Citroen C3: మార్కెట్లో అదరగొడుతున్న సిట్రోయిన్ సీ3 కార్! తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్లు..

Citroen C3: సిట్రోయిన్ సీ3 హ్యాచ్‌బ్యాక్ కార్ ఒక రేంజిలో వాహనదారులను ఆకట్టుకుంటుందనే చెప్పాలి. దానికి కారణం ఈ కారులో అదిరే ఫీచర్లు రావడమే.

Citroen C3: సిట్రోయిన్ సీ3 హ్యాచ్‌బ్యాక్ కార్ ఒక రేంజిలో వాహనదారులను ఆకట్టుకుంటుందనే చెప్పాలి. దానికి కారణం ఈ కారులో అదిరే ఫీచర్లు రావడమే.

సిట్రోయిన్ కంపెనీ నుంచి వచ్చిన సీ3 హ్యాచ్‌బ్యాక్ కార్ ఒక రేంజిలో వాహనదారులను ఆకట్టుకుంటుందనే చెప్పాలి. దానికి కారణం ఈ కారులో తక్కువ ధరలో అదిరే ఫీచర్లు రావడమే. ఈ సిట్రోయెన్ సీ3 కార్ రెండు పవర్ ఫుల్ పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్లతో వస్తుంది. ఒకటి 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్. ఇది మాక్సిమం 82 ps పవర్‌ని 115 nm టార్క్‌ని జనరేట్ చేస్తుంది. అయితే ఇది కేవలం 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఆప్షన్స్‌తో మాత్రమే వస్తుంది. మరొకటి 1.2-లీటర్ టర్బోఛార్జ్డ్‌ పెట్రోల్ ఇంజిన్. ఇది మాక్సిమం 110 ps పవర్ ని 205 nm టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్‌తో వస్తుంది.

ఈ కార్ లీటరుకు 19.3 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ కార్ మార్కెట్లో లైవ్, ఫీల్, షైన్ వేరియంట్లలో లభిస్తుంది. ఇది 4 మోనోటోన్‌, 6 డ్యూయల్‌ టోన్‌ కలర్‌ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉంటుంది.ఇక C3 టర్బో వేరియంట్‌లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్-హోల్డ్ అసిస్ట్ ఇంకా అలాగే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులో 10.2 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, 7 అంగుళాల ఫుల్ డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే ఇంకా ఆటో ఏసీ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే.. ప్రయాణికుల కోసం ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌, EBDతో కూడిన ABS, పార్కింగ్ సెన్సార్‌లతో కూడిన వెనుక కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇక ఈ కారులో మొత్తం 5 మంది సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఈ కార్ బడ్జెట్ ధరలో కొనుగోలు చేయడానికి మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ కార్ ఎక్స్ షోరూమ్ ధర రూ.6.16 లక్షల నుంచి రూ.9.30 లక్షల దాకా ఉంది.మార్కెట్లో సిట్రోయిన్‌ సీ3 కారు సేల్స్‌ మాములుగా లేవనే చెప్పాలి.గత నెల (ఆగస్టు 2024)లో కంపెనీ 507 యూనిట్ల ‘సీ3’ కార్లను అమ్మింది. 2023 ఆగస్టులో 250 యూనిట్లు అమ్ముడుపోయాయి. దాంతో పోలిస్తే ఇది 102 శాతం వృద్ధి రేటుగా చెప్పవచ్చు. ఇక రాబోయే రోజుల్లో కచ్చితంగా ఈ అమ్మకాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఈ కార్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments