iDreamPost
android-app
ios-app

నాన్ వెజ్ లవర్స్‌కి అదిరిపోయే వార్త.. చికెన్ ధర తగ్గిందోచ్

ఈ మధ్య కాలంలో చికెన్, మటన్ ధరలు ఆకాశాన్ని తాకాయి. నాన్ వెజ్ ప్రియులు కడుపునిండా తినలేని పరిస్థితి. ముక్క లేనిదే ముద్ద దిగదే అనుకుంటున్నారా.? అయితే అదిరిపోయే గుడ్ న్యూస్.

ఈ మధ్య కాలంలో చికెన్, మటన్ ధరలు ఆకాశాన్ని తాకాయి. నాన్ వెజ్ ప్రియులు కడుపునిండా తినలేని పరిస్థితి. ముక్క లేనిదే ముద్ద దిగదే అనుకుంటున్నారా.? అయితే అదిరిపోయే గుడ్ న్యూస్.

నాన్ వెజ్ లవర్స్‌కి అదిరిపోయే వార్త.. చికెన్ ధర తగ్గిందోచ్

నీచు లేనిదే నాన్ వెజ్ లవర్స్‌కి ముద్ద దిగదు. ప్రతి రోజు వండి పెట్టాలే కానీ లొట్టలేసుకుని లాగించేస్తుంటారు. శనివారం, సోమవారం, శుక్రవారం అనే నిబంధనలు పట్టించుకోరు. చికెన్, మటన్ ముందు ఏ వారం గుర్తుకు రాదు. ఇక పండుగ నాడు కూడా పప్పు వండితే.. ఇంట్లో తల్లిపై, భార్యపై సీరియస్ అవుతుంటారు. పూజ, ఫలహారం అన్నా కూడా పట్టించుకోరు మాసాంహార ప్రియులు. చికెన్, మటన్, కనీసంలో కనీసం ఎగ్ ఆమ్లేట్ అయినా కంచంలో కనబడాల్సిందే. అయితే ఈ మధ్య మటన్, చికెన్ ధరలు పెరిగి సామాన్యులకు షాక్‌నిచ్చాయి. కేజీ కొనుక్కునే చోట అరకేజీనే తెచ్చుకుని సరిపుచ్చుకున్నారు. ఇక మటన్ అయితే సగటు మానవుడు కొనలేని పరిస్థితి చేరిపోయింది. ఈ రెండింటి బాటలోనే నడిచింది గుడ్డు ధర కూడా. ఏకంగా 7 రూపాయలకు చేరింది.

కడుపునిండా తినలేకపోతున్న నాన్ వెజ్ లవర్స్‌కి అదిరిపోయే వార్త. కోడి మాంసం ధర భారీగా తగ్గింది. ఇప్పటి వరకు కేజీ చికెన్ ధర రూ. 280 నుండి రూ. 300 వరకు పలకగా.. ఇప్పుడు అమాంతం తగ్గింది. రూ. 180 నుండి రూ. 200 వరకు తగ్గుముఖం పట్టింది. ఇటు లైవ్ దగ్గర నుండి స్కిన్, స్కిన్ లెస్ చికెన్ వరకు రేట్లు భారీగా తగ్గాయి. అయితే రాష్ట్రంలో కోళ్ళ లభ్యత పెరగడమే ధరలు తగ్గుదలకు కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. అలాగే సోమవారం నుండి శ్రావణ మాసం వచ్చేయడంతో నాన్ వెజ్‌కు పెద్ద గిరాకీ ఉండకపోవడం కూడా ఈ ధరల తగ్గుదలకు కారణాలు అవుతున్నాయి. శ్రావణ మాసం వస్తే ఇంట్లో మహిళలు పూజలు, వరలక్ష్మీ వ్రతం, మంగళ గౌరీ వ్రతం అంటూ పూజలు చేస్తుంటారు. ఈ సమయంలో చికెన్, మటన్, ఫిష్, కనీసం ఎగ్ వండటానికి కూడా ఇష్టపడరు.

ఈ నేపథ్యంలోనే చికెన్ ధరలు ఈ మేరకు తగ్గినట్లు తెలుస్తుంది. వీటికి తోడు.. ఇక్కడ నుండి పండుగల కాలం కూడా మొదలు కాబోతుంది. వరలక్ష్మీ వ్రతం, రాఖీ పూర్ణిమ, కృష్ణాష్టమి, ఆ వెంటనే వినాయక చవితి వంటి పండుగలు కూడా రాబోతున్నాయి. దీంతో ఇటు వ్యాపారులకు కాస్తంత గడ్డుకాలం ఎదురయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక గుడ్డు ధర కూడా తగ్గుతుంది. గతనెలలో రూ.7 పలికిన గుడ్డు ధర ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో రూ.6 నుంచి రూ.6.50 ధర పలుకుతోంది.హోల్ సేల్ మార్కెట్లో రూ.5 నుంచి రూ.5.50 అమ్ముతున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న ధర కన్నా దిగువకు చికెన్ రేటు పడిపోతే పౌల్టీ నిర్వాహకులు భారీగా నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందంటున్నారు. అయితే మాసాలు, వారాలతో సంబంధం లేని వాళ్లకు ఇది అదిరిపోయే శుభవార్తే కదా.