రూ.50 లక్షల ఇంటిని రూ.35 లక్షలకే ఇలా సొంతం చేసుకోవచ్చు!

50 లక్షల ఇల్లు 35 లక్షలకు వస్తుందా? ఎక్కడ? ఎలా? అని అనుకుంటున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే.

50 లక్షల ఇల్లు 35 లక్షలకు వస్తుందా? ఎక్కడ? ఎలా? అని అనుకుంటున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే.

సొంతింటి కల లేనివారు ఉండరు. చాలా మందికి సొంతిల్లు ఉంటే బాగుంటుంది అన్న ఆలోచన ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జాగా దొరకడమే కష్టమైపోతుంది. దీంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రేట్లు దారుణంగా పెరిగిపోయాయి. స్థలం, ఇల్లు, పొలం ఏది కొనాలన్నా గానీ సామాన్యులు కొనలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ 10, 20 లక్షలు తగ్గింపుతో ఇల్లు వస్తుందంటే కొనకుండా ఉండగలమా? అవును ఇది నిజమే. ఒక ఇల్లు 50 లక్షలు ఉందనుకుంటే.. దాన్ని మీరు 35 లక్షలకే పొందవచ్చు. అంటే 15 లక్షలు తగ్గుతుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.    

ఏ ఇల్లు అయినా సరే దాని విలువలో గరిష్టంగా 30 శాతం తగ్గింపు అనేది ఉంటుంది. ఈ లెక్కన ఒక కోటి రూపాయల ఇంటిని 70 లక్షలకు సొంతం చేసుకోవచ్చు. ఇల్లు మాత్రమే కాదు.. ఫ్లాట్, ల్యాండ్ ఏదైనా గానీ 30 శాతం తగ్గింపుతో కొనుక్కోవచ్చు. దేశం మొత్తం మీద ఎక్కడైనా ఈ డిస్కౌంట్ అనేది ఉంటుంది. కొంతమంది బ్యాంకులో హోమ్ లోన్ మీద ఇల్లు కడుతూ ఉంటారు. లేదా ఆల్రెడీ కట్టిన ఇళ్లను, ఫ్లాట్స్ ని కొంటూ ఉంటారు. మరి కొంతమంది స్థలాలు కొంటూ ఉంటారు. అయితే హోమ్ లోన్ పెట్టే ముందు వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను బ్యాంకులో తనఖా పెడుతుంటారు. అయితే ఆర్థిక సమస్యల కారణంగా కొంతమంది లోన్ చెల్లించలేకపోతారు.

దీంతో బ్యాంకులు సదరు యజమానికి చెందిన ప్రాపర్టీని జప్తు చేస్తాయి. అలా జప్తు చేసిన వాటిని వేలం వేస్తుంటాయి. అసలు ధర కంటే తక్కువ ధరకే వేలం వేస్తుంటాయి. పలానా తేదీన వేలం ఉంటుంది. వేలంలో పాల్గొనాలని బ్యాంకులు పలు న్యూస్ పేపర్స్, వెబ్ సైట్స్ లలో ప్రకటనలు కూడా ఇస్తుంటాయి. ప్రత్యేకించి ఈ వేలంకి సంబంధించి కొన్ని వెబ్ సైట్స్ కూడా ఉన్నాయి. ఈ వెబ్ సైట్స్ లో దేశంలో పలు నగరాల్లో ఉన్న ప్రాపర్టీస్ ని ఆక్షన్ లో పెడుతుంటారు. ఇళ్ళు, ఫ్లాట్స్, స్థలాలు, కమర్షియల్ ప్రాపర్టీస్, వాహనాలు ఇలా చాలా వరకూ ఆక్షన్ లో పెడుతుంటాయి బ్యాంకులు. అయితే  ఈ ఆక్షన్ లో ఎక్కువ ధరకు పాడుకున్నవారికి ప్రాపర్టీ అనేది సొంతం అవుతుంది.

ఎవరైతే అందరి కంటే అధిక ధర చెల్లిస్తారో వారు.. బ్యాంకు నిర్ణయించిన ధరలో 10 నుంచి 15 శాతం డబ్బు ఆక్షన్ పూర్తయ్యాక చెల్లించాలి. ఉదాహరణకు 40 లక్షల ఇంటిని 50 లక్షలకు ఆక్షన్ లో పాడుకుంటే.. 5 లక్షల నుంచి 7,50,000 బ్యాంకు వారికి చెల్లించాల్సి ఉంటుంది. మిగతా అమౌంట్ ని 15 రోజుల్లో చెల్లించాలి. ఒకవేళ ఈ 15 రోజుల్లో మిగతా డబ్బు చెల్లించకపోతే బ్యాంకు ఆ అమౌంట్ ని తిరిగి ఇవ్వదు. అయితే వేలంలో పెట్టిన ప్రాపర్టీస్ ని కొనడం వల్ల కొన్ని రిస్కులు ఉంటాయని గమనించాలి.

ఆస్తులను వేలంలో కొనే ముందు టైటిల్ చెక్, ప్రాపర్టీ రిలేటెడ్ ఓనర్ షిప్ స్టేటస్ ని బాగా వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాపర్టీస్ కి బ్యాంకులు యజమానులు కాదు. ఏదైనా లీగల్ ఇష్యూ అయితే బ్యాంకులు బాధ్యత వహించవు. ఆక్షన్ లో ప్రాపర్టీని కొన్నవారు.. దానికి సంబంధించిన మున్సిపల్ పన్నులు, సొసైటీ ఛార్జీలు, చట్టబద్ధమైన బకాయిలు, విద్యుత్ బిల్లులు వంటివి ఏమైనా పెండింగ్ బిల్లులు ఉంటే చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ పరిశీలించిన అనంతరం వేలంలో ఇల్లు లేదా ఏదైనా ప్రాపర్టీని కొనుగోలు చేయడం మంచిది. foreclosureindia.com, findauction.com, eauctionsindia.com వంటి వెబ్ సైట్స్ లో బ్యాంకులు ప్రాపర్టీస్ కి సంబంధించిన వివరాలను అందుబాటులో ఉంచుతాయి.

Show comments