Bumper offer for motorists! Huge discounts from Okaya! వాహానదారులకు బంపర్ ఆఫర్! ఒకాయా నుంచి భారీ డిస్కౌంట్స్!

Okaya EV: వాహానదారులకు బంపర్ ఆఫర్! ఒకాయా నుంచి భారీ డిస్కౌంట్స్!

Okaya EV: ఒకాయా ఈవీల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇవి అందరికి అందుబాటు ధరలో ఉంటాయి.

Okaya EV: ఒకాయా ఈవీల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇవి అందరికి అందుబాటు ధరలో ఉంటాయి.

ప్రస్తుతం పండుగ సీజన్‌ కావడంతో పలు ఆటోమొబైల్ కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. వారి కోసం భారీగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.. తమ వాహనాలపై ప్రత్యేక తగ్గింపుని అందిస్తున్నాయి. రాబోయే దసరా పండుగ దాకా ఇలాంటి ఆఫర్లు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి అందుబాటు ధరల్లో మీకు నచ్చిన వాహనాన్ని కొనడానికి ఇదే సరైన సమయం. కస్టమర్లకు ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీలు ఎక్కువగా ఆఫర్లను అందిస్తున్నాయి. అందులో భాగంగా దేశంలో ఫేమస్ ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ ఒకాయా ఈవీ (Okaya EV) తన ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఈ ఆగస్టు నెలలో స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది.ఆ ఆఫర్ల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఎవరైతే కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్లని కొనుగోలు చెయ్యాలని భావిస్తున్నారో అలాంటి వారి కోసం పలు ఫైనాన్స్ స్కీమ్స్‌ని కంపెనీ ప్రకటించింది. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే కస్టమర్లు తమకు నచ్చిన మోడల్‌ని కేవలం రూ.1కే బుక్ చేసుకునే వీలు కల్పిస్తుంది. ఈ నెలలో ఓకియా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ని కొనుగోలు చేస్తే రూ.31,000 దాకా ప్రయోజనాలు పొందవచ్చు. అయితే కంపెనీ షోరూంలో స్టాక్ అయిపోయే వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలుస్తుంది. ఒకాయా ఎలక్ట్రిక్ స్కూటర్ బేస్‌ వేరియంట్‌ స్కూటర్‌ ప్రారంభ ధరలు రూ. 79 వేల దాకా ఉండగా ఇప్పుడు రూ .74 వేల నుంచి ప్రారంభం అవుతాయని తెలుస్తుంది..ఒకాయా ఫాస్ట్ ఎఫ్3 ధర రూ .1.34 లక్షలు ఉండగా ఇప్పుడు ఆఫర్ ధరలో రూ .1.09 లక్షలకే లభిస్తుంది.

ఇక కంపెనీ ఫ్లాగ్‌షిప్‌ ఇ-స్కూటర్‌ మోటోఫాస్ట్ రూ.1.54 లక్షలు ఉండగా ఇది ఆఫర్లో భాగంగా రూ .1.29 లక్షలకే వస్తుంది. ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటంటే ఈ స్కూటర్ల కొనుగోలుపై లోన్స్ కూడా అందిస్తుంది కంపెనీ. 6.99 శాతం నుంచి వడ్డీ రేటు స్టార్ట్ అవుతుంది. ఇలా లోన్‌ ద్వారా కూడా తమ స్కూటర్లను కొనుగోలు చేసే బంపర్ ఆఫర్ కంపెనీ ఇస్తుంది. లోన్ ద్వారా స్కూటర్లు కొన్నవారికి EMI లు రూ.2,999 నుంచి స్టార్ట్ అవుతాయి. అయితే ఫెర్రాటో డిస్ట్రప్టర్ (Ferrato Disruptor) ఎలక్ట్రిక్ బైక్ పై ఎలాంటి ఆఫర్‌ని ప్రకటించలేదు. ఎందుకంటే దీన్ని రీసెంట్ గానే లాంచ్ చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో రూ.1.60 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో ఈ బైక్ ని కంపెనీ లాంచ్ చేసింది.

Show comments