మహిళల కోసం కేంద్రం బెస్ట్ స్కీమ్! ఇలా చేస్తే ఏకంగా రూ.32 వేలు లాభం!

దేశంలోని ఆడ పిల్లలు, మహిళల ఆర్థిక భద్రత కొరకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రకరకాల స్కీమ్స్ అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆడ పిల్లలు, మహిళలు ఆర్థిక సంరక్షణ కోసం కేంద్ర ప్రభుతం మరో కొత్త పథకాన్ని అమలులోకి తెచ్చింది.

దేశంలోని ఆడ పిల్లలు, మహిళల ఆర్థిక భద్రత కొరకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రకరకాల స్కీమ్స్ అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆడ పిల్లలు, మహిళలు ఆర్థిక సంరక్షణ కోసం కేంద్ర ప్రభుతం మరో కొత్త పథకాన్ని అమలులోకి తెచ్చింది.

కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రజలు అర్థికంగా అభివృద్ధి చెందడం కోసం ఎప్పటికప్పుడు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంటుంది. ముఖ్యంగా ఈ పథకాల్లో పేద ప్రజల దగ్గర నుంచి చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు, ఉద్యోగస్తులు, రైతులు ఇలా అన్ని వర్గాలకు చెందినవారి కోసం ప్రత్యేకంగా ఎన్నో స్కీమ్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఇటీవలే దేశంలోని ఆడ పిల్లలు , మహిళలు ఆర్థిక భద్రత మేరకు మరో కొత్త పథకంను అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపోతే ఈ పథకం పోస్టాఫీసులతో పాటు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, అర్హత కలిగిన ప్రైవేట్ రంగ బ్యాంకులలో అమలు చేస్తుంది. ఇంతకీ ఆ పథకం వివరాలేంటో తెలుసుకుందాం.

దేశంలోని ఆడ పిల్లలు, మహిళల ఆర్థిక భద్రత కొరకు కేంద్ర ప్రభుత్వం ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్‘ అనే పథకంను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఈ పథకం పై  కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ జూన్ 27, 2023న ఈ-గెజిట్ జారీ చేసింది.  ఇక ఈ పథకాన్ని పోస్టాఫీసుతో పాటు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, అర్హత కలిగిన ప్రైవేట్ రంగ బ్యాంకులలో అమలు చేస్తుంది. అలాగే ఈ పథకం పోస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఏప్రిల్ 1, 2023 నుంచి అమలులో ఉంది. కాగా, ఇది మార్చి 31, 2025 వరకు రెండేళ్ల కాలానికి సేవింగ్స్ సర్టిఫికేట్ చెల్లుబాటు అవుతుంది.

అయితే బాలికలు, మహిళలకు  సురక్షితమైన పెట్టుబడి పథకంగా ఈ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకాన్ని కేంద్రం అమలు చేస్తుంది. ఇకపోతే ఈ పథకం మార్చి 31, 2025న లేదా అంతకంటే రెండు సంవత్సరాల పరిమితితో ఖాతాను తెరవచ్చు. కాగా, ఈ పథకంలో పెట్టుబడికి సంవత్సరానికి 7.5 శాతం చొప్పున వడ్డీ వస్తుంది.  అలాగే ప్రతి త్రైమాసికానికి కాంపాండ్ వడ్డీ లెక్కగడతారు. ఇందులో కనిష్టంగా రూ.1,000, గరిష్టంగా రూ.2,00,000 డిపాజిట్ చేయవచ్చు. ఈ స్కీమ్ లో డిపాజిట్ చేసిన నగదు మెచ్యూరిటీ ప్రారంభించిన తేదీ నుంచి రెండేళ్లు ఉంటుంది. అయితే అత్యవసర సమయంలో పాక్షికంగా నగదు విత్ డ్రాకు అవకాశం కల్పిస్తారు. ఇక స్కీమ్ ఖాతాలో అర్హతను బట్టి బ్యాలెన్స్‌లో గరిష్టంగా 40 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ స్కీమ్ లో రూ.2 లక్షలు పెట్టుబడి పెడితే రెండేళ్ల తర్వాత రూ.32044 వడ్డీ అందుకోవచ్చు.

ఎమ్ఎస్ఎస్ఎస్ స్కీమ్ అర్హతలు

  • ఈ స్కీమ్ దరఖాస్తుదారులు కచ్చితంగా భారతీయులై ఉండాలి.
  • ముఖ్యంగా మహిళలు, ఆడపిల్లలు మాత్రమే ఈ స్కీమ్ కు అర్హులు.
  • అలాగే వ్యక్తిగత మహిళ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఇక మైనర్ ఖాతాను తండ్రి, సంరక్షుడు ద్వార తెరవవ్చు.
  • ఇక ఇందులో గరిష్ట వయోపరిమితి లేదు, అన్ని వయసుల మహిళలు ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు.

దరఖాస్తు ప్రక్రియ(ఆఫ్‌లైన్)

  • ముందుగా దరఖాస్తుదారులు  సమీపంలోని పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్, షెడ్యూల్ బ్యాంకులో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఇక దరఖాస్తుదారులు ఈ ఫామ్ ను అధికారిక వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత దరఖాస్తు ఫామ్‌ను పూర్తి చేసి, అవసరమైన అన్ని పత్రాలను జత చేయాలి.
  • ఇక డిక్లరేషన్, నామినేషణ్ అనే వివరాలను కూడా అందించి ఎంత డిపాజిట చేస్తున్నారో ధరఖాస్తులో తెలియజేయాలి.
  • చివరిగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్’ పథకంలో మీరు పెట్టుబడి పెట్టినట్లు రుజువుగా సర్టిఫికేట్‌ను పొందాలి.

ఈ స్కీమ్ దరఖాస్తుకు అవసరమైన పత్రాలు

  • పాస్‌పోర్ట్ సైజు ఫోటో
  • బర్త్ సర్టిఫికేట్
  • ఆధార్ కార్డ్
  • పాన్ కార్డ్
  •  డిపాజిట్ మొత్తం, చెక్‌తో పాటు పే-ఇన్-స్లిప్
  •  గుర్తింపు, చిరునామా రుజువు పత్రాలు : పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు ఐడీ, ప్రభుత్వ అధికారి సంతకంతో NREGA జాబ్ కార్డ్ కూడా ఉండాలి
Show comments