Gold Scheme: కేంద్రం సరికొత్త ఆలోచన.. 30 వేలకే తులం బంగారం.. ఎలా అంటే..!

Central Govt- 10 Grms Gold For 30k: బంగారం ధరలు చుక్కలను తాకుతున్నాయి. పది గ్రాముల ప్యూర్ గోల్డ్ రేటయితే 75 వేలకు చేరింది. ఈ క్రమంలోనే కేంద్రం రూ.30 వేలకే పది గ్రాముల బంగారాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..

Central Govt- 10 Grms Gold For 30k: బంగారం ధరలు చుక్కలను తాకుతున్నాయి. పది గ్రాముల ప్యూర్ గోల్డ్ రేటయితే 75 వేలకు చేరింది. ఈ క్రమంలోనే కేంద్రం రూ.30 వేలకే పది గ్రాముల బంగారాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..

బంగారంతో భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉంది. అత్యంత ఖరీదైన లోహంగా మాత్రమే కాక.. లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తారు. పసిడి ఎంత ఎక్కువ ఉంటే అంత ధనవంతులన్నట్లుగా చూస్తారు. ఇంట్లో ఆడపిల్ల పుడితే.. తను జన్మించినప్పటి నుంచే బంగారం కొనుగోళ్లు మొదలు పెడతారు. వివాహా సమయానికి భారీ ఎత్తున పుత్తడి కొనుగోలు చేస్తారు. ఇక ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు వరకు మన దేశంలో బంగారం ధర రాకెట్ వేగంతో దూసుకుపోయి.. గరిష్టాలకు చేరింది. అయితే బడ్జెట్ లో ఖరీదైన లోహాల మీద ట్యాక్స్ తగ్గించడంతో.. బంగారం ధర భారీగా దిగి వచ్చింది. పది గ్రాముల మీద ఏకంగా 7 వేల రూపాయల వరకు తగ్గింది.

ధర తగ్గడంతో దేశీయల బులియన్ మార్కట్ లో పసిడి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. పైగా శ్రావణ మాసం రావడంతో.. భారీ ఎత్తున కొనుగోళ్లు సాగాయి. మరి తగ్గిన రేటు.. అలానే ఉందా అంటే.. లేదు గత కొన్ని రోజులుగా గోల్డ్ రేటు పెరుగుతూనే ఉంది. ఇప్పుడు దేశయ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ గోల్డ్ పది గ్రాములకు 73వేల రూపాయలు దాటి పరుగులు పెడుతోంది. త్వరలోనే ఇది లక్ష రూపాయలకు చేరుతుందని విశ్లేషకులు అంటున్నారు. పైగా, ఇండియా సహా చాలా దేశాల రిజర్వు బ్యాంకులు సైతం బంగారం నిల్వలు పెంచుకునే పనిలో ఉన్నాయి.

రూ.30 వేలకే తులం బంగారం..

ప్రస్తుతం దేశీయ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల మేలిమి బంగారం పది గ్రాముల రేటు 73 వేలు, 22 క్యారెట్ల బంగారం ధర 68 వేల రూపాయల వరకు ఉంది. అయితే, ఇంత ఖరీదు పెట్టి బంగారం కొనడం పేదలు, దిగువ మధ్య తరగతి వారికి చాలా కష్టం. అందుకే వారి కోసం కేంద్రం సరికొత్త ఆలోచన చేస్తుందట. పేదలు కూడా గోల్డ్ కొనుగోలు చేసేలా.. 30 వేల రూపాయలకే పది గ్రాముల బంగారం కొనుగోలు చేసే అవకాశం కల్పించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. మరి 30 వేలకే 10 గ్రాముల బంగారం కొనడం సాధ్యామా అంటే..

మరి 30రూపాయలకే తులం బంగారం ఎలా సాధ్యం అంటే.. 9 క్యారెట్ గోల్డ్ తో సాధ్యం అన్నమాట. బంగారానికి ఉన్న డిమాండ్ తో పాటు, పెరుగుతున్న ధరలతో అందరికీ పసిడిని అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో.. కేంద్రం ఈ 9 క్యారెట్ల బంగారం తీసుకొచ్చే ఆలోచనతో ఉందని తెలుస్తోంది.

ఈ 9 క్యారెట్ల బంగారం ధర 10గ్రాములకు 25 వేల నుండి 30వేల మధ్య ఉండే అవకాశం ఉందని గోల్డ్ ట్రేడర్స్ అంచనా వేస్తున్నారు. బంగారం ఎంత ప్యూరిటీ ఉంది అనేందుకు హాల్ మార్క్, బీఎస్ఐ ముద్రలు బంగారంపై ముద్రిస్తుంటారు. ఇప్పుడు 9 క్యారెట్ల బంగారానికి కూడా నాణ్యత ధ్రువీకరణను కూడా వినియోగించుకునే అవకాశం ఉంది.

కేంద్రం తీసుకొచ్చే ఈ 9 క్యారెట్ల బంగారం దిగువ, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేస్తుందన్న అభిప్రాయం ఉన్నప్పటికీ, మేలిమి బంగారానికి ఉండే డిమాండ్ ఎప్పుడూ అలాగే ఉంటుంది. మరి కేంద్రం అనుకున్న ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.

Show comments