iDreamPost
android-app
ios-app

మ్యాడ్ హీరో మిస్టరీ థ్రిల్లర్ ‘గ్యాంబ్లర్’ రిలీజ్ డేట్ ఇదే..

  • Published May 23, 2025 | 12:42 PM Updated Updated May 23, 2025 | 12:55 PM

మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ లాంటి ఎన్నో సినిమాలతో ప్రేక్షకులలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాడు సంగీత్ శోభన్. ఇక ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీ అయ్యాడు ఈ యంగ్ హీరో.ఈ హీరో నుంచి మరో కొత్త సినిమా రాబోతుంది. అదే గ్యాంబ్లర్

  • Published May 23, 2025 | 12:42 PMUpdated May 23, 2025 | 12:55 PM
మ్యాడ్ హీరో  మిస్టరీ థ్రిల్లర్ ‘గ్యాంబ్లర్’ రిలీజ్ డేట్ ఇదే..

ఈ మధ్య కాలంలో సంగీత్ శోభన్ సినిమాలకు మంచి క్రేజ్ పెరుగుతుంది. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ లాంటి ఎన్నో సినిమాలతో ప్రేక్షకులలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీ అయ్యాడు ఈ యంగ్ హీరో. ఈ క్రమంలో ఈ హీరో నుంచి మరో కొత్త సినిమా రాబోతుంది. అదే గ్యాంబ్లర్. ఇప్పటివరకు సంగీత్ కామెడీ జోనర్ లో ఉండే సినిమాలను మాత్రమే చేసేవాడు. కానీ ఈసారి మాత్రం ఓ కొత్త ప్రయత్నం చేయబోతున్నాడు. ఓ మిస్టరీ థ్రిల్లర్ ను ఎంచుకుని సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఈ హీరో.

ఈ సినిమాలో కేసీఆర్‌ ఫేమ్‌ రాకింగ్‌ రాకేష్‌ పృథ్వీరాజ్‌ బన్న, సాయి శ్వేత, , జస్విక, భరణి శంకర్‌, మల్హోత్త్ర శివ, శివారెడ్డి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈరోజే రిలీజ్ చేశారు. శ్రీవల్లి అనే సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాను నిర్మించిన నిర్మాతలు సునీత, రాజ్‌కుమార్‌ బృందావనంలు ఈ సినిమాను రేష్మాస్‌ స్టూడియోస్‌, స్నాప్‌ అండ్‌ క్లాప్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు దాదాపు పూర్తయినట్లు సమాచారం. జూన్ 6న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారట మేకర్స్. సో ఇక సంగీత్ శోభన్ ఈ జోనర్ మూవీతో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.