దూసుకుపోతున్న BSNL.. ఇక ఇంటికే సిమ్‌ కార్డ్‌ డెలివరీ.. ప్రాసెస్‌ ఇదే!

BSNL SIM Card-Home Delivery: కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటి వద్దకే ఆ సర్వీసులను అందించనుంది. ఆ వివరాలు..

BSNL SIM Card-Home Delivery: కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటి వద్దకే ఆ సర్వీసులను అందించనుంది. ఆ వివరాలు..

ఇటీవల ప్రైవేటు టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వీఐ రీఛార్జ్ ప్లాన్‌లను 15-20 శాతం వరకు పెంచిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక చౌక ధరకే ప్లాన్స్‌ అందించే ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారుతున్నారు. ఇప్పటికే కొన్ని లక్షల మంది బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారారు. ఇక వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం.. వారి సంఖ్యను పెంచుకోవడం కోసం.. బీఎస్‌ఎన్‌ఎల్‌ నిరంతరం ప్రయత్నిస్తోంది. అలానే వారి కోసం రకరకాల ప్లాన్స్‌తో పాటుగా.. సిమ్ముకార్డుల జారీ​కి సంబంధించి కూడా అనేక నిర్ణయాలు తీసుకుంది. ఈక్రమంలో తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక ఇంటి వద్దకే ఆ సర్వీసులను తెచ్చేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు..

బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త సిమ్ము కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. అయితే సంస్థ వినియోగదారుల కోసం ఒక గొప్ప ఆఫర్‌ను తీసుకొచ్చింది. మీరు కొత్త బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌ను పూర్తి ఉచితంగా పొందడమే కాక.. కొత్త సిమ్‌ పొందడానికి మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. కంపెనీ ప్రతినిధే మీ ఇంటి వద్దకి వచ్చి ఉచితంగా సిమ్‌ని డెలివరీ చేస్తారు. ఈ పద్దతిలో పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ సిమ్‌లను ఉచితంగా ఆర్డర్ చేయవచ్చు. మీరు ఇంట్లో కూర్చొని ఫ్రీగా మా ఇంటి వద్దనే సిమ్‌ను పొందవచ్చు. ఇందుకు అదనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తోన్న ఈ ఆఫర్‌ను మీరు కూడా సద్వినియోగం చేసుకోవాలనుకుంటే వెంటనే కింది స్టెప్స్‌ ఫాలో అయిపోండి. అయితే ఇక్కడ అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే.. బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌ ఫ్రీ హోం డెలివరీ అన్ని ప్రాంతాల్లో అందుబాటులో లేదు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి.

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫ్రీ సిమ్‌ పొందాలంటే..

  • మొదట బీఎస్‌ఎన్‌ అధికారిక వెబ్‌సైట్‌ https://www.bsnl.co.in/కు వెళ్లండి.
  • ఇక్కడ మీరు మీ లొకేషన్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి.
  • తరువాతి స్టెప్‌లో మీకు బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌ని ఎంచుకునే అవకాశం లభిస్తుంది.
  • ఆ తర్వాత మీరు సిమ్‌ కార్డ్ డెలివరీ కోసం మీ అడ్రస్‌ను ఎంటర్‌ చేయాలి.
  • పూర్తి వివరాలను అందించిన తర్వాత.. బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్ మీ ఇంటికే డెలివరీ అవుతుంది.

ఇలా ఇంటి వద్దనే సిమ్ము పొందేందుకు మీరు రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. కనుక బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారదామని భావిస్తోన్న వారు.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కంపెనీ సూచిస్తోంది.

Show comments