BSNL నుంచి రూ. 197కే 70 రోజుల రీఛార్జ్ ప్లాన్!

BSNL: బిఎస్ఎన్ఎల్ తక్కువ ధరలతో వినియోగదారుల కోసం ప్రీపెయిడ్ ప్లాన్ లని ప్రవేశపెడుతుంది. తాజాగా మరో రీఛార్జ్ ప్లాన్ ని తీసుకొచ్చింది.

BSNL: బిఎస్ఎన్ఎల్ తక్కువ ధరలతో వినియోగదారుల కోసం ప్రీపెయిడ్ ప్లాన్ లని ప్రవేశపెడుతుంది. తాజాగా మరో రీఛార్జ్ ప్లాన్ ని తీసుకొచ్చింది.

టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలని పెంచాక మధ్య తరగతి ప్రజలు ఎంతో నిరుత్సాహానికి గురవుతున్నారు. జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలు రేట్లు పెంచడంతో నెటిజనులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యంగా జియో రేట్లు పెరిగినందుకు సోషల్ మీడియాలో చాలా తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఇక ఇలా టారిఫ్ రేట్లు పెరిగిన తర్వాత టెలికాం యూజర్స్ చూపంతా కూడా బిఎస్ఎన్ఎల్ పై పడింది. అందరూ ఈ ప్లాన్స్ పైన ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే, అతి చవక దరలో మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా ఉంటుంది బిఎస్ఎన్ఎల్. అంతేగాక ఎక్కువ రోజుల వ్యాలిడిటీని అందించే ఏకైక టెలికాం కంపెనీ కూడా బిఎస్ఎన్ఎల్ మాత్రమే. రూ. 200 ఖర్చుతో ఎక్కువ లాభాలు అందిస్తుంది. అలా ఈ కంపెనీ అందించే ఒక బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

తన వినియోగదారులకు కేవలం రూ. 200 కంటే చవక ధరలో ఎక్కువ లాభాలను అందించే ప్లాన్ ని బిఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టింది. అదే, బిఎస్ఎన్ఎల్ రూ. 197 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు విషయానికి వస్తే.. ఈ ప్లాన్ ఏకంగా కస్టమర్లకు 70 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. బడ్జెట్ ధరలో ఎక్కువ కాలం పాటు వ్యాలిడిటీ కోరుకునే వారికి ఈ ప్లాన్ చాలా బెస్ట్ అని చెప్పాలి. ఈ ప్లాన్లో కేవలం ఒక్క వ్యాలిడిటీ మాత్రమే కాదు ఈ ప్లాన్ తో మనం కాలింగ్, డేటా ఇంకా అలాగే SMS వంటి మరిన్ని ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఇంకా అంతేకాదు ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 15 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్ కూడా పొందగలరు.

ఇంకా ఇది మాత్రమే కాదు, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే కస్టమర్లు 15 రోజుల పాటు డైలీ 2GB డేటాని పొందగలరు. ఇది 40kbps స్పీడ్ తో ఉంటుంది. అలాగే డైలీ 100 ఎస్సెమ్మెస్ బెనిఫిట్స్ కూడా 15 రోజుల పాటు పొందుతారు. అయితే, ఈ 15 రోజుల ఉచిత ప్రయోజనాలకు గడువు ముగిసిన తర్వాత మాత్రం చార్జెస్ పడతాయట. లోకల్ కాల్ కి నిమిషానికి రూ. 1, STD కాలింగ్ కి అయితే నిమిషానికి రూ. 1.30, డేటాకి 25p/MB రేట్లు వర్తిస్తాయని తెలుస్తుంది. కానీ ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు రేట్లు పెంచిన ప్రీపెయిడ్ ప్లాన్ లతో పోలిస్తే, ఈ ప్లాన్ అత్యంత చవకైన లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ అనే చెప్పాలి. మరి ఈ ప్లాన్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments