Author Soma Sekhar Published - 05:04 PM, Tue - 25 July 23
సామాన్యులకు భారీ షాక్.. పెరగనున్న వంట నూనె ధరలు!

పేద, మధ్య తరగతి వర్గాల నెత్తిన మరో పిడుగు పడనుంది. ఇప్పటికే కూరగాయలు, బియ్యం ధరలు పెరగడంతో.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్య జనానికి మరో షాక్ తగలనుంది. నిన్న మెున్నటి వరకు కాస్త తగ్గినట్లుగా అనిపించిన వంట నూనె ధరలు.. భారీగా పెరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వంట నూనె, గోధుమల ధరలను భారీగా పెంచేందుకు మార్కెట్ సిద్దం అవుతున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. వంట నూనె ధరలు పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ పరిణామాలు, వర్షాల కారణంగా దేశంలో సన్ ప్లవర్ ఆయిల్, గోధుమ ధరల పెరుగుదలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

సామాన్యుల నెత్తిన మరో పిడుగు పడనుంది. ఇప్పటికే కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ.. వంట నూనె ధరలు భారీగా పెరగబోతున్నయి అంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో పేద, మధ్యతరగతి ప్రజానీకంపై తీవ్రమైన భారం పడబోతోంది. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాన్ని యుద్దం నేపథ్యంలో నిలిపివేయడంతో.. ఇండియాలో సన్ ప్లవర్ ఆయిల్ లభ్యాత, ధరలపై గణనీయమైన ప్రభావం చూపింది. ఇక బ్లాక్ సీ గ్రెయిన్ ఒప్పందాన్ని రష్యా నిలిపివేసిందనకు వరల్డ్ వైడ్ గా గోధుమ ధరలు కూడా పెరుగుతున్నాయి.

కాగా.. వంట నూనె, గోధుమ ధరలు వచ్చే 3-4 నెలల్లో మరో 15 శాతం పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది సామాన్య జనానికి భారీ షాక్ అనే చెప్పాలి. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ.. వంట నూనె ధరలు, గోధుమల ధరలు పెరుగుతాయి అన్న వార్తలు సామాన్య వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరి ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Show comments