BSNL నుంచి ఎంతో చౌకైన ప్లాన్‌.. రూ.18కే 1 GB డేటాతో పాటుగా

BSNL Rs 18 Recharge Plan Benefits: కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌.. అత్యంత చౌకైన రీఛార్జ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. 18రూపాయలకే అపరిమిత బెనిఫిట్స్‌ అందజేస్తోంది. ఆ వివరాలు..

BSNL Rs 18 Recharge Plan Benefits: కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌.. అత్యంత చౌకైన రీఛార్జ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. 18రూపాయలకే అపరిమిత బెనిఫిట్స్‌ అందజేస్తోంది. ఆ వివరాలు..

ప్రస్తుతం టెలికాం రంగంలో తీవ్ర పోటీ నెలకొని ఉంది. మొన్నటి వరకు జియో, ఎయిర్‌టెల్‌ల మధ్య పోటీ నడుస్తుండగా.. ఇప్పుడు ఈ రెండు ప్రైవేటు టెలికాం కంపెనీలు.. బీఎస్‌ఎన్‌ఎల్‌తో తలపడుతున్నాయి. అందుకు కారణం.. ప్రస్తుతం జియో, ఎయిర్‌టెల్‌ కంపెనీలు తమ రీఛార్జ్‌ ప్లాన్‌ ధరలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కస్టమర్లు.. చౌకైన ప్లాన్స్‌ అందించే బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారుతున్నారు. జూలై నెలలోనే లక్షల మంది బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారారు. ఇక ఇదే అదునుగా.. కస్టమర్లను ఆకర్షించడం కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ అనేక చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో 4జీ సేవలు అందుబాటులోకి తెచ్చింది. 5జీ టెస్ట్‌ చేయడమే కాక.. సిమ్ములను అందుబాటులోకి తెచ్చింది. అలానే రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరల విషయానికి వస్తే.. బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి చౌకైన ప్లాన్స్‌ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఒకటైన 18 రూపాయల ప్లాన్‌ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాం.

బీఎస్‌ఎన్‌ఎల్‌ అత్యంత చౌకైన ప్లాన్‌ 18 రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది.. ఇక దీని ద్వారా అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 1 జీబీ డేటాను అందిస్తోంది. అయితే ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ కేవలం రెండు రోజులు మాత్రమే. అదే జియోలో ఈ ప్లాన్‌ రేటు ఇందుకు డబుల్‌ ఉంది. వ్యాలిడిటీ పూర్తైన తర్వాత, వినియోగదారులు 80కేబీపీఎస్‌ కంటే తక్కువ వేగంతో అపరిమిత ఇంటర్నెట్‌ను అందుకోవచ్చు. ఒకవేళ ఇదే ప్రయోజనాలను ఎక్కువ రోజుల వరకు పొందాలంటే.. అందుకు 87 రూపాయలు చెల్లించాలి. 14 రోజులకు గాను ఇవే ప్రయోజనాలు కలిగిన ప్లాన్‌.. రూ. 87 ధరతో వస్తుంది. ఈ ప్యాక్‌లో రోజుకు 1 జీబీ డేటా సౌకర్యం అందుబాటులో ఉంది. అలాగే, అపరిమిత వాయిస్ కాల్స్ సౌకర్యం కూడా ఉంది. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను కూడా అందిస్తుంది.

ఇక ఇదే ప్రయోజనాలను 28 రోజుల పాటు పొందాలంటే.. అందుకు రూ.184 ప్రీపెయిడ్ ప్లాన్ అందుబాటులో ఉంది. ఇది 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 184 రూపాయలతో రీఛార్జ్‌ చేసుకుంటే.. ప్రతి రోజు 1జీబీ డేటాతో పాటు 100 ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ప్లాన్స్‌ అన్నింటిలో అపరిమిత వాయిస్‌ కాల్స్‌ అందుబాటులో ఉన్నాయి. అదనంగా మీరు ఉచిత లిస్టన్‌ పాడ్‌క్యాస్ట్ సభ్యత్వాన్ని పొందుతారు. రిలయన్స్‌, జియోలో ఇదే ప్రయోజనాలు పొందాలంటే.. బీఎస్‌ఎన్‌ఎల్‌తో పోలిస్తే.. అధిక మొత్తంలోనే చెల్లించాలి. మీరు కనక డేటా తక్కువ వాడితే.. బీఎస​ఎన్‌ఎల్‌ 184 ప్లాన్‌ ఉత్తమం అంటున్నారు.

Show comments