iDreamPost
android-app
ios-app

OG ఐటెం సాంగ్ గురించి సూపర్ అప్డేట్ !

  • Published May 23, 2025 | 12:21 PM Updated Updated May 23, 2025 | 12:21 PM

దాదాపు ఐదేళ్లుగా పవన్ ఫ్యాన్స్ ను ఊరిస్తూనే ఉన్న హరి హర వీరమల్లు మూవీ షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ అయింది. జూన్ 12 ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేయనుంది. ఇక ఈ సినిమా కాకుండా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరో మూవీ 'OG'. ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పనులు ఎప్పుడో ప్రారంభం అయ్యాయి.

దాదాపు ఐదేళ్లుగా పవన్ ఫ్యాన్స్ ను ఊరిస్తూనే ఉన్న హరి హర వీరమల్లు మూవీ షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ అయింది. జూన్ 12 ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేయనుంది. ఇక ఈ సినిమా కాకుండా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరో మూవీ 'OG'. ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పనులు ఎప్పుడో ప్రారంభం అయ్యాయి.

  • Published May 23, 2025 | 12:21 PMUpdated May 23, 2025 | 12:21 PM
OG ఐటెం సాంగ్ గురించి సూపర్ అప్డేట్ !

పవన్ కళ్యాణ్ అభిమానులంతా కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ పవన్ కళ్యాణ్ నుంచి సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. దాదాపు ఐదేళ్లుగా పవన్ ఫ్యాన్స్ ను ఊరిస్తూనే ఉన్న హరి హర వీరమల్లు మూవీ షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ అయింది. జూన్ 12 ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేయనుంది. ఇక ఈ సినిమా కాకుండా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరో మూవీ ‘OG’. ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పనులు ఎప్పుడో ప్రారంభం అయ్యాయి. నిజానికి గత ఏడాదే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వలన సినిమా పోస్ట్ పోన్ అయింది.

ఇక ఆ తరవాత పవన్ ముందు వీరమల్లు సినిమాను ఫినిష్ చేశారు. ఇక ఇప్పుడు OG ని రీస్టార్ట్ చేశారు. గ్యాంగ్ స్టార్ బ్యాక్డ్రాప్ తో ఈ మూవీ తెరకెక్కబోతుంది. పవన్ ఫ్యాన్స్ లో చాలా మంది వీరమల్లు కంటే OG కోసమే వెయిట్ చేస్తున్నారు. అందుకే OG పై ఒకింత ఎక్కువ అంచనాలే ఉన్నాయి. అయితే సుజిత్ ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ ను ప్లాన్ చేస్తున్నాడట. ఈ ఐటెం సాంగ్ వెనుక చాలా స్పెషాలిటి దాగి ఉందట. ఈ సాంగ్ కు తమన్ సంగీతం అందించగా.. తమిళ స్టార్ నటుడు శింబు పాడబోతున్నాడట.

ఆల్రెడీ దీనికి సంబందించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు సమాచారం. ఈ మధ్య కాలంలో శింబు హైదరాబాద్ లోని ఓ ప్రెస్ మీట్ లో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఇక ఇంకొక విశేషం ఏంటంటే ఈ సాంగ్ లో తమన్నా కనిపిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ పవన్ తో కలిసి తమన్నా ఆదిపడుతుందా అంటే దానికి మాత్రం ఇంకా సమాధానం లేదు. ఇది అసాధ్యమే అని అంటున్నారు. సో ఇక అసలు విషయం ఏంటో తెలియాల్సి ఉంది. ఇక పవన్ కళ్యాణ్ OG ని ఎట్టి పరిస్థితిలో ఈ ఏడాదిలో ప్రేక్షకులకు చూపించాలని గట్టి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.