MG Windsor EV: అందుబాటు ధరలో సూపర్ ఎలక్ట్రిక్ కార్.. ఫీచర్లు సూపర్!

MG Windsor EV: బడ్జెట్ వినియోగదారుల కోసం ఎంజీ మోటార్ విండ్సర్ ఈవీని విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ధర ఇంకా ఫీచర్ల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

MG Windsor EV: బడ్జెట్ వినియోగదారుల కోసం ఎంజీ మోటార్ విండ్సర్ ఈవీని విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ధర ఇంకా ఫీచర్ల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రజలకు అందుబాటు ధరలో మంచి ఫీచర్లతో ఎక్కువ రేంజ్‌ అందించే కార్లకు ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఇలాంటి కార్లనే జనాలు ఎక్కవగా కొంటూ ఉంటారు. ఇక బడ్జెట్ వినియోగదారుల కోసం ఎంజీ మోటార్ కంపెనీ కూడా సరికొత్త విండ్సర్ ఈవీని విడుదల చేసింది. ఈ కొత్త విండ్సర్ ఎలక్ట్రిక్ కారు ధర, ఇంకా ఫీచర్ల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కార్ 38 కిలోవాట్స్‌ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌తో వస్తుంది. దీనిని ఫుల్‌ గా ఛార్జ్ చేస్తే 331 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఇందులోని సింగిల్‌ మోటార్‌ 134 bhp పవర్‌ని 200 nm టార్క్‌ని జనరేట్ చేస్తుంది. దీని ఎక్స్‌టీరియర్‌ కూడా అద్భుతమైన డిజైన్‌ని కలిగి ఉంది.

ఎంజీ విండ్సర్ ఈవీ 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్, కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ కారు ఎకో, ఎకో ప్లస్, నార్మల్, స్పోర్ట్ వంటి డ్రైవింగ్ మోడ్స్ లో వస్తుంది. ఈ కారు 6-ఎయిర్ బ్యాగ్స్‌, టీపీఎంఎస్ (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), ఇఎస్‌సీ (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), 360 డిగ్రీల కెమెరా వంటి సూపర్ సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది. ఇది జేఎస్‌డబ్ల్యూ, ఎంజీ మోటార్ కలిసి విడుదల చేసిన ఫస్ట్ కారు. ఇందులో ఇంకా చాలా సూపర్ ఫీచర్లు ఉన్నాయి.

విండ్సర్ ఎలక్ట్రిక్ కారులో స్ప్లిట్ LED హెడ్‌ల్యాంప్స్, LED DRL, ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్‌, ఫ్రంట్‌, రియర్, ఎల్ఈడీ లైట్స్‌, L ఆకారంలో ఉన్న ఎల్ఈడీ టెయిల్ లైట్లు, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, 18 ఇంచెస్‌ అల్లాయ్ వీల్స్ ఇంకా అలాగే 215/55 R 18 టైర్లు కూడా ఉన్నాయి. ఈ కారు 4,295 మిమీ పొడవు, 1,850 మిమీ వెడల్పు, 1,652 మిమీ ఎత్తు కలిగి ఉంటుంది. ఇంకా అంతే కాకుండా ఇది 2,700 మిమీ వీల్‌బేస్‌ని కలిగి ఉంది. ఇందులో 5 మంది ప్రయాణికులు సౌకర్యంగా కూర్చొని ప్రయాణించవచ్చు. ఈ కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ టర్కోయిస్ గ్రీన్, పెర్ల్ వైట్, క్లే బీజ్, స్టార్బర్‌ బార్ట్స్‌ బ్లాక్ వంటి నాలుగు కలర్లో వస్తుంది. ఈ కార్ చూడ్డానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఈ కార్ ప్రారంభ ధర రూ .9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇక ఈ సరికొత్త ఎంజీ విండ్సర్ ఈవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments