Jio, Airtelలకు కోలుకోలేని షాకిచ్చిన BSNL.. రూపాయికే రీఛార్జ్‌ ప్లాన్‌

BSNL-Rs 91 Recharge Plan: సరికొత్త రీఛార్జ్‌ ప్లాన్‌తో జియో, ఎయిర్‌టెల్‌లను కోలుకోలేని విధంగా దెబ్బ తీసింది బీఎస్‌ఎన్‌ఎల్‌. రోజుకు రూపాయి రీఛార్జ్‌తో సరికొత్త ప్లాన్‌ను అమల్లోకి తెచ్చింది. ఆ వివరాలు..

BSNL-Rs 91 Recharge Plan: సరికొత్త రీఛార్జ్‌ ప్లాన్‌తో జియో, ఎయిర్‌టెల్‌లను కోలుకోలేని విధంగా దెబ్బ తీసింది బీఎస్‌ఎన్‌ఎల్‌. రోజుకు రూపాయి రీఛార్జ్‌తో సరికొత్త ప్లాన్‌ను అమల్లోకి తెచ్చింది. ఆ వివరాలు..

ఒకప్పుడు దేశంలో టెలికాం రంగంలో దిగ్గజ కంపెనీగా గుర్తింపు తెచ్చుకున్న బీఎస్‌ఎన్‌ఎల్‌.. ఆ తర్వాత ప్రైవేటు టెలికాం కంపెనీలైన ఎయిర్‌టెల్‌, జియోల రాకతో భారీగా నష్టపోయింది. ఇప్పటి వరకు కోలుకోలేదు. అయితే ఏ టెలికాం కంపెనీలైతే.. బీఎస్‌ఎన్‌ఎల్‌ పరుగుకు చెక్‌ పెట్టాయో.. ఇప్పుడు అదే ప్రైవేటు టెలికాం కంపెనీలు తీసుకున్న నిర్ణయంతో బీఎస్‌ఎన్‌ఎల్‌కు డిమాండ్‌ భారీగా పెరిగింది. గత నెల అనగా జూలైలో ప్రైవేటు టెలికాం కంపెనీలైన ఎయిర్‌టెల్‌, జియోలు రీఛార్జ్‌ ప్లాన్‌ ధరలను ఒక్కసారిగా పెంచిన సంగతి తెలిసిందే. ఒక్కో ప్లాన్‌ మీద 11-25 శాతం వరకు పెంచాయి. ఇది కస్టమర్ల మీద భారాన్ని మోపింది. దాంతో చాలా మంది ఎయిర్‌టెల్‌, జియో వంటి ప్రైవేటు టెలికాం కంపెనీల కస్టమర్లు.. బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారుతున్నారు.

ఒక్క జూలై నెలలోనే లక్షలాది మంది బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్‌ అయ్యారు. ఇక మారుతున్న పరిణామాలకు అనుకూలంగా.. కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది బీఎస్‌ఎన్‌ఎల్‌. వినియోగదారుల కోసం ప్రైవేటు టెలికాం కంపెనీల కన్నా తక్కువ ధరకే రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తేస్తుంది. అలానే 4జీ సేవలను కూడా ప్రారంభించింది. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఎయిర్‌టెల్‌, జియోలకు భారీ షాకిచ్చింది బీఎస్‌ఎన్‌ఎల్‌. కేవలం ఒక్క రూపాయి ధరకే రీఛార్జ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఆ వివరాలు..

ఒకరోజుకి.. ఒక్క రూపాయి..

వినియోగదారుల కోసం కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ అత్యంత చౌకైన రీఛార్జ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. అదే 91 రూపాయల ప్లాన్‌. ఇక దీని వ్యాలిడిటీ 90 రోజులు. అంటే ఒక్క రోజుకు ఒక్క రూపాయి రీఛార్జ్‌ అన్నమాట. ఇంత తక్కువ ధరలో.. ఏ ప్రైవేటు టెలికాం కంపెనీలో కూడా రీఛార్జ్‌ ప్లాన్స్‌ లేవు. ఇక మీదట రావు కూడా. ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌ తెచ్చిన ఈ ప్లాన్‌ను రీఛార్జ్‌ చేసుకుంటే.. కాల్‌ కాస్ట్‌ నిమిషానికి 15 పైసలు పడుతుంది. అలానే కేవలం 1 పైసాకే 1 ఎంబీ డేటా అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌ గ్రామీణ ప్రాంత కస్టమర్లకు బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.

మరో చౌకన ప్లాన​.. రూ.107

బీఎస్‌ఎన్‌ఎల్‌ అందించే మరో చౌకన ప్లాన్‌ రూ.107. దీని వ్యాలిడిటీ ఏకంగా 35 రోజులు. అపరిమిత కాల్‌లకు బదులుగా వినియోగదారులు అన్ని నెట్‌వర్క్‌లలో 200 కాలింగ్ నిమిషాల వరకు మాట్లాడుకోవచ్చు. అయితే ఈ ప్లాన్‌లోని డేటా భత్యం మొత్తం 35 రోజుల వ్యవధిలో 3జీబీకి పరిమితం చేయబడింది. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా 4జీ సేవలతోపాటు తర్వాత క్రమంగా 5జీ సేవలను కూడా అందుబాటులోకి తెస్తామమని ఇటివల కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే జరిగితే.. ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌ మళ్లీ నంబర్‌ 1గా ఎదుగుతుంది.

Show comments