Keerthi
ప్రభుత్వ రంగ సంస్థ BSNL ఇప్పటికే కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం, అలాగే యూజర్స్ సంఖ్యను పెంచుకోవడం కోసం ఎప్పటికప్పుడు కొత్త రీఛార్జ్ ధరలను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా మరోసారి 2 కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రభుత్వ రంగ సంస్థ BSNL ఇప్పటికే కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం, అలాగే యూజర్స్ సంఖ్యను పెంచుకోవడం కోసం ఎప్పటికప్పుడు కొత్త రీఛార్జ్ ధరలను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా మరోసారి 2 కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Keerthi
ఇటీవలే ప్రముఖ టెలికాం కంపెనీలైనా రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడఫోన్ ఐడియాలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి రీఛార్జ్ ధరలు పెంచడంతో పాటు అమలులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ నిర్ణయం పై ఆయా నెట్ వర్క్ యూజర్లు ధరల పెంపుపై ఉక్కిరిబిక్కిరి అవ్వడంతో పాటు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ఆకర్షించే రీఛార్జ్ ధరలు ప్రకటించడంతో అందరూ ఈ చౌకైన ధరల వైపు ఆకర్షితులైవుతున్నారు. అంతేకాకుండా.. BSNL కూడా వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం, అలాగే యూజర్స్ సంఖ్యను పెంచుకోవడం కోసం.. నిరంతరం ప్రయత్నిస్తోంది.
ముఖ్యంగా 4జీ సేవలను సైతం బీఎస్ఎన్ఎల్ స్పీడప్ చేయడం ఇప్పటిక లక్షలాదిమంది యూజర్స్ BSNL నెట్ వర్క్ మారుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త కస్టమర్లను మరింత ఆకర్శించేందుకు సరసమైన ధరలకే బీఎస్ఎన్ఎల్ ఎప్పటికప్పుడు టారిఫ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా బీఎస్ఎన్ఎల్ మరో రెండు కొత్త టారిఫ్ ప్లాన్లను తీసుకొచ్చింది. అపరిమిత కాలింగ్, ఉచిత ఎస్ఎంఎస్, హై-స్పీడ్ 4G డేటా వంటి అనేక ప్రయోజనాలతో కొత్తగా రెండు రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరీ ఆ వివరాలేంటో చూద్దాం.
రూ.108 రీఛార్జ్ ప్లాన్ వివరాలు:
BSNL ఇప్పుడు కొత్తగా రూ.108 రీఛార్జ్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ప్లాన్ లో నేషనల్ రోమింగ్, అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయం కూడా ఉంది. ఇక ఇందులో 28 రోజుల పాటు 1GB హై-స్పీడ్ డేటా కలిగివుంటుంది. కానీ, ఇందులో ఉచిత ఎస్ఎంఎస్ మాత్రం అందుబాటులో లేదు.
రూ. 249 రీఛార్జ్ ప్లాన్ వివరాలు:
BSNL కొత్తగా రూ.249 రీఛార్జ్ ప్లాన్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ప్లాన్ లో నేషనల్ రోమింగ్, అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయంతో కూడా కలిగివుంది. దీంతో పాటు 45 రోజుల పాటు 2GB హై-స్పీడ్ డేటా కూడా కలిగి ఉంది. అలాగే ఇందులో రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు చేసుకోనే సౌకర్యం ఉంది.
మరీ, BSNL నెట్ వర్క్ యూజర్స్ కు అతి తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త 2 రీఛార్జ్ ప్లాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.