Budget 2024-Customs Duty To 6 Percent Gold Price Drop: బడ్జెట్‌ ఎఫెక్ట్‌.. కిలో మీద ఏకంగా రూ.6.20 లక్షలు తగ్గిన బంగారం ధర.. కారణమిదే

Gold Price: బడ్జెట్‌ ఎఫెక్ట్‌.. కిలో మీద ఏకంగా రూ.6.20 లక్షలు తగ్గిన బంగారం ధర.. కారణమిదే

Budget 2024-Customs Duty To 6 Percent Gold Price Reduced: గత కొన్ని రోజులుగా పెరగడమే తప్ప దిగి రావడం తెలియదు అన్నట్లుగా ఉన్న బంగారం ధర.. బడ్జెట్‌ ప్మరవేశపెట్టిన రుసటి రోజే కిలో మీద ఏకంగా 6 లక్షల రూపాయలకు పైగా దిగి రావడం గమనార్హం. ఆ వివరాలు.

Budget 2024-Customs Duty To 6 Percent Gold Price Reduced: గత కొన్ని రోజులుగా పెరగడమే తప్ప దిగి రావడం తెలియదు అన్నట్లుగా ఉన్న బంగారం ధర.. బడ్జెట్‌ ప్మరవేశపెట్టిన రుసటి రోజే కిలో మీద ఏకంగా 6 లక్షల రూపాయలకు పైగా దిగి రావడం గమనార్హం. ఆ వివరాలు.

బంగారానికి.. భారతీయ సమాజానికి అవినాభావ సంబంధం ఉంది. ఈ ప్రపంచంలో పుత్తడిని మనం ప్రేమించినంతగా ఇంకా ఏ దేశస్తులు ప్రేమించరేమో. ఇష్టమైన వారి మీద ప్రేమను కూడా బంగారంతోనే పోలుస్తాము. మన వద్ద బంగారం అంటే ఆభరణం మాత్రమే కాదు సాక్షత్తు లక్ష్మీ దేవి స్వరూపం.. అక్కరకు ఆదుకునే ఆపన్న హస్తం కూడా. అందుకే మన దేశంలో చాలా మంది సందర్భం దొరికిన ప్రతి సారి పసిడి కొనుగోలుకు ఆసక్తి చూపుతారు. చాలా వరకు పండగల సమయంలో పుత్తడి కొనుగోలు చేస్తారు. ఇక ఇంట్లో ఆడపిల్ల ఉంటే.. వారి కోసమని ప్రతి ఏటా ఎంతో కొంత బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో అయితే పసిడికి ఉండే డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంత పేదవారైనా సరే.. పెళ్లి వేళ ఎంతో కొంత గోల్డ్‌ కొంటారు.

అయితే గత కొంతకాలంగా మన దేశంలో పసిడి రేటు రాకెట్‌​ కన్నా వేగంగా దూసుకుపోతుంది. ఇప్పటికే పది గ్రాముల రేటు 75 వేలకు చేరుకుంది. అయితే రోజు రోజు పెరుగుతున్న బంగారం రేటుకు బడ్జెట్‌ కళ్లెం వేసింది. దాంతో పసిడి రేటు కిలో మీద ఏకంగా 6,20,000 రూపాయలు దిగి వచ్చింది. దీనిపై పసిడి ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు గోల్డ్‌ రేటు ఇంత భారీగా తగ్గడానికి గల కారణాలు ఏంటి.. ఇది ఇలానే కొనసాగుతుందా.. అనే వివరాలు మీ కోసం..

సగం తగ్గిన పన్ను భారం..

తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో.. బంగారం, వెండి, ప్లాటినం వంటి ఖరీదైన లోహాల మీద.. కస్టమ్స్‌ సుంకం భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే. 2024 బడ్జెట్‌ ముందు వరకు.. మన దేశంలో పసిడి, వెండిపై కస్టమ్స్ డ్యూటీ 10 శాతంగా ఉండగా.. ఇప్పుడు 5 శాతానికి తగ్గించారు. దీనికి అదనంగా విధిస్తున్నటువంటి వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సుంకాన్ని 5 శాతం నుంచి ఒక శాతానికి పరిమితం చేశారు. ఈ లెక్కన ఈ రెండు లోహాల మీద మొత్తంగా కస్టమ్స్ డ్యూటీ ఇకపై 6 శాతంగానే ఉండనుంది. జీఎస్టీలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఇది 3 శాతంగానే ఉంది. జీఎస్టీతో కలుపుకొని ఇప్పటివరకు బంగారం, వెండిపై సుంకాలు, పన్ను భారం 18 శాతం కాగా.. ఇప్పుడు సగానికి సగం అనగా 9 శాతానికి దిగొచ్చింది.

ఒక్కరోజే రూ. 6.20 లక్షలు పతనం..

బంగారంపై సుంకంలో ఒక్కసారిగా 9 శాతం కోత విధించిన నేపథ్యంలో ఒక్కరోజులోనే గోల్డ్‌ రేటు భారీగా దిగి వచ్చింది. ఈ క్రమంలో 24 క్యారెట్స్ గోల్డ్ రేటు కేజీకి రూ. 77.50 లక్షల నుంచి ఒక్కరోజులోనే రూ. 71.30 లక్షలకు దిగొచ్చింది. ఈ లెక్కన చూస్తే కిలో మీద ఏకంగా రూ. 6.20 లక్షలు పతనమైంది. ఇదే 10 గ్రాములకు చూస్తే రూ. 77,500 మీద 6,200 రూపాయలు పడిపోయి రూ. 71,300 కు చేరింది. ఇక వెండి ధర కూడా కేజీ మీద ఒక్క రోజే రూ. 3 వేలు పడిపోయింది. అయితే ఇప్పటి వరకు కస్టమ్స్ సుంకం పేరిట బంగారంతో పాటు ఇతర విలువైన లోహాలపై కేంద్రానికి భారీగా ఆదాయం వస్తోంది. అయితే బడ్జెట్‌లో ఈ సుంకాన్ని సగానికి సగం తగ్గిండచంతో.. ప్రభుత్వ ఆదాయం తగ్గే అవకాశం ఉంది. అయితే జీఎస్టీని పెంచడం ద్వారా ఈ లోటును భర్తీ చేయనున్నారని సమాచారం.

గోల్డ్‌ అక్రమ రవాణాను అడ్డుకోవడానికే.. బంగారంపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. బంగారం స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

Show comments